Powerful Dhana Yogas జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాజయోగాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఎవరి జాతకంలో అయితే రాజయోగం ఉంటుందో వారు జీవితంలో పురోగతి సాధించడమే కాదు.. ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
Powerful Dhana Yogas వేద జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి జాతకాన్ని చూసేటప్పుడు గ్రహాలు, వాటి స్థానాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇలా గ్రహాలు, వాటి స్థానాల కలయిక వల్ల జాతకాల్లో కొన్ని రకాల యోగాలు ఏర్పడతాయి. కొన్ని సందర్భాల్లో జాతకాల్లో ఏర్పడే యోగాల వల్ల శుభ ఫలితాలొస్తాయి. మరి కొన్ని సందర్భాల్లో అశుభ ఫలితాలొచ్చే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క యోగం వ్యక్తి జీవితంపై ప్రభావం చూపుతుంది. అందుకే ఒక వ్యక్తి జాతకంలో ఎన్ని రాజ యోగాలు ఉంటే అంత ఎక్కువగా జీవితంలో పురోగతిని సాధిస్తారు. ఇదిలా ఉండగా.. అన్ని యోగాలలో కన్నా ధనయోగం అత్యంత శక్తివంతమైనది. ప్రతి ఒక్కరూ ఈ యోగం తమకు కావాలని కోరుకుంటారు. ఎందుకంటే ధన యోగం పట్టిన వారికి డబ్బుల సమస్యలనేవే ఉండవు. ఆ సమయంలో సంపద అమాంతం పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో 20 సంవత్సరాల తర్వాత ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా నాలుగు రాజయోగాలు ఏర్పడుతున్నాయి. ఈ ధన రాజ యోగాలు ద్వాదశ రాశుల వారిని ప్రభావితం చేస్తాయి. అయితే ఈ రాజయోగం వల్ల నాలుగు రాశుల వారికి మాత్రం విపరీతమైన ఆదాయం పెరుగుతుంది. కెరీర్లోనూ పురోగతికి అవకాశాలు మెరగవుతాయి. ఈ సందర్భంగా ఆ రాశి చక్రాలేవి.. ఆ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…
ధన రాజయోగం ఏర్పరిచే గ్రహాలు..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, 2023లో బుధుడు, శుక్రుడు కలిసి రాజయోగాన్ని ఏర్పరచనున్నారు. ఫిబ్రవరి 15న శుక్రుడు మీనరాశిలో రాజయోగాన్ని ఏర్పరచనున్నాడు. ఆ తర్వాత బుధుడు కూడా ప్రవేశించి రాజయోగం ఏర్పరచడం వల్ల 4 రాశిచక్రాల వ్యక్తులకు సంపద సులభంగా పెరిగిపోతుంది.
February Horoscope 2023 ఫిబ్రవరిలో ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన విజయాలు..! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…
మిధున రాశి(Gemini)..
ఈ రాశి వారు శక్తివంతమైన ధన యోగం కారణంగా ఎక్కువ ఆదాయాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు మీ జాతకంలో బలమైన స్థానంలో ఉంటాడు. దీంతో పాటు గురువుతో కలయిక కారణంగా హన్స్ రాజా యోగం కూడా ఏర్పడుతుంది. ఈ కారణంగా మీరు ఆకస్మిక ధనాన్ని పొందొచ్చు. అంతేకాదు ప్రత్యర్థులపై విజయం సాధించొచ్చు. ఉద్యోగులకు పదోన్నతి లభిస్తుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు రావొచ్చు. బుధ గ్రహం భద్ర రాజయోగాన్ని ఏర్పరచడంతో వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు.
కన్య రాశి(Virgo)..
ఈ రాశి వారికి ధన యోగం వ్లల రావాల్సిన బకాయిలన్నీ వచ్చేస్తాయి. ఈ సమయంలో ఉద్యోగులకు సానుకూల ఫలితాలొస్తాయి. ఈ కాలంలో మీకు డబ్బు, పదవి రెండూ లభిస్తాయి. పరిశోధన రంగంలో ఉండే వారికి అద్భుతమైన విజయాలు దక్కుతాయి. ఈ కాలంలో మీరు విదేశాలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. మరోవైపు ఆర్థిక పరమైన విషయాల్లో పురోగతి ఉంటుంది. మీడియా, బ్యాంకింగ్, సినిమా రంగంలో ఉండే వారు మంచి విజయాలను సాధిస్తారు.
ధనస్సు రాశి(Sagittarius)..
శక్తివంతమైన ధన రాజ యోగం కారణంగా ఈ రాశి వారికి ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలొస్తాయి. ఈ ఏడాది మీకు శని దేవుని అనుగ్రహం కూడా లభిస్తుంది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వారు మంచి ప్రయోజనం పొందొచ్చు. ఈ సమయంలో మీరు ఆస్తి, వాహనాలను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మరోవైపు ఏప్రిల్ తర్వాత ప్రేమలో ఉండేవారు ప్రేమ వివాహాలు చేసుకోవచ్చు. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. వీరు ఎలాంటి పోటీ పరీక్షల్లో అయినా విజయం సాధిస్తారు.
మకర రాశి(Capricorn)..
శక్తివంతమైన రాజయోగం కారణంగా ఈ రాశి వారికి శుభ ఫలితాలొస్తాయి. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాభాలను పొందొచ్చు. దీంతో పాటు మీ ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. శని సంబంధించిన వ్యాపారాలు చేసే వారికి(చమురు, ఇనుము, ఖనిజాలు, పెట్రోల్ ఉత్పత్తులు వంటివి) ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగులకు కార్యాలయంలో అందరి మద్దతు లభిస్తుంది. మీకు ప్రశంసలు లభిస్తాయి.
గమనిక
: ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.
Read
Latest Astrology News
and