T20 Worldcup: రిటైర్మెంట్ ప్రకటించిన జోగిందర్ శర్మ వెటరన్ టీమిండియా బౌలర్ జోగిందర్ శర్మ అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ‘టీమిండియాకు ప్రాతినిధ్యం వహించడం నేను సాధించిన గొప్ప గౌరవం. ఈ అవకాశం కల్పించినందుకు బీసీసీకి కృతజ్ఞతలు’ అని లేఖలో పేర్కొన్నాడు.
ధోనీ సారథ్యంలో 2007 టీ20 వరల్డ్ కప్ గెలవడంలో జోగిందర్ కీ రోల్ ప్లే చేశాడు. పాకిస్థాన్ తో జరిగిన ఫైనల్లో చివరి ఓవర్ వేసిన జోగిందర్ మిస్బాను ఔట్ చేశాడు. హర్యానా, రోహ్ తక్ నుంచి వచ్చిన జోగిందర్ 2004లో బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేశాడు. తన కెరీర్ లో 4 వన్డేలు, 4 టీ20లు మాత్రమే ఆడి 5 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ లో చైన్నైకి ప్రాతినిధ్యం వహించాడు. చివరి టీ20 మ్యాచ్ ఆడిన 16 ఏళ్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. జోగిందర్ ప్రస్తుతం హర్యానా డీఎస్ పీగా పనిచేస్తున్నాడు.
©️ VIL Media Pvt Ltd.