మ‌హేష్ సినిమా ఆడిష‌న్‌.. ఏడుస్తూ బ‌య‌ట కొచ్చేసిన‌ హీరోయిన్‌.. త‌ర్వాత ఏం చేసిందంటే!

సూప‌ర్‌స్టార్ మ‌హేష్ సినిమా ఆడిష‌న్స్ జ‌రుగుతున్నాయి. అందులో హీరోయిన్‌గా ఎవ‌రిని సెల‌క్ట్ చేయాలా అని ద‌ర్శ‌క నిర్మాత‌లు అందులో ముంబైకి నుంచి వ‌చ్చిన అమ్మాయి ఆడిష‌న్స్ ఇచ్చింది. ద‌ర్శ‌క నిర్మాత‌లు ఇచ్చిన టాస్క్‌ను స‌రిగ్గా చేయ‌లేక ఏడుస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఇక సినిమాల‌కు దూరంగా ఉండాలి. డెస్క్ చేసుకుంటే చాలు అని నిర్ణ‌యించుకుంది. కానీ ఇంత‌కీ మ‌హేష్ సినిమా ఆడిష‌న్స్‌లో అలా ఏడుస్తూ బ‌య‌ట‌కొచ్చిన అమ్మాఇయి ఏం చేసిందో తెలుసా! మ‌ళ్లీ సినిమాల్లోనే న‌టించింది. అది కూడా చిరంజీవి, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల‌తో .. ఇంత‌కీ ఆమె ఎవ‌రో కాదు.. స‌మీరా రెడ్డి.

మహేష్ సినిమాకు ఆడిష‌న్‌కు వెళ్లి స‌రిగ్గా చేయ‌లేక ఏడుస్తూ బ‌య‌ట‌కు వ‌చ్చేసిన విషయం గురించి సమీరా రెడ్డినే చెప్పింది. ‘‘1998లో నేను మొద‌టి సారి ఆడిష‌న్‌కు వెళ్లాను. ఆ సినిమాలో హీరో మ‌హేష్ బాబు. ఆడిష‌న్‌లో ఇచ్చిన టాస్క్ చేయ‌లేకపోయాను. అక్క‌డి నుంచి ఏడ్చుకుంటూ వ‌చ్చేశాను. అంత‌కు ముందు ఏదైతే డెస్క్ జాబ్ చేశానో దాంట్లోకే వెళ్లాల‌ని నిర్ణ‌యించుకున్నాను. కొంత‌కాలానికి ధైర్యం తెచ్చుకుని ఓ ప్రైవేట్ ఆల్బ‌మ్‌లో ధైర్యంగా న‌టించాను. అంటూ కెరీర్ తొలి నాళ్ల‌ను గుర్తు చేసుకుంటూ స‌మీరా రెడ్డి ఓ ఫొటోను షేర్ చేసింది’’ అన్నారు స‌మీరా రెడ్డి.

ఆ ఫొటోను చూసిన నెటిజ‌న్స్ ‘ఇంత‌కీ ఏ మ‌హేష్ సినిమాకు మీరు ఆడిష‌న్స్‌కి వెళ్లారం’టూ ప్ర‌శ్న‌లు వేశారు. కొందరు నెటిజన్స్ అయితే రాజకుమారుడు సినిమాకు వెళ్లి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. సమీరా రెడ్డి … న‌ర‌సింహుడు సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. త‌ర్వాత జై చిరంజీవ, అశోక్ చిత్రాల్లో న‌టించింది. ఇప్పుడు అక్ష‌య్ వ‌ర్దే అనే బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరంగా ఉంటోంది. అయితే సోష‌ల్ మీడియాలో మాత్రం స‌మీరా రెడ్డి చాలా యాక్టివ్‌. త‌న భ‌ర్త‌, పిల్ల‌ల‌తో ఉన్న ఫొటోలు, వీడియోల‌ను ఆమె షేర్ చేస్తుంటుంది.

ALSO READ:

Prabhas – Salaar: ఏప్రిల్‌లో ఫ్యాన్స్‌కి డార్లింగ్ ‘స‌లార్‌’ ట్రీట్‌.. డేట్ ఫిక్స్‌!

ALSO READ:

Kantara: ‘కాంతార’ మరో రికార్డ్.. చిరంజీవి సినిమానే క్రాస్ చేసిన డ‌బ్బింగ్ సినిమా

ALSO READ:

Jr Ntr: క‌ళ్యాణ్ రామ్‌కి మ‌ళ్లీ యంగ్ టైగ‌ర్ స‌పోర్ట్‌.. సెంటిమెంట్ వ‌ర్క‌వుట్ అయ్యేనా!

Read Latest

Tollywood updates and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *