కొండా సురేఖ ఎన్నికల్లో నిలబడ్తది..గెలుస్తది : కొండా మురళి వరంగల్ తూర్పులో కొండా సురేఖ ఎన్నికల్లో నిలబడుతుంది, గెలుస్తుందని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు కొండా మురళి విశ్వాసం వ్యక్తం చేశారు. 2, 3 సీట్లు అడుగుతున్నారని ప్రచారం చేస్తున్నారని… కానీ తమకు ఒక్క టికెట్ చాలని స్పష్టం చేశారు. తాను నికార్సైన కొండా మురళినని, ఎర్రబెల్లిలాగా మాయమాటలు చెప్పనన్నారు. తన కూతురు ఈ సారి పోటీ చేయదని, ఇప్పుడున్న రాజకీయాలలో ఉండదని తెలిపారు. రాహూల్ గాంధీ స్పూర్తితో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో రోజుకొక డివిజన్ లో పాదయాత్ర చేస్తామని చెప్పారు.
రాహుల్ గాంధీ పాదయాత్ర ప్రపంచంలోనే గొప్ప పాదయాత్ర అని కొండా మురళి కొనియాడారు. తమను ప్రజలు ఆదరిస్తారని, తాము ఎప్పుడూ అవినీతికి పాల్పడలేదని చెప్పారు. తనకు గోపాలపూర్ లో ఉన్న భూమిని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కబ్జా చేశారని ఆరోపించారు. అప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కూడా పట్టుదలతో పాదయాత్ర చేశాడని కొండా మురళి గుర్తు చేసుకున్నారు. -కవిత జాగృతి అని పెట్టారు కానీ.. జాగృతికి తాగుబోతులను తయారుచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని విమర్శించారు. కవిత లిక్కర్ స్కామ్ కు తెరలేపిందన్న ఆయన.. తండ్రి తాగుడు చూసి కవిత లిక్కర్ స్కామ్ లో అడుగుపెట్టిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. సేవా కార్యక్రమలతోనే తాము రాజకీయాలు చేస్తామని తేల్చి చెప్పారు. తాను ఎర్రబెల్లి దయాకర్ రావు లాగా మాయమాటలు చెప్పనన్న కొండా మురళి.. తమకు రాజకీయాలు ముఖ్యం కాదు ప్రజా సేవే ముఖ్యమని స్పష్టం చేశారు. వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాలలో భూ కబ్జాలు చూస్తే బాధనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వరంగల్ సీపీకి సెల్యూట్ అని, ఆయన ఇలానే పని చేయాలని కొండా మురళి సూచించారు. చేస్తే ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ కూడా ఇలానే పని చేయవచ్చని చెప్పారు. -రేషన్ డీలర్ల దగ్గర కూడా బీఆర్ఎస్ నాయకులు డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు.
రేవంత్ రెడ్డితోనే మా ప్రయాణం
కొండా మురళికి తగిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటేనని మాజీ ఎమ్మెల్సీ, కాంగ్రెస్ నాయకులు కొండా సురేఖ చెప్పారు. రేవంత్ రెడ్డితోనే తమ ప్రయాణమని తేల్చి చెప్పారు. రేవంత్ రెడ్డి పాదయాత్రలోనూ తాను పాల్గొంటానని కొండా సురేఖ స్పష్టం చేశారు.
©️ VIL Media Pvt Ltd.