నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే (Nellore Rural MLA)కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి(Kotam reddy sridhar reddy)కి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం.ఇప్పటి వరకు ఆయనకు 2 ప్లస్ 2 సెక్యురిటీ (Security)ఉండగా దాన్ని 1ప్లస్ 1కి తగ్గించింది. ఇందుకు ఆయన కూడా సమ్మతిస్తూ సంబంధిత పత్రాలపై సంతకం చేసినట్లుగా తెలుస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గత కొద్దిరోజులుగా తన ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేశాంటూ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. పార్టీలో తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. అంతే కాదు పార్టీలోని నాయకులు తనను అవమానించారని, అనుమానించారంటూ ప్రెస్‌మీట్ పెట్టి మరీ వైసీపీపై తన అసంతృప్తిని వెళ్లగక్కారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.
AP Politics: Jr.NTR పొలిటికల్ ఫ్యూచర్‌పై లక్ష్మీపార్వతి సంచలన వ్యాఖ్యలు..మాటల వెనుక పరమార్ధం అదేనా..!
భద్రత తగ్గింపు ..
కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం పార్టీకి కంట్లో నలుసుగా మారడంతో మంత్రులు, సొంత పార్టీ నేతలు ఆయన ఆరోపణల్ని తప్పు పట్టారు. ఫోన్ ట్యాపింగ్ జరగలేదని..మ్యాన్ టాపింగ్ జరిగిందంటూ టీడీపీలోకి వెళ్లాలనే ఆలోచనతోనే వైసీపీపై బురదజల్లుతున్నారని .. నమ్మి బీఫారమ్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన జగన్‌మోహన్‌రెడ్డికి నమ్మకద్రోహం చేశారంటూ కౌంటర్ ఇచ్చారు. ఈనేపధ్యంలో మరోసారి ప్రెస్‌మీట్ పెట్టి మరీ తాను పార్టీ, ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం వల్ల ఏంజరుగుతుందో తెలుసని..అలాగని ఇష్టం లేని పార్టీలో ఉండలేనంటూ తెగేసి చెప్పారు. తన ఫోన్ ట్యాపింగ్ చేయలేదంటున్న ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు విచారణ చేపట్టమని లేఖ రాయవచ్చు కదా అని ప్రశ్నించారు.
తిరుగుబాటుదారులకు అంతేనా..
నెల్లూరు రూల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వ్యవహారం రోజు రోజుకు ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతూ వస్తోంది. ఇక ఈక్రమంలోనే ఆయనకు భద్రత కూడా తగ్గించి ఉంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికే కాదు ఈమధ్యనే పార్టీ విధానాల్ని తప్పు పట్టిన మరో ఎమ్మెల్యే , మాజీ మంత్రి ఆనం రామానారాయణరెడ్డికి సైతం భద్రత తగ్గించిన విషయం అందరికి తెలిసిందే.
ఇక శాశ్వతంగా పార్టీకి దూరమైనట్లే..
ఇప్పటి వరకు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి విషయంలో పార్టీ నేతలు, పెద్దలు ఏదో విధంగా విషయాన్ని సంధితో చక్కదిద్దే ప్రయత్నం చేయడానికి ప్రయత్నించారు. అయితే రెండు సార్లు ప్రెస్‌మీట్ పెట్టి మరీ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఫోన్ ట్యాపింగ్ ఆధారాలతో సహా బయటపెడతానని చెప్పడంతో పార్టీ కూడా ఆయన్ని వదులుకోవడమే మంచిదన్న ఆలోచనలో ఉన్నట్లుగా తేలిపోయింది.