మీ గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలా? ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు

Gas Transfer: ఉద్యోగాలు చేసే వారు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరుచుగా మారుతుంటారు. ఒక ఇంటి నుంచి మరో ఇంటికి మారినప్పుడు ఇంట్లో చాలా ముఖ్యమైన వంట గ్యాస్ కనెక్షన్ మార్చుకోవడంలో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. గ్యాస్ ఏజెన్సీల చుట్టూ తిరుగుతూ విసిగిపోతారు. అలాంటి వారు ఈ పనిని సులభంగా ఇంట్లో నుంచే పూర్తి చేయొచ్చు. ఆన్‌లైన్‌లోనే మీరు గ్యాస్ సిలిండర్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ కోసం అప్లై చేసుకోవచ్చు. అయితే, ఇప్పుడు మనం ఆన్‌లైన్‌లో గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ కోసం ఏ విధంగా అర్జీ పెట్టుకోవచ్చు, ఎలా ప్రక్రియ పూర్తి చేయొచ్చు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

ఇండేన్ గ్యాస్..

ఇండేన్ గ్యాస్ సిలిండర్ వాడుతున్నవారు ముందుగా ఇండియన్ ఆయిల్ వన్ అనే మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయాలి.

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత యాప్‌లోకి లాగిన అవ్వాలి. ఎడమవైపు మూడు లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. వాటిపై క్లిక్ చేయడంతో వివిధ ఆప్షన్లు కనిపిస్తాయి.

ఎల్‌పీజీ, సిలిండర్, ఫ్యూయెల్ స్టేషన్ ఇలా వచ్చిన ఆప్షన్లలో ఎల్‌పీజీ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత కొత్త పేజీలో డొమెస్టిక్, కమర్షియల్ కనెక్షన్ అప్లై అనే ఆప్షన్లు ఉంటాయి.

వీటిల్లో మీరు డొమెస్టిక్ కనెక్షన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త పేజీ ఏపెన్ అవుతుంది.

బుకింగ్ హిస్టరీ, కంప్లైంట్ హిస్టరీ, లాస్ట్ లేదా రీప్లేస్‌మెంట్, మెకానిక్, డీబీసీ, చేంజ్ డిస్ట్రిబ్యూటర్ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. వీటిల్లో మీరు ఛేంజ్ డిస్ట్రిబ్యూటర్ ఎంచుకోవాలి.

ఆ తర్వాత సిటీ అడ్రస్ చేంజ్, పోర్టబిలిటీ, టీవీ అనేవి ఉంటాయి.

వీటిల్లో మీరు మీకు నచ్చిన ఆప్షన్ ఎంచుకోవచ్చు. ఒకవేళ ఒకే సిటీలో వేరే లొకేషన్‌కు గ్యాస్ కనెక్షన్ మార్చుకోవాలంటే సిటీ అడ్రస్ చేంజ్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఒక సిటీ నుంచి మరో సిటీకి గ్యాస్ సిలిండర్ కనెక్షన్ మార్చుకోవాలని భావిస్తే.. టీవీ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. ఇప్పుడు మీరు ఎక్కడికి అయితే సిలిండర్ కనెక్షన్ మార్చుకోవాలని అనుకుంటున్నారో.. ఆ ఏరియా పిన్ కోడ్ నెంబర్ ఎంటర్ చేయాలి.

ఆ తర్వాత మీకు అందుబాటులో ఉన్న డిస్ట్రిబ్యూటర్ లిస్ట్ కనిపిస్తుంది.

మీకు నచ్చిన డిస్ట్రిబ్యూటర్ ఎంచుకోవచ్చు. తర్వాత ఎందుకు సిలిండర్ కనెక్షన్ మార్చుకుంటున్నారో కారణం తెలియజేయాలి. తర్వాత సబ్‌మిట్ బటన్ నొక్కాలి.

దీంతో గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ రిక్వెస్ట్ డిస్ట్రిబ్యూటర్‌కు వెళ్తుంది. వారే మీకు కాల్ చేస్తారు. సిలిండర్ తీసుకెళ్లి వారికి ఇవ్వాలి. ఇలా మీరు సులభక్షంగానే గ్యాస్ కనెక్షన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవచ్చు.

Read Latest

Business News and Telugu News

20కి పైగా రంగాల గురించి సమగ్రమైన సమాచారం తెలుసుకునేందుకు, ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ టైమ్స్ కథనాల కోసం ఎకనమిక్ టైమ్స్ ప్రైమ్‌ను సబ్‌స్క్రయిబ్ చేసుకోగలరు.

Also Read:

అదానీ సంక్షోభంపై స్పందించిన ‘ఆర్‌బీఐ’.. బ్యాంకుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు!

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *