పీఎఫ్ విత్ డ్రా కొత్త రూల్.. పాన్ కార్డ్ హోల్డర్స్‌కి అలర్ట్.. అలా చేస్తే భారీగా ట్యాక్స్!

PF New Rule: పార్లమెంట్‌లో వచ్చే ఆర్థిక ఏడాదికి సంబంధించిన వార్షిక బడ్జెట్ 2023-24ను ప్రవేశపెట్టిన క్రమంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF)పథకంలో పన్ను వర్తించే అంశంలో నాన్-పాన్ కేసులకు సంబంధించి ట్యాక్స్ డిడక్షన్ అట్ సోర్స్ (టీడీఎస్) ను 30 శాతం నుంచి 20 శాతానికి తగ్గిస్తున్నట్లు ప్రతిపాదించారు. అయితే, ఇతర ఇన్‌కమ్ ట్యాక్స్ నిబంధనల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ఆదాయపు పన్ను నిబంధలన ప్రకారం.. ఈపీఎఫ్ ఖాతాదారు 5 ఏళ్లలోపే ఈపీఎఫ్ విత్ర్ డ్రా చేయడానికి ప్రయత్నించినప్పుడు.. ఆ మొత్తం అమౌంట్‌కు ట్యాక్స్ వర్తిస్తుంది. దాంతో పాటు పీఎం కాంట్రిబ్యూషన్ ఏడాదికి రూ.2.5 లక్షలకు మించిన సందర్భంలోనూ ట్యాక్స్ వర్తిస్తుంది.

ప్రస్తుతం ఈపీఎఫ్ ఖాతాలకు పాన్ కార్డ్ లింక్ చేయాని కేసులకు సంబంధించి ఈపీఎఫ్ స్కీమ్ నుంచి ట్యాక్స్ వర్తించే నగదు ఉపసంహరణపై టీడీఎస్ రేటు 30 శాతంగా ఉంది. దీనిని 20 శాతానికి తగ్గిస్తున్నట్లు బడ్జెట్‌లో ప్రతిపాదించారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. అది వచ్చే ఆర్థిక సంవత్సరం 2023, ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వస్తుంది. నాన్-పాన్ కేసులకు సంబంధించి పీఎఫ్ కొత్త విత్ డ్రా నిబంధనలపై ముంబయికి చెందిన ట్యాక్స్ నిపుణులు బల్వంత్ జైన్ వివరించారు.

ఈపీఎఫ్ ఖాతా తెరిచిన 5 ఏళ్లలోపే పీఎం డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు మొత్తం అమౌంట్‌‌కు ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే, పీఎఫ్ ఖాతాతో పాన్ కార్డ్ లింక్ చేసి ఉన్నట్లయితే విత్ డ్రా చేసే నగదుకు టీడీఎస్ వర్తించదు. పాన్ కార్డ్ జత చేయని పీఎం ఖాతాల విషయానికి వస్తే ఆ ఖాతా నుంచి టీడీఎస్ అమౌంట్ కట్ చేస్తారు. ప్రస్తుతం టీడీఎస్ 30 శాతంగా ఉంది. అది 2023, ఏప్రిల్ 1 నుంచి 20 శాతానికి తగ్గుతుంది. 5 ఏళ్లకు ముందే పీఎం అమౌంట్ విత్ డ్రా చేసినప్పుడు ఉపసంహరణ చేసిన నగదును ట్యాక్స్ చెల్లించాల్సిన మొత్తానికి కలిపి పన్ను విధిస్తారు. ‘ అని జైన్ తెలిపారు.

ఈపీఎఫ్ ఖాతా తెరిచిన తర్వాత 5 ఏళ్లలోపే నగదు ఉపసంహరణ చేసినప్పుడు ఉద్యోగులకు అధిక పన్ను చెల్లించాల్సి వస్తుంది. పాన్ కార్డ్‌ను లింక్ చేసినప్పుడు దాని నుంచి తప్పించుకోవచ్చు. వచ్చే ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించి ఆదాయపు పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) ఫైలింగ్ చేసే టప్పుడు పాన్ కార్డ్ హోల్డర్స్ తప్పనిసరిగా ఈ విషయాన్ని తనిఖీ చేసుకోవాలి. పీఎం విత్ డ్రా చేశామా లేదా పాన్ కార్డ్ పీఎం ఖాతాతో లింక్ చేశామా అనే విషయాన్ని చెక్ చూసుకుని ఐటీఆర్ ఫైలింగ్ చేయడం చాలా ముఖ్యమైన విషయమని ట్యాక్స్ నిపుణులు సూచిస్తున్నారు.

Read Latest

Business News and Telugu News

Also Read:

అదానీ గ్రూప్ సంచలనం.. ఇన్వెస్టర్లందరికీ తిరిగి డబ్బులు.. అసలేమైంది?

అదానీ సంక్షోభంపై స్పందించిన ‘ఆర్‌బీఐ’.. బ్యాంకుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు!

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

అదానీకి ఆ 3 బ్యాంకుల నుంచే రూ.40,000 కోట్లు..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *