Sixers Video: భారత్‌ బౌలర్‌కు చుక్కలు..! 5 బంతుల్లో 5 సిక్సులు..! వీడియో

టీ20 క్రికెట్ అంటేనే సిక్సులు, ఫోర్లు.. బాదుడే బాదుడు. చాన్స్ వస్తే చాలు బౌలర్లపై విరుచుకుపడతారు బ్యాటర్లు. తాజాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20లో అలాంటి మెరుపులో కలనిపిస్తున్నాయి. నిన్న జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్‌కు చెందిన రూథర్‌ఫోర్డ్‌ విధ్వసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్‌కు చుక్కలు చూపించాడు. ఒకే ఓవర్‌లో.. అది కూడా ఐదు బంతుల్లోనే ఐదు సిక్సులు బాదడంటే రూథర్‌ఫోర్డ్‌ విధ్వంసం ఏ రేంజ్‌లో సాగిందో అర్ధం చేసుకోవచ్చు.

పాపం యూసుఫ్‌ పఠాన్‌:

రూథర్‌ఫోర్డ్‌ విధ్వసానికి బలైపోయింది మరెవరో కాదు.. మన యూసుఫ్‌ పఠానే..! ఈ లీగ్‌లో డిసర్ట్ వైపర్స్ తరపున ఆడుతున్న రూథర్‌ఫోర్డ్ .. దుబాయ్ క్యాపిటల్స్‌ తరుఫున బరిలోకి దిగిన యూసుఫ్‌ పఠాన్‌పై విరుచుకుపడ్డాడు. మొదటటాస్‌ గెలిచిన వైపర్స్‌ జట్టు బ్యాటింగ్ చేసింది. 16వ ఓవర్‌లో బౌలింగ్‌కు వచ్చిన యూసుఫ్‌ పఠాన్‌ టార్గెట్‌గా రూథర్‌ఫోర్డ్‌ వీరవిహారం చేశాడు. 16వ ఓవర్‌ రెండో బంతి నుంచి చివరి బంతి వరకు వరుసగా ఐదు సిక్సర్లు బాదాడు. స్టైట్‌ సిక్స్‌తో సిక్సుల పరంపర ప్రారంభించిన రూథర్‌ఫోర్డ్‌ స్వీప్ షాట్‌ సిక్సర్‌తో ఓవర్‌ ముగించాడు. నిజానికి తొలి బంతి రూథర్‌ఫోర్డ్‌ ఆడలేదు. తొలి బంతి ఫేస్‌ చేసిన బిల్లింగ్స్‌ సింగిల్‌ తీసి రూథర్‌ఫోర్డ్‌కు స్టైక్‌ ఇచ్చాడు. లేకపోతే అది కూడా సిక్సర్‌గా కొట్టేవాడేమో. మొత్తంగా ఈ ఓవర్‌లో యూసుఫ్‌ పఠాన్‌ 31పరుగులు సమర్పించుకోగా.. అందులో రూథర్‌ఫోర్డ్‌ ఒక్కడే 30పరుగులు పిండుకున్నాడు. మ్యాచ్‌లో పఠాన్ నాలుగు ఓవర్లలో 48 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు.

ఈ ఐదు సిక్సర్ల సాయంతో రూథర్‌ఫోర్డ్ 23 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత 18వ ఓవర్ నాలుగో బంతికి అతను రనౌట్ అయ్యాడు. అంతేకాదు ఈ మ్యాచ్‌లో రూథర్‌ఫోర్డ్‌ ఫిల్డింగ్‌లోనూ అద్భుతంగా రాణించాడు. అదిరిపోయే క్యాచ్‌ పట్టుకున్నాడు. ఇక రూథర్‌ఫోర్డ్ ఐపీఎల్ 2022లో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు తరపున ఆడాడు. ఈ సీజన్‌కి మాత్రం ఆర్‌సీబీ రూథర్‌ఫోర్డ్‌ను వదలుకుంది.

Posted in UncategorizedTagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *