Ration Shops: రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. అమల్లోకి వచ్చేసింది

Wheat Flour Distribution: ఏపీలో రేషన్ కార్డు లబ్ధిదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ఇక నుంచి రేషన్ దుకాణాల్లో గోధుమ పిండి కూడా అందజేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. రేషన్ కార్డు దారులకు ఎండియూ వాహనం ద్వారా గోధుమ పిండి పంపిణీ అందజేసి.. ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. గోధుమ పిండి కిలో ప్యాకెట్ ధరను 16 రూపాయలుగా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, మన్యం, అనకాపల్లి మునిసిపాలిటీ పట్టణ ప్రాంతాల్లో గోధుమ పిండి పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారులకు బియ్యం, చక్కెర, కందిపప్పు సరఫరా చేస్తుండగా.. ఇప్పుడు గోధుమ పిండి కూడా ఆ జాబితాలో చేరింది.

ఒక రేషన్ కార్డుపై రెండు కిలోల గోధుమ పిండి అందజేశారు మంత్రి కారుమూరి. దేశవ్యాప్తంగా ఏపీలో ప్రజా పంపిణీ వ్యవస్థ పనితీరుపై ప్రశంసలు వచ్చాయని ఆయన తెలిపారు. పేద వర్గాలకు మరింత మేలు చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పారు. బహిరంగ మార్కెట్లో గోధుమ పిండి కిలో 40 రూపాయలుగా ఉందని.. రేషన్ కార్డు లబ్ధిదారులకు సబ్సిడీ కింది 16 రూపాయలకే అందజేస్తున్నామన్నారు. 

రాష్ట్రంలోని 6,94,755 రేషన్ కార్డుదారులకు లబ్ధి చేకూరనుందని మంత్రి అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారుర. ప్రస్తుతం ఉత్తరాంధ్ర జిల్లాల్లో అమలు చేస్తున్నామని.. త్వరలోనే రాష్ట్రంలోని మిగతా అన్ని జిల్లాలో గోధుమ పిండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. 

ఇటీవలే రాష్ట్రంలోని పేద ప్రజలకు చిరుధాన్యాలను అందించాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. మళ్లీ జొన్నలు, రాగుల పంపిణీ ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. రేషన్‌ కార్డు లబ్ధిదారుల్లో ఎంతమంది చిరుధాన్యాలు తీసుకునేందుకు ఆసక్తి చూసుతున్నారనే విషయంపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. ఒక్కో రేషన్‌ కార్డు కుటుంబానికి 2 కిలోల చొప్పున రాగులు, జొన్నలు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. బియ్యాన్ని 2 కిలోలు తగ్గించి.. వాటికి బదులు 2 కిలోల రాగులు, జొన్నలు అందజేసేలా ప్లాన్ చేస్తోంది. అయితే ప్రజలు అంగీకరిస్తారా లేదా అని పత్రాలపై అధికారులు సంతకాలు కూడా తీసుకుంటున్నారు. ఈ సర్వే పూర్తికాగానే పంపిణీపై కసరత్తు చేయనున్నారు.  

Also Read:  Thalapathy 67 Updates : లోకేష్ సినిమాటిక్ యూనివర్సిటీలోకి సంజయ్ దత్.. విజయ్‌ సినిమా క్యాస్టింగ్ ఇదే

Also Read: Amul Milk Price Hike: అమూల్ పాల ధర రూ.3 పెంపు.. కొత్త ధరలు ఇలా..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *