నా కొడుకు ఆచూకీ చెప్పండి.. సీఎం కేసీఆర్ అన్న కూతురు ఆవేదన

తన కొడుకు ఆచూకీ చెప్పండి అంటూ సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు డీజీపీ కార్యాలయానికి వచ్చారు. రమ్య రావు కుమారుడు రితేష్ రావు ఎన్ఎస్‌యూఐ నాయకుడిగా ఉన్నారు. అయితే.. రితేష్ రావును అర్ధరాత్రి సమయంలో వచ్చి పోలీసులు దౌర్జన్యంగా తీసుకెళ్లారంటు రమ్య రావు ఆరోపించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే.. అరెస్టులు చేస్తారా అంటూ మండిపడ్డారు. రితేష్ రావును అరెస్ట్ చేసినట్టయితే.. ఎక్కడున్నాడో చెప్పాలని.. అడిషనల్ డీజీపీ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే టీఆర్ఎస్ నాయకులు ఉద్యయం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారంటూ కీలక ఆరోపణలు చేశారు రమ్య రావు. ఆనాడు దౌర్జన్యాలు చేసిన వారికి నేడు అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అసలు హోంమంత్రి ఉన్నారా.. లేరా.. అంటూ ధ్వజమెత్తారు. హోంమంత్రి ప్రజలకు, మహిళలకు భద్రతగా ఉంటారా లేక తన మనవడికి మాత్రమే భద్రతగా ఉంటారా.. అంటూ నిలదీశారు. వెంటనే పోలీసులు.. తన కొడుకు రితేష్ రావు ఆచూకీ చెప్పాలని.. తనకు క్షమాపణ చెప్పాలని రమ్య రావు డిమాండ్ చేశారు.

“ఫ్రెండ్లీ పోలీస్ అంటారు. పోలీసులు రక్షిస్తారా..? భక్షిస్తారా..? అర్ధరాత్రి పూట వచ్చి దౌర్యన్యం చేశారు. నా కొడుకు బలవంతంగా తీసుకెళ్లారు. ఒకవేళ అరెస్ట్ చేస్తే నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించొద్దా..? విమర్శించొద్దా..? ప్రశ్నించకపోతే ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగేదా..? తెలంగాణ వచ్చేదా..? ఇదే టీఆరెస్ వాళ్లు చాలా మంది ఉద్యమం ముసుగులో ఎన్నో దౌర్జన్యాలు చేశారు. అలాంటి వాళ్లందిరికి ఇవాళ అసెంబ్లీలో రక్షణ కల్పిస్తున్నారు. పోలీసులు వెంటనే.. నా కొడుకు రితేష్ రావు ఆచూకీ చెప్పాలి. నాకు క్షమాపణ చెప్పాలి.” అంటూ సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్య రావు డిమాండ్ చేశారు.

97586440

Read More Telangana News And Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *