సెక్షన్ 80సీ తో లక్షల్లో పన్ను ఆదా! ఏ పెట్టుబడులకు వర్తిస్తుంది?

Section 80C: కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1న వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. సగటు వేతన జీవులకు ఊరట కల్పిస్తూ వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిని రూ.7 లక్షలకు పెంచింది. అయితే, ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 80సీ గురించి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి స్పష్టమైన ప్రకటన చేశారు. అంటే.. 2023-24 ఆర్థిక ఏడాదిలో పాత పన్ను విధానంలోనే కొనసాగే పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80సీ కింద గరిష్ఠంగా రూ.1.5 లక్షల వరకు మినహాయింపులు పొందవచ్చు. అయితే, కొత్త పన్ను స్లాబ్స్, రేట్ల గురించి మాట్లాడుకుంటే.. సెక్షన్ 80సీ కింద 31.2 శాతం పన్ను చెల్లించే వారు రూ.46,800 వరకు ఆదా చేసుకోవచ్చు. అందులోనే 4 శాతం సెస్ ఉంటుంది. కానీ, సర్‌ఛార్జీ వేరేగా ఉంటుంది. పాత పన్ను విధానంలో పూర్తిగా రూ.1.5 లక్షల వరకు రాయితీ పొందవచ్చు.

సెక్షన్ 80సీ కింద రాయితీ పొందే పరిమితిని చివరి సారిగా 2024-25 ఆర్థిక ఏడాదిలో మార్చారు. అప్పుడు రూ.50,000 నుంచి రూ.1 లక్ష. ఆ తర్వాత రూ.1.5 లక్షలకు పెంచారు. 10 ఏళ్ల సమయం గడిచిపోతున్నా సెక్షన్ 80సీ కింద ఎలాంటి మార్పులు చేలేదు. ఈ క్రమంలో సెక్షన్ 80 సీ కింద ఎలాంటి పెట్టుబడులకు మినహాయింపులు లభిస్తాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈఎల్ఎస్ఎస్..

ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ అనేవి మ్యూచువల్ ఫండ్లలో ఒక రకమైనవి. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడుల ద్వారా అధిక రాబడిని పొందే ఉద్దేశంతో వీనిటి రూపొందించారు. వీటిలో పెట్టుబడులకు 3 ఏళ్ల లాకిన్ పీరియడ్ ఉంటుంది. ఈఎల్ఎస్ఎస్ లో పెట్టుబడులు పెట్టడం ద్వారా సెక్షన్ 80 సీ కింద పన్ను రాయితీ పొందవచ్చు.

ఈపీఎఫ్..

ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్, దీనిని పదవీ విరమణ నిధిగా కూడా పిలుస్తారు. ఉద్యోగి జీవితంలో 12 శాతం వరకు ఈ నిధికి వెళుతుంది. 5 ఏళ్ల నిరంతర సర్వీసు తర్వాత ఈపీఎఫ్ బ్యాలెన్స్ వడ్డీతో సహా విత్ డ్రా చేసుకుంటే మొత్తం ఈపీఎఫ్ పై ఎలాంటి పన్ను ఉండదు.

పీపీఎఫ్..

పబ్లిక్ ప్రావిడెండ్ ఫండ్ అనేది ప్రభుత్వ హామీ ఉన్న 15 ఏళ్ల దీర్ఘకాల పెట్టుబడి. ఇందులో డిపాజిట్లకు భారత పౌరులకు మాత్రమే అనుమతి ఉంటుంది. లాక్ ఇన్ పీరియడ్ 15 ఏళ్లు. ఈ పెట్టుబడుల రాబడిపై ఆదాయ పన్ను కూడా లేదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లు..

బ్యాంకుల్లో 5 ఏళ్ల టెన్యూర్ కలిగిన ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఆదాయపు పన్ను సెక్షన్ 80సీ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందేందుకు అర్హత ఉంటుంది.

ఎన్‌పీఎస్..

ఉద్యోగం నుంచి పదవీ విరమణ తర్వాత నేషనల్ పెన్షన్ స్కీమ్ ద్వారా పదవీ విరమణ నిధితో పాటు పెన్షన్ పొందొచ్చు. 80సీ కింద రూ.1.50 లక్షలు మాత్రమే కాకుండా 80సీసీడీ(1బీ) కింద అదనంగా రూ.50 వేల మినహాయింపు పొందవచ్చు. ఇందులో చేరే కనీస వయసు 18 ఏళ్లు కాగా.. గరిష్ఠ వయసు 70 సంవత్సరాలు.

సుకన్య సమృద్ధి యోజన..

10 ఏళ్ల లోపు బాలికల పేరు మీత ఈ సుకన్య సమృద్ధి యోజన ఖాతాను తెరవొచ్చు. ఇందులో కనీసం రూ.250 నుంచి గరిష్ఠంగా రూ.1.50 లక్షలు డిపాటిజ్ చేయవచ్చు. ఇందులో ఏడాదికి రూ.1.50 లక్షల వరకు మదుపు చేసి పన్ను మినహాయింపు పొందవచ్చు.

లైఫ్ ఇన్సూరెన్స్..

భవిష్యత్తును భద్రం చేసుకునేందుకు తీసుకుని లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియంపై కూడా సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు పొందవచ్చు. అయితే, పాలసీ ప్రీమియం బీమా హామీలో 10 శాతానికి మించకూడదు.

హోమ్ లోన్..

పన్ను రాయితీ కోసం హోమ్ లోన్‌ కూడా వర్తిస్తుంది. ఇంటి రుణం కోసం చెల్లించే ఈఎంఐపైఈ సెక్షన్‌లో మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంటి కొనుగోలు సమయంలో చెల్లించే స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జీలు, ఇతర ఖర్చులపై కూడా మినహాయింపు అనుమతిస్తారు.

పిల్లల స్కూలు ఫీజు..

పిల్లల స్కూలు ట్యూషన్ ఫీజుపై 80సీలో మినహాయింపు పొందే వీలుంటుంది. ఇద్దరు పిల్లల వరకు ఈ మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు.

Read Latest

Business News and Telugu News

Also Read:

అదానీ సంక్షోభంపై స్పందించిన ‘ఆర్‌బీఐ’.. బ్యాంకుల పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు!

గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన గోల్డ్, సిల్వర్ ధరలు.. హైదరాబాద్‌లో లేటెస్ట్ రేట్లు ఇవే..

అదానీకి ఆ 3 బ్యాంకుల నుంచే రూ.40,000 కోట్లు..!

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *