‘గుప్పెడంత మనసు’ అప్‌డేట్స్: రాజీవ్ వెనుక దేవయాని ఉందని కనిపెట్టేసిన జగతి.. ఇక నుంచి ఒకే ఇంట్లో రిషిధార!

నేటి కథనంలో జగతీ, వసులు కలిసిపోయారు. అసలు ఏం జరిగిందో తెలియాలంటే ఈ లింక్ క్లిక్ చేయండి.

Read also:

‘గుప్పెడంత మనసు’ ఫిబ్రవరి 04 ఎపిసోడ్: ఒక్కటైన గురుశిష్యులు.. వసుని గుండెలకు హత్తుకుని క్షమాపణ చెప్పిన జగతి.. సూపర్ సీన్

జగతీ, మహేంద్రలకు నిజం తెలిసిన తర్వాత ఏం జరిగిందంటే..

రిషి.. టెన్షన్‌గా వసు గురించే రాజీవ్ తాళి కట్టలేదన్న విషయం గురించే ఆలోచిస్తాడు. ‘అసలు వసుధారకి రాజీవ్ తాళి కట్టకపోతే ఇంకెవరు కట్టి ఉంటారు. అయినా తనకి అంత దగ్గర మనిషి ఎవరున్నారు? నాకెందుకు తెలియదు?’ అంటూ తెగ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జగతీ, మహేంద్రలు రిషి రూమ్‌కి వస్తారు. రావడం రావడమే మహేంద్ర కొంటెగా నవ్వుతూ.. రిషీ అంటాడు. ఇక రిషి.. ‘మేడమ్ వసుధార ఏమైనా చెప్పిందా? తను ఎవరిని పెళ్లి చేసుకుందో చెప్పిందా?’ అంటాడు కంగారుగా. మొదట జగతీ నిజం చెప్పెయ్యాలి అనుకుంటుంది కానీ.. వసు మాట తీసుకోవడం గుర్తొచ్చి ఆగుతుంది.

‘నాకేం అవసరం రిషీ.. తను ఎవరిని పెళ్లి చేసుకుంటే నాకేం అవసరం.. తను జెస్ట్ ప్రాజెక్ట్ హెడ్ అంతే.. కాలేజ్ లెక్చరర్స్ పెళ్లి చేసుకుంటే మనకు ఎలా అవసరం లేదో ఇది అంతే’ అంటుంది జగతి. మారు మాట్లాడడు రిషి. ‘అవును రిషీ.. కాలేజ్ విషయాలు.. పర్సనల్ విషయాలు వేరు వేరని.. నువ్వే కదా అన్నావ్.. మహేంద్రా ఈ మాట నువ్వు అన్నావా రిషీ అన్నాడా?’ అంటుంది జగతీ కావాలనే. ‘హే.. నేను కాదు.. రిషి రిషీ’ అంటాడు మహేంద్ర నవ్వు ఆపుకుంటూ. ఇక నిజం తెలిసినప్పటి నుంచి మహేంద్ర చిలిపితనం.. నవ్వూ.. ఆ నటన అంతా తిరిగి వచ్చినట్లున్నాయి నేటి కథనంలో.

‘కానీ మేడమ్..’ అంటూ దేవయాని రావడం చూసి రిషి మాట్లాడటం ఆగిపోతాడు. హ.. రండి అక్కయ్యా.. అంటుంది జగతి. దేవయాని లోపలికి వస్తుంది రిషి దగ్గరకు. ‘అక్కయ్యా నాతో ఏమైనా పనా?’ అంటుంది జగతీ. ‘ఏంటి మహేంద్రా రిషిని మనశ్శాంతిగా ఉండనివ్వరా?’ అంటుంది దేవయాని. ‘మనశ్శాంతిగా ఉండు రిషీ అని చెప్పడానికే వచ్చాం అదిగారు’ అంటూ చురకలు వేస్తాడు మహేంద్ర. ఇక దేవయాని రిషితో.. ‘నాన్నా రిషి జరిగిన ఘోరం తెలిసింది.. నేను చాలా బాధపడ్డాను’ అంటుంది. ‘బాధపడటం ఎందుకు వదినగారు.. మీకు వసుధార రిషీని చేసుకోవడం..’ అంటూ మహేంద్ర మరో చురక వేయబోతుంటే.. ‘ఆగు మహేంద్ర నువ్వు ఒకడివి.. అరే తనని నెత్తిన పెట్టుకున్నారు కదా? ఎవరిని చేసుకుందో చెప్పాలి కదా? ఆ రాజీవ్ తాళి కట్టలేదంటే ఇంకెవరో తాళి కట్టే ఉంటారు కదా.. ఎవరు అయ్యి ఉంటారు?’ అంటుంది దేవయాని.

‘అది మనకు ఎలా తెలుస్తుంది వదినగారు.. పోనీ మీరు అడిగేయండి’ అంటాడు మహేంద్ర. ‘ఛీ ఛీ.. నేనెందుకు అడుగుతాను.. అడిగినా చెబుతుందన్న నమ్మకం నాకు లేదు’ అంటుంది దేవయాని. ‘హా.. అవును అక్కయ్యా.. మీరు అస్సలు తగ్గొద్దు.. ఆ వసుధార ఎక్కడా మీరు ఎక్కడా? మీరు స్థాయి తగ్గి అడగొద్దు..’ అంటూ తగులుకుంటుంది జగతి కావాలనే. ‘జగతీ అయినా ఆ వసుధార ఇలా ఎలా చేసింది?’ అంటుంది దేవయాని. ‘అక్కయ్యా మీరేంటీ మీ రేంజ్ ఏంటీ? మీరు వసుధార గురించి అనవసరంగా మాట్లాడి మీ స్థాయి తగ్గించుకోకండి’ అంటుంది జగతి. ‘జగతీ నువ్వే ఇలా మాట్లాడేది?’ అంటుంది దేవయాని. ‘నేనే అక్కయ్యా నేనే.. ఆ వసుధారని తలుచుకుంటుంటే కడుపు మండిపోతుంది. పదా మహేంద్రా మజ్జిగ తాగుతాను.. కడుపు మండిపోతుంది’ అంటూ అక్కడి నుంచి మహేంద్రని తీసుకుని వచ్చేస్తుంది. దేవయానికి ఏం అర్థం కాదు.

ఇక జగతీ, మహేంద్రలు తమ గదిలోకి వెళ్లి ఇదే విషయం గురించి టెన్షన్ పడుతూ ఉంటారు. ‘ఏంటి జగతీ ఇది.. జరిగింది ఏంటీ.. ఇప్పుడు మన రిషి పరిస్థితి ఏంటీ?.. వసుధార నిజం చెప్పనివ్వడంలేదు.. రిషి ఇలా బాధపడాల్సిందేనా’ అంటాడు మహేంద్ర. ‘మహేంద్రా ఇంత జరిగినా కూడా రాజీవ్ గొడవ పెట్టడానికి వచ్చాడంటే.. దీని వెనుక దేవయాని అక్కయ్య ప్రమేయం ఉండే ఉంటుంది..’ అంటుంది జగతి. ‘వదినగారు ఇంకా ఈ విషయంలో ఆలోచిస్తూనే ఉందంటావా?’ అంటాడు మహేంద్ర.

‘మహేంద్రా అక్కయ్య గురించి తెలిసి కూడా నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? తన పెత్తనం కోసం రిషిని బాధపెట్టి అయినా సరే మన మీద పైచేయి సాధించాలని చూస్తుంది.. ఇప్పుడు మన ముందు రెండు సవాళ్లు ఉన్నాయి. ఒకటి దేవయాని అక్కయ్యని మనం ఎలాగైనా అడ్డుకోవాలి.. రెండు వసు, రిషీలను కలపాలి..’ అంటుంది జగతి. ‘కానీ వసు వద్దు అంటుంది. మనం రిషికి నిజం చెప్పలేం.. ఎలా?’ అంటాడు మహేంద్ర. ‘అలా అని మనం ఏం చేయకుండా ఆలోచిస్తామా చెప్పు? వసు మనసు అయినా మార్చాలి.. లేదంటే రిషి, వసులు కలిసి ఉండేలా చూడాలి. అప్పుడే రిషికి నిజం తెలిసే అవకాశం ఉంటుంది’ అంటుంది జగతి. మరి జగతీ అన్నట్లుగా.. రిషికి

వసు జీవితంలో మరొకరు లేరు

అనే క్లారిటీ వచ్చేందుకు వీలుగా ఇద్దరూ ఒకే చోట ఉండేలా.. ఒకే ఇంట్లో ఉండేలా జగతీ, మహేంద్రలు ప్లాన్ చేస్తా? చూడాలి మరి. మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం! Guppedantha Manasu కొనసాగుతోంది. (photo courtesy by star మా and disney+ hotstar)

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *