ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ అయ్యారు. రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ (Biswabhusan Harichandan) ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి రామ్ ప్రకాష్ సిసోడియా (Ram Prakash Sisodia) బదిలీ అయ్యారు. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా.. సాధారణ పరిపాలన శాఖ (GAD)లో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సిసోడియా స్థానంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్‌ను ప్రభుత్వం నియమించింది.
ప్రస్తుతం దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న అనిల్‌కుమార్ సింఘాల్‌ను బదిలీ చేయడంతో.. దేవాదాయశాఖ కమిషనర్ ఎం.హరిజవహర్‌లాల్‌కు ఆ శాఖ ముఖ్యకార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్.జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. అనూహ్యంగా గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోడియాను బదిలీ చేయడం ఆసక్తికరంగా మారింది. ఆయనకు ఏ పోస్టింగ్ ఇస్తారన్నది చూడాలి.