జిమ్ లో వర్క్ఔట్స్ ఎంతసేపు చేయాలి..? ఫిట్ నెస్ పై నిపుణుల సూచనలివే..!

E.Santosh, News18, Peddapalli

మన శరీరపు బరువును నియంత్రించడానికి, కండరాలను దృఢంగా శక్తివంతంగా ఉంచడానికి, ఎముకలను బలంగా చేయడానికి, వ్యాధి నిరోధక శక్తిని వృద్ధి చెందడానికి వ్యాయామం ఎంతో ఉపయోగ పడుతుంది. అలాగే వ్యాయామం చేయడం వల్ల బాడీ ఫిట్ నెస్ తో ఎలాంటి దుస్తులు ధరించినా అందంగా కనిపిస్తుంది. అందుకే ఇప్పటి యువత ఫిట్ నెస్ పై మక్కువ ఎక్కువ చూపుతున్నారు. ఆరోగ్యంపై పెరిగిన అవగాహనతో ప్రతి ఒక్కరికీ శ్రద్ధ కూడా పెరుగుతుదని అంటున్నారు. అందుకే రోజురోజుకీ కొత్త విషయాలు నేర్చుకుంటూ వర్క్ ఔట్ చేసేస్తున్నారు. హెల్దీగా ఉండేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా (Peddapalli District) గోదావరిఖనిలో నెక్ట్ లెవెల్ జిమ్ సెంటర్ లో కోచ్ సమ్మన్న జిమ్ చేయడం వల్ల ఎటువంటి లాభాలు ఉంటాయో యువకులకు తెలియ జేస్తు వారిని ఫిట్ గా చేసేందుకు వారికి అనుకూలంగా ట్రైనింగ్ ఇస్తున్నాడు.

జిమ్ లో వర్కవుట్స్ చేయడం వల్ల ఫిట్ నెస్ తో పాటు ఆరోగ్యం కూడా బాగుంటుందని.. ముఖ్యంగా అలసట నుండి దూరం చేస్తుందని చెప్పారు. తినకముందు ఎక్సర్సైజ్ చేస్తే రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుందని కోచ్ సమ్మన్న తెలిపాడు. ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజ్ చేస్తే శరీరం ఇన్సులిన్ వాడకాన్ని సమర్థంగా నిర్వహిస్తుందని డయాబెటిస్ తో పోరాడి, జీవక్రియల వేగం పెంచేందుకు ఉపకరిస్తుందని అన్నాడు.

ఇది చదవండి: పంచాయతీ నిధులను తన ఖాతాకు మళ్లించుకున్న ఉద్యోగి

కోచ్ సూచనలతోనే వర్కవుట్స్ చేయాలని లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు ఎదురువుతాయని అంటున్నారు కోచ్. జిమ్ చేసే విధానంలో రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం ఉండాలని చెప్పారు. ఆరోగ్యమే మహా భాగ్యం అని పెద్దలు ఎప్పుడో చెప్పారు. ఎంత సంపాదించినా ఆరోగ్యం లేకుంటే వ్యర్ధమే కాబట్టి అందుకోసం ప్రతి ఒక్కరూ రోజూ ఒక గంట వ్యాయామం చేయాలని అంటున్నారు.

ఏ పరికరం దేనికి ఉపయోగ పడుతుంది..!

పుష్ అప్స్ చేయడం వల్ల బాడీ అనుకున్న విధంగా తయారు అవుతుందని.. స్కట్స్ చేయడం వల్ల త్వరగా బరువు తగ్గుతారని.. డిప్స్ చేయడం వల్ల చెస్ట్ షాప్ వెడల్పు అయి బాడీ ఔట్ లుక్ బాగుంటుందని చెప్పారు. డంబెల్ చేయడం వల్ల కండలు దృఢంగా మారుతాయి. సైక్లింగ్ చేయడం వల్ల రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతుందని.. ఇన్ని లాభాలు ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరూ జిమ్ చేయాలని చెప్పారు. ముఖ్యంగా యువకులు ఈ మధ్య చెడు వ్యసనాలకు అలవాటుపడుతూ ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపకుండా హార్ట్ ఎటాక్ వచ్చిన వార్తలు అనేక సందర్భాల్లో వింటున్నామని చెప్పారు. అలాంటి భయంకర సంఘటనలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ కనీసం రోజుకొక గంట సేపు వ్యాయామ చేయాలని కోచ్ సమ్మన్న తెలిపాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *