దేశంలోనే తొలిసారి బిడ్డకు జన్మనివ్వనున్న ట్రాన్స్ జంట కేరళలోని కోజికోడ్‌కు చెందిన ట్రాన్స్‌జెండర్ జంట జియా, జహాద్‌లు దేశంలోనే తొలిసారిగా బిడ్డకు జన్మనివ్వనున్నారు. గత మూడేళ్లుగా సహజీవనం చేస్తున్న ఈ జంట.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ సంతోషకరమైన వార్తను ప్రకటించింది. ‘తల్లి కావాలనుకునే నా కల, తండ్రి కావాలనుకునే తన (జహాద్) కోరిక త్వరలోనే తీరనునున్నాయి.’ అని అమ్మాయిలా మారిన జియా పావెల్ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. కాలం తమను ఒక చోటికి చేర్చి మూడేళ్లయిందని… 8నెలల జీవన్ మరో రూపం అతని కడుపులో ఉన్నాడని ఆమె తెలిపింది.
దాంతో పాటు వారిద్దరి ఫొటోలను కూడా ఆమె షేర్ చేసింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్ట్ కు వేల కొద్ది లైకులు, కామెంట్లు వచ్చారు. అంతే కాదు వీరి నిర్ణయానికి అభినందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. అందులో స్వచ్ఛమైన ప్రేమకు హద్దులు లేవు అని ఒకరు కామెంట్ చేయగా.. అభినందనలు డియర్స్!! సంతోషంగా ఉండండి, దీర్ఘకాలం జీవించండి అంటూ మరొకరు రిప్లై ఇచ్చారు.
©️ VIL Media Pvt Ltd.