Shruti Haasan Marriage : అసలు పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా?.. శృతి హాసన్ పోస్ట్ అర్థం అదేనా?

Shruti Haasan Marriage Rumors శ్రుతి హాసన్ జీవితంలో ప్రేమ కథలు తక్కువేమీ కాదు. ఫోటోగ్రాఫర్‌, హీరో సిద్దార్థ్ ఇలా ఇద్దరితో ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టేసింది. ఆస్ట్రేలియన్ ఫోటో గ్రాఫర్‌తో అయితే శ్రుతి హాసన్ పీకల్లోతు ప్రేమలో మునిగింది. అతగాడి కోసం సినిమా కెరీర్‌ను కూడా పక్కన పెట్టేసింది. అయితే అతను తనను కంట్రోల్ చేయాలని చూశాడని, అందుకే బ్రేకప్ చెప్పేశానంటూ శ్రుతి హాసన్ తెలిపింది.

ఆ తరువాత వెంటనే శ్రుతి హాసన్ ప్రేమలో పడింది. శంతను హజారికాతో డేటింగ్ వ్యవహారం బయటకు వచ్చింది. గత కొన్ని ఏళ్లుగా శంతను, శ్రుతి హాసన్ లివ్ ఇన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. ముంబైలోనే ఈ ఇద్దరూ ఒకే ఫ్లాట్‌లో ఉంటారు. కరోనా సమయంలోనూ ఇద్దరూ కలిసే ఉన్నారు. అయితే వీరిద్దరి ప్రేమ వ్యవహారం పెళ్లి వరకు వెళ్తుందా? లేదా? అని అంతా అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు.

[[{“fid”:”261358″,”view_mode”:”default”,”fields”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false},”type”:”media”,”field_deltas”:{“1”:{“format”:”default”,”field_file_image_alt_text[und][0][value]”:false,”field_file_image_title_text[und][0][value]”:false}},”link_text”:false,”attributes”:{“class”:”media-element file-default”,”data-delta”:”1″}}]]

అయితే ఈ మధ్య కోలీవుడ్‌లో ఈ జోడి పెళ్లి రూమర్లు ఎక్కువగా వైరల్ అవుతూ వచ్చాయి. హాసన్ ఫ్యామిలీ కూడా పెళ్లికి ఒప్పుకున్నట్టుగా, త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోన్న జోడి అంటూ రూమర్లు వైరల్ కాసాగాయి. దీనిపై శ్రుతి హాసన్ స్పందించింది. తన ఇన్ స్టా స్టోరీలో అదిరిపోయే కౌంటర్లు వేసి రూమర్లకు పుల్ స్టాప్ పెట్టేసింది.

అమ్మలక్కలు ఇంట్లో కూర్చుని ముచ్చట్లు పెట్టినట్టుగా ఇలా రూమర్లు క్రియేట్ చేస్తున్నారన్నట్టుగా కౌంటర్లు వేసింది. కూల్ ఆంటీస్.. పెళ్లి ఇప్పుడే కాదు.. ఇంకా అసలు అనుకోనే లేదు అన్నట్టుగా చెప్పుకొచ్చింది. ఆమె పద్దతి చూస్తుంటే.. అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశ్యమే లేదన్నట్టుగా కనిపిస్తోంది.

శ్రుతి హాసన్‌కు ఈ సంక్రాంతి బాగా కలిసి వచ్చింది. చిరంజీవి వాల్తేరు వీరయ్య బ్లాక్ బస్టర్ హిట్ అవ్వగా.. బాలయ్య వీర సింహా రెడ్డి సినిమా హిట్టుగా నిలిచింది. ఈ రెండు సినిమాలు హిట్ అవ్వడంతో హీరోయిన్‌గా శ్రుతి హాసన్‌కు కలిసి వచ్చింది.

Also Read:  K Viswanath: కళాతపస్వి కే విశ్వనాధ్ కెరీర్‌లో శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం అన్నీ విజయాలే

Also Read: K Vishwanath’s Death News: కె.విశ్వనాథ్ మృతి.. స్పందించిన చిరంజీవి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *