Ramanthapur Fire Accident: హైదరాబాద్ నగరంలో వరుస అగ్ని ప్రమాద ఘటనలు ప్రజలను కలవరపాటుకు గురి చేస్తున్నాయి. సికింద్రాబాద్ దక్కన్ మాల్, చిక్కడపల్లి గోదాం, నూతన సెక్రటేరియట్ అగ్ని ప్రమాద ఘటన మరువక ముందే తాజాగా.. మరో ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. రామాంతపూర్‌లోని ఈజీ ఫ్లైవుడ్ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఉన్నట్లుండి పెద్ద ఎత్తున మంటలు చెలరేగి.. వేగంగా వ్యాపిచంటంతో గోదాం మొత్తం కాలి బూడిదైంది.
మంటలు పెద్ద ఎత్తున చెలరేగుతూ ఉండడంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు ప్రాథమికంగా భావిస్తుండగా… ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read More Telangana News And Telugu News