BBL: చరిత్ర సృష్టించిన పెర్త్ స్కార్చర్ బిగ్ బాష్ లీగ్ 2023 విజేతగా పెర్త్ స్కార్చర్ నిలిచింది. బ్రిస్బేన్ హీట్తో జరిగిన ఫైనల్లో పెర్త్ స్కార్చర్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పెర్త్ స్కార్చర్కు ఇది ఐదోBBL టైటిల్ కావడం విశేషం. దీంతో బీబీఎల్‌లో అత్యధిక సార్లు విజేతగా నిలిచిన టీమ్ గా పెర్త్ స్కార్చర్ చరిత్ర సృష్టించింది.
ముందుగా బ్యాటింగ్ చేసిన బ్రిస్బేన్ హీట్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. నాథన్ మెక్‌స్వీనీ 37 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 41 పరుగులు చేయగా…, సామ్ హీజ్‌లెట్ 30 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 34 పరుగులతో రాణించాడు. పెర్త్ బౌలర్లలో జాసన్ బెహెండ్రాఫ్, మాథ్యూ కెల్లీ రెండు వికెట్లు దక్కించుకున్నారు. డేవిడ్ పేన్, ఆరోన్ హార్డీ, ఆండ్రూ టై తలా ఓ వికెట్ పడగొట్టారు.
176 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన పెర్త్ స్కార్చర్స్..19.2 ఓవర్లలో 5 వికెట్లకు 178 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టీఫెన్(21), కామెరూన్ బెన్‌క్రాఫ్ట్(15), ఆరోన్ హర్డీ(17) విఫలమయ్యారు. జోష్ ఇంగ్లీస్(26), కెప్టెన్ అష్టోన్ టర్నర్ (53) రాణించారు. చివర్లో కూపర్ కొన్నోలీ(25) విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు.
బీబీఎల్ 2023లో పెర్త్ స్కార్చర్ విజయం సాధించడంతో… బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం భారత్ వచ్చిన ఆస్ట్రేలియా ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. హోటల్ రూమ్‌లో ఈ మ్యాచ్‌ను వీక్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
©️ VIL Media Pvt Ltd.