సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు.. ఏఆర్ కానిస్టేబుల్ అరెస్ట్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా చిల్లకల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావు.. పెట్రోలింగ్ చేస్తుండగా సీఎంతో పాటూ కుటుంబ సభ్యులపై తీవ్ర అసభ్య పదజాలంతో వ్యాఖ్యలు చేశారు. ఓ వ్యక్తి ఇదంతా వీడియో తీయగా.. తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉన్నతాధికారుల సీరియస్‌గా తీసుకుని విచారణ జరిపారు. నిర్థారణ కావడంతో చిల్లకల్లు పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్ తన్నీరు వెంకటేశ్వరరావుపై కేసు నమోదైంది. కానిస్టేబుల్ పోలీసుల అదుపులోకి తీసుకున్నారు.

తన్నీరు వెంకటేశ్వరరావు చిల్లకల్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో హైవే పెట్రోలింగ్‌ విభాగంలో ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఈ మధ్య గౌరవరంలో టీ తాగేందుకు ఓ టీస్టాల్ దగ్గర ఆగారు.. ఆ సమయంలో టీస్టాల్ వ్యక్తికి, కానిస్టేబుల్‌కు మధ్య సంభాషణ జరిగింది. వెంకటేశ్వరరావు సీఎంను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ అయ్యింది. వెంకటేశ్వరరావును జీతాలపై టీస్టాల్ వ్యక్తి ప్రశ్నించారు. దీంతో కానిస్టేబుల్ నోటి దురుసుతో బూతులు తిట్టారు. దీంతో ఆయనపై కేసు నమోదైంది.

Read Latest

Andhra Pradesh News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *