పిల్లిమొగ్గలేసి పిచ్చెక్కించిన అనంత శ్రీరామ్.. ‘సరిగమప’లో ప్రభుదేవా మరి!

‘సరిగమప ఛాంపియన్‌షిప్’ ప్రోగ్రామ్ మళ్లీ బుల్లితెర ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. గత సీజన్లలానే ఈసారి కూడా ప్రేక్షకులను అటు కామెడీ, ఇటు పాటలతో అలరిస్తోంది ‘సరిగమప’. ఈ షోలో ఎప్పటిలానే యాంకర్ ప్రదీప్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నాడు. అద్భుతమైన కామెడీ టైమింగ్.. తనదైన స్వాగ్‌తో ప్రదీప్ ఆకట్టుకుంటున్నాడు. జడ్జీలుగా సింగర్ మనో, శైలజ, రచయిత అనంత శ్రీరామ్ ఉన్నారు. సరిగమప షో లేటెస్ట్ ప్రోమో ఆకట్టుకుంటోంది. అనంత శ్రీరామ్ డ్యాన్స్.. ప్రోమోలో బాగా హైలెట్ అయింది.

పిల్లిమొగ్గలు

షోలో భాగంగా ఓ సింగర్.. “చిటికె మీద చిటికె వేసెరా.. నా వేళ్లు చూడు” సాంగ్‌ను అద్భుతంగా ప్రజెంట్ చేశాడు. ఈ సాంగ్‌ జడ్జిమెంట్ అయిన తర్వాత.. యాంకర్ ప్రదీప్.. సరదాగా అనంత శ్రీరామ్‌ను స్టేజ్‌పైకి వచ్చి రెండు స్టెప్పులు వేయాలని కోరాడు. ఇలా పిలిచాడో లేదో అనంత శ్రీరామ్.. హుషారుగా పిల్లిమొగ్గలు వెేసుకొని స్టేజ్‌పైకి వచ్చేశారు. ఇది చూసి ప్రదీప్‌తో పాటు అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అంతేనా.. ఆ మాస్‌ సాంగ్‌కు తన స్టైల్లో స్టెప్పులేసి దుమ్ముదులిపారు అనంత శ్రీరామ్.

ఆయన డ్యాన్స్ చూసి అక్కడున్న వాళ్లంతా తెగ ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా మనో అయితే పొట్ట చెక్కలయ్యేలా నవ్వారు. ఈ డ్యాన్స్ చూసిన ప్రదీప్.. “‘సరిగమప’ మీరే ప్రభుదేవా సర్” అంటూ కాంప్లిమెంట్ ఇచ్చాడు. తన జడ్జిమెంట్‌లతో అందరినీ ఆకర్షించే అనంత శ్రీరామ్.. ఈ మధ్య డ్యాన్స్‌తో ఇరగదీయడం అందరినీ బాగా అట్రాక్ట్ చేసింది. ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.

97596031

యశస్వి

ఇక ఈ షోలో పాత సీజన్ల కంటెస్టెంట్లు కూడా ఉండటంతో ప్రేక్షకులు ఈజీగా కనెక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా గతంలో సరిగమప ఓ సీజన్‌ విజేతగా నిలిచిన యశస్వి కూడా ఇందులో ఉన్నాడు. అద్భుతమైన పాటలతో మరోసారి ఆకట్టుకుంటున్నాడు. యశస్వి రావడంతో ఈ ప్రోమో కామెంట్ బాక్స్‌ మొత్తం అతని గురించే కామెంట్లు ఉన్నాయి.

97553710

అయితే ఈ ప్రోమో ద్వారా తెలిసిన మరో విషయం ఏంటంటే.. సింగర్ యశస్వి.. ఓ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమందికి సాయం చేస్తున్నాడు. ఈ విషయాన్ని ప్రదీప్.. షోలో చెప్పాడు. అంతేకాకుండా ఆ ట్రస్ట్‌కు షో ద్వారా తాము కూడా మద్దతు ఇస్తామని ప్రదీప్ ప్రకటించాడు. మొత్తానికి అటు పాటలు, ఇటు కామెడీ, డ్యాన్స్‌లతో సరిగమప అలరిస్తోంది. ప్రోమోతో అదరగొట్టిన టీమ్.. ఎపిసోడ్‌ను కూడా అదే రేంజ్‌లో చేసిందని ప్రేక్షకులు ఆశిస్తున్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు ఈ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.

సరిగమప ఛాంపియన్‌షిప్ లేటెస్ట్ ప్రోమో చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయండి

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *