ఉద్యోగాల భర్తీకి NMDC నోటిఫికేషన్‌ విడుదల.. పూర్తి వివరాలివే

Hyderabad NMDC Recruitment 2023 :

ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ (NMDC) పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాల్లోని మొత్తం 42 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు స్పష్టం చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఖాళీల భర్తీకి డిపార్ట్‌మెంటల్/ ఎక్స్‌టర్నల్ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపింది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి ఫిబ్రవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఫిబ్రవరి 17వ తేదీలోగా ఆన్‌లైన్‌ విధానంలో తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. అలాగే పూర్తి వివరాలను

https://www.nmdc.co.in/

వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

మొత్తం ఖాళీలు : 42

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఫైనాన్స్ & అకౌంట్స్) ట్రైనీ – 11

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (మెటీరియల్స్ & పర్చేజ్) ట్రైనీ – 16

అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (పర్సనల్ & అడ్మినిస్ట్రేషన్) ట్రైనీ – 15

అర్హతలు:

పోస్టులను బట్టి వేర్వేరు విద్యార్హతలను నిర్ణయించారు. అభ్యర్థులు పోస్టుల ఆధారంగా బ్యాచిలర్‌ డిగ్రీ, సీఏ (ఇంటర్)/ ఐసీడబ్ల్యూఏ- సీఎంఏ (ఇంటర్), బీఈ, బీటెక్‌, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి. పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అభ్యర్థుల వయస్సు 32 ఏళ్లలోపు ఉండాలి.

నోటిఫికేషన్‌

Singareni : సింగరేణిలో 558 ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే

Singareni SCCL Recruitment 2023 : సింగరేణిలో 558 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల భర్తీకి సంబంధించి ఫిబ్రవరి మొదటి వారంలోగా నోటిఫికేషన్‌ జారీ చేస్తామని సంస్థ డైరెక్టర్‌ ఎస్‌.చంద్రశేఖర్‌ తెలిపారు. మొత్తం పోస్టుల్లో 277 పోస్టులను నిరుద్యోగ అభ్యర్థులతో.. మిగిలిన 281 పోస్టులను ఇంటర్నల్‌ నియామకాల ద్వారా భర్తీ చేయనున్నారు.

మొత్తం ఖాళీలు : 558

30 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 20 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-ఈ అండ్‌ ఎం), 4 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఈ 2 గ్రేడ్‌-సివిల్‌), 4 జూనియర్‌ ఇంజినీర్‌ (ఈ 1 గ్రేడ్‌-సివిల్‌), 11 వెల్ఫేర్‌ ఆఫీసర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 4 ప్రోగ్రామర్‌ ట్రైనీ (ఈ 1 గ్రేడ్‌), 20 జూనియర్‌ కెమిస్ట్‌ లేదా జూనియర్‌ టెక్నికల్‌ ఇన్‌స్పెక్టర్‌, 114 ఫిట్టర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 22 ఎలక్ట్రీషియన్‌ ట్రైనీ (కేటగిరీ-1), 43 వెల్డర్‌ ట్రైనీ (కేటగిరీ-1), 5 శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ (కేటగిరీ-డి) పోస్టులకు అంతర్గత నియామకాలు చేపడతారు.

మిగతా.. 30 జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు; మేనేజ్‌మెంట్ ట్రైనీలు.. మైనింగ్‌ (79); ఎలక్ట్రికల్‌, మెకానికల్‌ (66), సివిల్‌ (18), ఇండస్ట్రియల్‌ ఇంజినీరింగ్‌ (10), ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్ (18), ఐటీ (7), హైడ్రోజియాలజిస్ట్‌ (2), పర్సనల్‌ (22)తో పాటు 3 జూనియర్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, 10 జూనియర్‌ ఎస్టేట్స్ ఆఫీసర్‌, 16 సబ్‌ ఓవర్‌సీర్‌ ట్రైనీ (సివిల్‌) పోస్టుల భర్తీకి నిరుద్యోగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి రాతపరీక్ష నిర్వహిస్తారు.

BPNL : 2826 ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ విడుదల.. టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వాళ్లు అప్లయ్‌ చేసుకోవచ్చు

BPNL Recruitment 2023 : భారతీయ పశుపాలన్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BPNL) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న 2826 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను బట్టి టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ ఉత్తీర్ణులైన వాళ్లు ఈ పోస్టులకు అప్లయ్‌ చేసుకోవచ్చు. ఫిబ్రవరి 5 దరఖాస్తులకు చివరితేది.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి

Secunderabad : సికింద్రాబాద్‌ AOC సెంటర్‌లో 1749 జాబ్స్‌.. ఎంపికైతే రూ.56,900 వరకూ జీతం

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సికింద్రాబాద్‌లోని ఆర్మీ ఆర్డినెన్స్ కార్ప్స్ సెంటర్ (AOC Secunderabad).. 1749 ట్రేడ్స్‌మ్యాన్‌ మెట్‌, ఫైర్‌మ్యాన్‌ (గ్రూప్‌ సీ) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం వంటి ఇతర వివరాలు వివరణాత్మక నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత తెలుసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడిన 21 రోజుల్లోపు దరఖాస్తు గడువు ముగుస్తుంది.

పూర్తి వివరాలకు క్లిక్‌ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *