Suvarna Sundari Movie Review: ‘సువర్ణ సుందరి’ మూవీ రివ్యూ.. భయపెట్టే హార్రర్ థ్రిల్లర్..

రివ్యూ : సువర్ణ సుందరి (Suvarna Sundari)

నటీనటులు : జయప్రద,పూర్ణ , సాయి కుమార్, సాక్షి చౌదరి, కోట శ్రీనివాస రావు తదితరులు..

సంగీతం: సాయి కార్తీక్

నిర్మాత : ML లక్ష్మీ

దర్శకత్వం: MSN Surya

విడుదల తేది : 12/1/2023

జయప్రద, సాయి కుమార్, పూర్ణ వంటి నటీనటులతో తెరకెక్కించిన చిత్రం సువర్ణ సుందరి. టీజర్, ట్రైలర్‌లతో అంచనాలు పెంచిన సువర్ణ సుందరి సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం ఆడియెన్స్‌ను ఏ మేరకు మెప్పించిందో ఓ సారి చూద్దాం.

కథ విషయానికొస్తే.. 

సువర్ణ సుందరి కథ మొత్తం  త్రినేత్రి అమ్మవారి విగ్రహం చుట్టూ తిరుగుతుంది. కాకపోతే ఆ విగ్రహం వల్ల అంతా వినాశనమే జరుగుతుంది. సువర్ణ సుందరిగా పిలిచే ఆ విగ్రహంలో దుష్టశక్తి ఎలా ప్రవేశించింది? అది అసలు ఎందుకు అలా మారింది? దానికి అంజలి (పూర్ణ) ఎలా బలైంది. సాక్షి (సాక్షి చౌదరి)కి ఆ విగ్రహంతో ఉన్న సంబంధం ఏంటి? విశాలాక్షి (జయ ప్రద) ఆ సువర్ణ సుందరిని అడ్డుకునేందుకు ఏం చేసింది? ఈ కథలో పోలీస్ ఆఫీసర్ గుణ (సాయి కుమార్) పాత్ర ఏంటి? మిగిలిన తదితర విషయాలు తెలియాలంటే థియేటర్‌కు వెళ్లాల్సిందే.

కథనం, టెక్నిషియన్స్ విషయానికొస్తే.. 

సువర్ణ సుందరి కథ ఎంతో అద్భుతంగా అనిపిస్తుంది. ఓ విగ్రహం.. చూడటానికి దేవతలా ఉంటుంది. కానీ అందులో అనంతమైన దుష్ట శక్తి ఉంటుంది. దాని రక్త దాహం తీర్చుకోవడానికి రాజ్యాలను సైతం మట్టు బెట్టేస్తుంది. అది ఎవరి చేతిలో ఉంటే.. వారు రాక్షసుల్లా మారిపోతారు. చుట్టు పక్కల ఉన్న వారిని చంపేసి రక్తం దాహం తీర్చుకుంటారు. వినడానికి ఈ పాయింట్ బాగుంటుంది. అంత శక్తి వంతమైన విగ్రహాన్ని ఎవరు మట్టు బెడతారు.. ఎలా ఆట కట్టిస్తారు.. వంటి పాయింట్లు ప్రేక్షకుడిని తొలిచేస్తుంటాయి. అలాంటి అంశాలను ఎంతో చక్కగా తెరపై ఆవిష్కరించాడు దర్శకుడు MSN సూర్య. అంతేకాదు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. సువర్ణ సుందరి చేసే విధ్వంసం గురించి మొదటి సీన్లోనే చూపించి అందరినీ భయపెట్టేశాడు. భయపెట్టడంలో మాత్రం సువర్ణ సుందరి సక్సెస్ అయింది. ప్రథమార్థంలో సువర్ణ సుందరి ఎంట్రీ ఇచ్చే సీన్లు ఇంట్రెస్టింగ్‌గా ఆడియన్స్‌ను ఎంగేజ్ చేసేలా ఉన్నాయి. ప్రస్తుతం అంటూ మోడ్రన్ ప్రపంచంలో చూపించే సీన్లు కాస్త స్లోగా అనిపించినా.. సువర్ణ సుందరి ఎంట్రీ ఇచ్చాక జరిగే పరిణామాలు అందరినీ ఆకట్టుకుంటాయి.

సెకాండాఫ్‌లో  అసలు కథ ఏమిటనేది  రివీల్ అవుతుంది. సువర్ణ సుందరిని ఎలా అడ్డుకుంటారు..అసలు సువర్ణ సుందరి నేపథ్యం ఏంటి? అనేది తెలిశాక ప్రేక్షకులు ఆశ్యర్యపోయేలా ఉంటాయి. అయితే ఈ సినిమా పాయింట్ గొప్పగా అనిపిస్తుంది. కానీ మేకింగ్‌లో మాత్రం అంత శ్రద్ద కనిపించదేమో అని ప్రేక్షకుడు ఫీల్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాను ఇంకాస్త బాగా తీయోచ్చు కదా? అనే అనుమానం ఆడియెన్స్‌కు కలుగుతుంది.

నటీనటుల విషయానికొస్తే.. 

అంజలి పాత్రలో పూర్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో ఎంతో నిండుగా కనిపిస్తుంది. ప్రజెంట్‌ సీన్లు వచ్చినప్పుడు ఎంతో మోడ్రన్‌గా కనిపిస్తుంటారు. ఇక సాక్షి సైతం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లో అదరగొట్టేస్తుంది. జయ ప్రద తన అనుభవాన్ని చూపించారు. సాయి కుమార్ పాత్ర కూడా ఉన్నంత సేపు ఆకట్టుకుంటుంది. కోట శ్రీనివాసరావు, నాగినీడు, అవినాష్‌ వంటి వారు తమ తమ పాత్రలను అద్భుతంగా పోషించారు. మిగిలిన పాత్రలన్నీ కూడా తమ పరిధి మేరకు నటించారు.

ప్లస్ పాయింట్స్ 

కథ

గ్రాఫిక్ వర్క్స్

చిత్ర నిడివి

మైనస్ పాయింట్స్ 

పాటలు

అక్కడక్కడ బోర్ కొట్టే సన్నివేశాలు

చివరి మాట:  భయపెట్టే సువర్ణ సుందరి

రేటింగ్ : 2.75/5

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *