Xiaomi Car | దిగ్గజ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ షోవోమి ఎలక్ట్రిక్ కారు విభాగంలోకి ఎంట్రీ ఇస్తోంది. మతి పోగొట్టే ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును తయారు చేస్తోంది. స్మార్ట్‌టీవీలు, ల్యాప్ టాప్స్ ఇలా వివిధ రకాల ఎలక్ట్రానిక్స్ విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న షావోమి ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్ల (Electric Vehicle) విభాగంపై కన్నేసింది. కొత్త కారు లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. అయితే కంపెనీ అధికారికంగా కారును లాంచ్ చేయడానికి ముందే కారు ఫోటోలు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. గూగుల్, యాపిల్, సోనీ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు అన్నీ కూడా ఎలక్ట్రిక్ కార్ల (Car) మార్కెట్‌పై కన్నేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు వీటి సరసన షావోమి వచ్చి చేరింది.
షావోమి ఎంఎస్11 పేరుతో కొత్త ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేయబోతోంది. ఈ ఫోర్ డోర్స్ ఎలక్ట్రిక్ కారులో ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. కారు ముందు భాగంలో హెడ్‌లైట్స్ కూడా కొత్త డిజైన్‌తో ఉన్నాయి. వెనుక భాగంలోని టెయిల్ లైట్స్ ఆస్టన్ మార్టిన్ స్టైల్‌లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కారులో వివిధ రకాల సెన్సార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
గ్యాస్ సిలిండర్ ట్రాన్స్‌ఫర్.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఆన్‌లైన్‌లో మార్చుకోండిలా!
ఈ ఎలక్ట్రిక్ కారులో కంపెనీ స్వయంగా తయారు చేసిన సెల్ఫ్ డెవలప్డ్ ఎలక్ట్రిక్ మోటార్‌ను అమర్చారు. అయితే బ్యాటరీలను మాత్రం సీఏటీఎల్, బీవైడీ కంపెనీలు అందించనున్నాయి. ఒక్కసారి చార్జింగ్ పెడితే ఈ షావోమి కొత్త ఎలక్ట్రిక్ కారు 1000 కిలోమీటర్ల మేర వెళ్లొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇందులో 800 వోల్ట్ సిస్టమ్ అంటే 260 కేడబ్ల్యూ పవర్ మోటార్ ఉండొచ్చు.
శుభవార్త.. భారీగా పడిపోయిన బంగారం, వెండి ధరలు.. ఒకేరోజు రూ.2,500 పతనం!
ఇది ఇలా ఉంటే షావోమి కంపెనీ ఎలక్ట్రిక్ కారు ఫోటోలు లీక్ కావడంపై సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా షావోమి ఫోటో లీక్‌కు కారణమైన వెండర్‌పై భారీ జరిమానా విధించినట్లు తెలుస్తోంది. ఏకంగా 148,000 డాలర్ల మేర జరిమానా వేసినట్లు నివేదికలు వెలువడుతున్నాయి. జనవరి 22న బీజింగ్ మోల్డింగ్ టెక్నాలజీ కంపెనీ అనుకోకుండా కారు ముందు, వెనుక బంపర్ల ఫోటోలను లీక్ చేసింది. అయితే సబ్ వెండర్ల ద్వారా ఈ కారు ఫోటోలు లీక్ అయ్యాయని ఈ కంపెనీ పేర్కొంటోంది. అయితే షావోమి, వెండర్ మధ్య జరిగిన ఒప్పందంలో భాగంగా ఫోటో లీక్ అయితే అందుకే వెండరే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో వెండర్‌పై భారీ జరిమానా పడబోతోంది. ఏదేమైనా భవిష్యత్‌లో ఎలక్ట్రిక్ కారు విభాగంలో భారీ పోటీ ఉండనుందని తెలుస్తోంది. ఎందుకంటే చాలా కంపెనీలు ఈ విభాగంపై కన్నేశాయి.