Vijay 67: విజయ్ 67వ చిత్రానికి అదిరిపోయే టైటిల్.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్..

Vijay 67 Movie : తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ సినిమా వారసుడు. తమిళంలో వారిసు పేరుతో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ సినిమా సక్సెస్‌‌ను ఎంజాయ్ చేస్తూనే తన 67వ చిత్రాన్ని లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కన్ఫామ్ చేయడంతో పాటు పూజా కార్యక్రమాలతో ఈ సినిమా ప్రారంభమైంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ ప్రోమోతో పాటు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. మాస్టర్ మూవీ తర్వాత మరోసారి లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో విజయ్ ఈ సినిమా చేస్తున్నాడు. ఇక లోకేష్ కనగరాజ్ గతేడాది కమల్ హాసన్‌తో విక్రమ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు. అటు విజయ్ .. ‘వారసుడు’ సక్సెస్‌తో మంచి ఊపులో ఉన్నాడు.తాజాగా విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో వస్తోన్న ఈ రెండో సినిమాపై తమిళంలో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలున్నాయి. ఈ సినిమాలో విజయ్ .. ముంబై గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపించబోతున్నట్టు సమాచారం.

ఇక విజయ్ 67వ సినిమాకు ‘లియో’ అనే టైటిల్ ప్రకటించడంతో పాటు ఓ ప్రోమోను విడుదల చేసారు. బ్లడీ స్వీట్ అంటూ ఈ మూవీకి సంబంధించిన ప్రోమో టైటిల్‌ను విడుదల చేసారు. ఇది ఎంతో ఆసక్తికరంగా ఉంది. ఒక మారుమూల అడవిలో ఉన్న విజయ్‌‌ను పట్టుకోవడానికి కొంత మంది ఆగంతకులు వస్తుంటారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందనేది ఓ స్టైలిష్ పాట రూపంలో ఈ ప్రోమో కట్ చేసారు. ఈ సినిమాను అనిరుథ్ రవిచంద్రన్ ఆర్ఆర్ అదిరిపోయింది. మనోజ్ పరమహంస ఫోటోగ్రఫీ బాగుంది.

ఈ చిత్రాన్ని ఈ యేడాది దీపావళి కానుకగా 19 అక్టోబర్‌న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఈ సినిమాను భారీ రేటుకు సన్ నెట్‌వర్క్ కొనుగోలు చేసింది. అటు డిజిటల్ పార్ట్‌నర్ నెట్‌ఫ్లిక్స్ అంటూ పోస్టర్‌లో వేసారు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లక ముందే ఈ రేంజ్‌లో డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు రూ. 100 కోట్లకు పైగా అమ్ముడుపోవడం విశేషం. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో తమిళం,తెలుగు, కన్నడ, హిందీలో విడుదల చేస్తున్నట్టు ఈ మూవీ ప్రోమో‌లో చూపించారు. విజయ్ మార్క్ మాస్ యాక్షన్ ఎంటర్టేనర్‌గా ఈ సినిమా ఉండనుంది. రీసెంట్‌గా ‘వారసుడు’ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు చేరువైన విజయ్.. మరోసారి తన మార్క్ యాక్షన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.

K Viswanath: విశ్వనాథ్‌లోని నటుడిని వెండితెరకు పరిచయం చేసిన నటుడు కమల్ హాసన్..

ఈ సినిమాలో విజయ్‌తో పాటు యాక్షన్ కింగ్ అర్జున్ కీలక పాత్రలో నటిస్తున్నారు.కేజీఎఫ్ 2 తర్వాత మరోసారి విజయ్ 67వ చిత్రంలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కోసం సంజయ్ దత్‌కు భారీ పారితోషకం ఇవ్వనున్నట్టు సమాచారం.  మరోవైపు విజయ్‌కు జోడిగా త్రిష చాలా యేళ్ల తర్వాత విజయ్‌కు జోడిగా కనిపించనుంది. తమిళ అగ్ర హీరో దళపతి విజయ్ (Thalapathy Vijay) విజయ్ విషయానికొస్తే.. రీసెంట్‌గా ఈయన నటించిన లేటెస్ట్ సినిమా వారిసు. ఈ చిత్రంలో తెలుగులో వారసుడు (Varasudu) పేరుతో డబ్ అయ్యింది. దిల్ రాజు నిర్మాత, రష్మిక మందన్న హీరోయిన్.. మంచి అంచనాల నడుమ ఈ సినిమా జనవరి 14న విడుదలై తెలుగు రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబడుతోంది. ఎట్టకేలకు వారిసు సినిమా తమిళంతో  పాటు తెలుగు బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోవడం విశేషం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *