Xiaomi Electric Car 2023: షియోమీ తొలి ఎలక్ట్రిక్ కార్ వచ్చేసింది.. సూపర్ లుకింగ్! కానీ భారీ జరిమానా

Xiaomi Electric Car MS 11 design and images leak: ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ ‘షియోమీ’.. కార్ మార్కెట్‌లోకి ప్రవేశించబోతోంది. షియోమీ సంస్థ త్వరలో తన మొదటి ఎలక్ట్రిక్ కారును తీసుకొస్తుంది. అయితే ఈ కారు ఇంకా మార్కెట్లోకి రాలేదు. అయితే షియోమీ ఎలక్ట్రిక్ కార్ డిజైన్ అప్పుడే లీక్ అయింది. ఎలక్ట్రిక్ కార్ డిజైన్‌ను లీక్ చేసినందుకు 1 మిలియన్ యువాన్ (రూ. 1,21,58,177)లను పరిహారంగా చెల్లించాలని షియోమీ బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీ కో లిమిటెడ్‌ను కంపెనీ డిమాండ్‌ చేసింది.

Xiaomi MS11:

షియోమీ సరికొత్త ఎలక్ట్రిక్ కార్ పేరు ఎంఎస్ 11 (Xiaomi MS11). 2023 జనవరి 22న బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీ అనుకోకుండా ఎలక్ట్రిక్ కారు ముందు మరియు వెనుక బంపర్‌ల డిజైన్‌ను లీక్ చేసింది. సబ్‌వెండర్ల ద్వారా డ్రాఫ్ట్‌లు లీక్ అయ్యాయని, ఈ ఘటనకు తామేమీ ప్రత్యక్ష బాధ్యత వహించడం లేదని కంపెనీ చెబుతోంది.

1 మిలియన్ యువాన్లు:

బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీ మరియు షియోమీ ఆటో మధ్య ఎలక్ట్రిక్ కారును సంబందించి ఒప్పందం కుదిరింది. ఒప్పందం ప్రకారం.. బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీ ఈ సంఘటనకు బాధ్యత వహించాలి. ఒప్పంద ఉల్లంఘన కారణంగా 1 మిలియన్ యువాన్లను షియోమీకి బీజింగ్ మోల్డింగ్ చెల్లించవలసి ఉంటుంది. 

షియోమీ సీఈవో లీ జున్ మాట్లాడుతూ.. ‘లీక్‌లను కంపెనీ సహించేది లేదు. భాగస్వాములు లేదా సరఫరాదారులు గోప్యతను పాటించాలని ఆశిస్తున్నాము. షియోమీ అటువంటి సంఘటనలను అస్సలు అంగీకరించదు. డిఫాల్టర్లతో కఠినంగా వ్యవహరిస్తుంది. బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీకి జరిమానా నివేదిక పంపాము. ఇది భద్రతను మెరుగుపరచడం ఎలాగో వివరిస్తుంది’ అని అన్నారు. 

షియోమీ ఎంఎస్ 11 కారు డిజైన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కారు స్పోర్టీ డిజైన్‌లో ఉంది. కారు టెస్ట్ డ్రైవింగ్ చాలాసార్లు జరిగింది. అయితే డ్రైవ్ టెస్ట్ చేస్తున్నపుడు ఈ ఫొటోస్ బయటపడలేదు. షియోమీ 2021లో ఎలక్ట్రిక్ రంగంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ రాబోయే 10 సంవత్సరాలలో $10 బిలియన్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోంది.

Also Read: AC Fan: వేసవిలో ఏసీ అవసరం లేదు.. ఈ ఫ్యాన్ కొంటే కాశ్మీర్ లాంటి చల్లదనం! ధర రూ 1375 మాత్రమే

Also Read: Virat Kohli: విరాట్ కోహ్లీ మరింత దూకుడుగా ఆడాలి.. మాజీ ప్లేయర్ సూచన!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *