మళ్లీ సినిమాలతో బిజీ కానున్న సామ్ ! యశోద సినిమాతో భారీ విజయాన్ని మూటగట్టుకున్న స్టార్ హీరోయిన్ సమంత తిరిగి సినిమాలతో బిజీ కానుందన్న వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. నటుడు వరుణ్ ధావన్ తో సిటాడెల్ అనే వెబ్ సిరీస్ లో సమంత నటిస్తోంది. ముంబైలో ఈ యాక్షన్ సిరీస్ చిత్రీకరణ షురూ అయిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే సామ్ చేసిన ఓ పోస్ట్ ఆ వార్తలు నిజమేనని నిరూపించేవిగా ఉన్నాయి. ఈ ఫొటోల్లో చిత్ర యూనిట్ తో సామ్ ముచ్చటిస్తూ కనిపించింది.
దాంతో పాటు షేర్ చేసిన మరొక ఫొటోలో సమంత బెడ్ పై పడుకొని ఉంది. అంటే సైలెన్స్‌తో లేవలేని స్థితి నుంచి మళ్లీ మామూలు స్థితికి వచ్చానని సామ్ చెప్పకనే చెప్పింది. ఈ పోస్ట్ తో సమంత మళ్లీ సినిమాలను చేయనుందని ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతో దాదాపు ఏడెనిమిది నెలలు మయోసైటిస్ వ్యాధితో బాధపడిన సమంత.. ఇప్పుడు కోలుకుందని సామ్ అభిమానులు సంబరపడిపోతున్నారు. ఇక సిటాడెల్ సిరీస్ దర్శకద్వయం రాజ్ అండ్ డీకె దర్శకత్వంలో తెరకెక్కనుంది. అయితే అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ గా భారీ బడ్జెట్ తో దీన్ని నిర్మించబోతుండడం చెప్పుకోదగిన విషయం.
©️ VIL Media Pvt Ltd.