Surya Gochar 2023: సూర్యభగవానుడు కుంభరాశి ప్రవేశం.. ఈ రాశివారికి ప్రభుత్వం ఉద్యోగం పక్కా…

Surya Gochar 2023: జ్యోతిష్యం అనేక సమస్యలను పరిష్కారం చూపుతుంది. గ్రహాల సంచారం మన జీవితంలో చాలా మార్పులను తీసుకువస్తుంది. గ్రహాల రాజు సూర్యదేవుడు ఫిబ్రవరి 13 ఉదయం 9.57 గంటలకు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఇప్పటికే శనిదేవుడు అదేరాశిలో కూర్చుని ఉన్నాడు. ఈ రెండు రాశుల కలయిక కారణంగా కొన్ని రాశులవారి అదృష్టం ప్రకాశించనుంది. సూర్య గ్రహ సంచారం వల్ల వీరికి సమాజంలో గౌరవంతో ఆర్థిక ప్రయోజనాలు లభిస్తాయి. ఆ అదృష్ట రాశులు ఏంటో తెలుసుకుందాం.

సూర్య సంచారం ఈ రాశులకు వరం

ధనుస్సు: కుంభరాశిలో సూర్యుడు సంచారం ధనుస్సు రాశివారి అదృష్టాన్ని ప్రకాశింపజేస్తుంది. ఈరాశివారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు శుభవార్త వింటారు. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇదే తగిన సమయం. మీ తండ్రి సహకారంతో అనుకున్న పనిని పూర్తి చేస్తారు. ప్రతిరోజూ సూర్యభగవానుడికి నీటిని సమర్పించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. 

కన్య: గ్రహాల రాజు యొక్క ఈ సంచారం సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. మీరు శత్రువులపై విజయం సాధిస్తారు. ఆఫీసులో మీ బాధ్యతలు పెరుగుతాయి. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సమాజంలో మీకు మంచి ఇమేజ్ ఏర్పడుతుంది. 

వృషభం: సూర్య భగవానుడి సంచారం వల్ల వృషభరాశి వారికి మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. మీరు మంచి కంపెనీ నుండి జాబ్ ఆఫర్ లెటర్ పొందుతారు. మార్చి 15 నాటికి వ్యాపారులకు భారీ లాభాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. మీరు అద్దె ఇంటిని వదిలి మీ కలల ఇంటికి మారవచ్చు. సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది.

Also Read: Shani Uday 2023: త్వరలో ఉదయించనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులకు ఊహించనంత ధనం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *