ChatGPT అంటే ఏంటి? ఈ ఏఐ టూల్ త్వరలోనే గూగుల్‌నే కాదు మానవ మేధనూ మించిపోతుందా?

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ ChatGPT నవంబరు 30న ఖతార్‌లో ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌ను ప్రజలు ఆస్వాదిస్తున్నప్పుడే ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

మనుషులే రాశారా అనేంత కచ్చితత్వంతో కంటెంట్ రాయడం దీని ప్రత్యేకత. అయితే, అక్కడక్కడా చిన్న పొరపాట్లు దొర్లుతున్నాయన్నదీ నిజమే.

పోను పోను అది మరింత మెరుగ్గా మారుతుందనడంలో సందేహం లేదు. ఇప్పుడు దీనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. మరోవైపు, కొందరు దీని పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

రెండేళ్లలో గూగుల్‌ను దెబ్బతీసే సత్తా ChatGPTకి ఉందని ఇటీవల జీమెయిల్ ఫౌండర్ పాల్ బచీట్ కూడా వ్యాఖ్యానించారు.

ఇంటర్నెట్‌లో మీరు ChatGPT రివ్యూలు చదివితే ‘‘డేంజర్’’, ‘‘ముప్పు’’ అనే పదాలు మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. మనుషుల మెదడును అనుకరిస్తూ ఈ టూల్ చాలా వేగంగా మెరుగవుతోందని చాలా మంది చెబుతున్నారు.

లెర్నింగ్, ఎడ్యుకేషన్, డిజిటల్ సెక్యూరిటీ, ఉద్యోగాలతోపాటు ప్రజాస్వామ్య వ్యవస్థలనూ ఈ టూల్ ప్రభావితం చేసే అవకాశముందని తాజాగా అమెరికా పత్రిక న్యూయార్క్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఒకప్పుడు మనం ప్రజల అభిప్రాయాలుగా చెప్పేవాటిని కూడా నేడు ఈ టూల్ నుంచి తీసుకోవచ్చని ఆ కథనంలో పేర్కొన్నారు.

 • మెన్సా: ఈ ఎలైట్ క్లబ్‌లో చేరాలంటే మీ దేశం, మతం, జాతి, వృత్తి, వయసు, డబ్బుతో నిమిత్తం లేదు.. కానీ మనుషుల్లో ‘టాప్ 2’ పర్సంట్‌లో ఉండాలి
 • బిల్ గేట్స్: ఆవు తేన్పులు పర్యావరణహితంగా ఉండాలని ఆయన ఎందుకు కోరుకుంటున్నారు

ఇంతకీ ChatGPT ఏమిటి?

ChatGPT అనేది ఒక చాట్‌బోట్. ఎలాంటి ప్రశ్నలకైనా దాదాపు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం దీని ప్రత్యేకత. అంతేకాదు, మన వ్యక్తిగత సమస్యలపైనా ఇది సలహాలు, సూచనలు ఇవ్వగలదు.

ఈ చాట్‌బోట్‌తో మనం కొత్త కంటెంట్‌ కూడా సృష్టించొచ్చు.

ఉదాహరణకు ChatGPT మీకు సంక్లిష్టమైన, కష్టంతోకూడుకున్న రుచికరమైన వంటకాలను తేలిగ్గా, అర్థమయ్యేలా వివరించగలదు. అంతేకాదు, ఇదే విధానంలో కొత్త వంటలను కూడా మీకు పరిచయం చేయగలదు.

ఉద్యోగాలు వెతుక్కోవడంలో ఇది మీకు సాయం చేయగలదు. అదే సమయంలో కవితలు, పరిశోధన పత్రాలు కూడా రాయగలదు.

ఎలాంటి ప్రశ్నలకైనా క్షణాల్లో సమాధానం చెప్పడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు ప్రముఖ రచయిత షేక్‌స్పియర్ శైలిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌పై ఒక కవిత రాయమని కూడా మీరు అడగొచ్చు.

కొన్ని క్షాణాల్లోనే మీకు ఆ కవిత అందుతుంది. అయితే, కవిత ఇంకా బాగా రాయొచ్చని మీరు భావించొచ్చేమో కానీ.. వేగంలో మీకు ఎలాంటి సందేహాలూ ఉండవు.

ప్రస్తుతం దాదాపు వంద భాషల్లో ChatGPT అందుబాటులో ఉంది. అయితే, ఇంగ్లిష్‌లో దీని కచ్చితత్వం చాలా ఎక్కువ.

ఉదాహరణకు దిల్లీపై ఒక కవిత రాయమని మీరు అడిగారు అనుకోండి. ఇంగ్లిష్, హిందీ కవితల మధ్య తేడా మీరు గమనించొచ్చు. ఇంగ్లిష్‌లో ఇది చాలా మెరుగ్గా కనిపిస్తుంది.

 • అమెరికా-చైనా చిప్ వార్: ఈ యుద్ధంలో యూఎస్ ఎలా గెలుస్తోంది
 • మొబైల్ ఫోన్: సిగ్నల్ అందకపోతే నేరుగా శాటిలైట్‌తో కనెక్షన్, ఇది ఎవరికి అందుబాటులో ఉంటుంది?
 • ఎవరు అభివృద్ధి చేశారు?

  2015లో OpenAI అనే కంపెనీ ChatGPT అభివృద్ధి చేసింది. అప్పట్లో శామ్ ఆల్ట్‌మన్, స్పేస్ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ కలిసి దీన్ని ముందుకు తీసుకొచ్చారు. అయితే, 2018లో ఈ కంపెనీ బాధ్యతల నుంచి ఎలాన్ మస్క్ తప్పుకున్నారు.

  ఆవిష్కరించిన మొదటి ఐదు రోజుల్లోనే ChatGPTకు దాదాపు పది లక్షల మంది యూజర్లు వచ్చారు. యూజర్లు అడిగే ప్రశ్నలు, వారికి ఇచ్చే సమాధానాలు, వాటిపై వారి స్పందనల నుంచి ఇది తనను తాను మెరుగుపరచుకుంటుంది.

  ‘‘టెస్టింగ్, రీసెర్చ్’’ దశల్లో అందరూ ఉచితంగానే దీన్ని ఉపయోగించొచ్చని OpenAI చెబుతోంది.

  అయితే, భవిష్యత్‌లో దీన్ని సబ్‌స్క్రిప్షన్ సేవలుగా అంటే ‘‘డబ్బులు కడితేనే సేవలు’’ దశకు తీసుకెళ్తారని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

  మరోవైపు టెస్టింగ్, రీసెర్చ్ దశల్లో ఈ చార్ట్‌బోట్ కొన్ని తప్పులు కూడా చేసే అవకాశం ఉండొచ్చని కంపెనీ చెబుతోంది. తమ దగ్గర డేటా హిస్టరీ 2021 వరకు మాత్రమే ఉందని కూడా వివరిస్తోంది.

  • పైప్‌బోట్స్: ఈ రోబోలు వాటర్ పైప్స్‌లో లీకేజి లేకుండా చేస్తాయా, లక్షల లీటర్ల నీరు వృథా కాకుండా చూసుకుంటాయా?
  • ఎలాన్ మస్క్: మార్స్ మిషన్ మీద కన్నా ట్విటర్‌లోనే ఎక్కువ కాలం గడుపుతున్నారు.. ఎందుకు

  గూగుల్‌కు సవాల్ విసురుతుందా?

  సమాచారాన్ని శోధించడం, ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కోవడంలో గూగుల్‌ ఆధిపత్యానికి ChatGPT సవాల్ విసురుతోందని చాలా మంది చెబుతున్నారు. అయితే, ప్రస్తుతం ఈ టూల్ కొన్ని తీవ్రమైన తప్పులను కూడా చేస్తోంది.

  ఎంత మంది భారతీయులు ఆస్కార్ గెలుచుకున్నారు? అని అడిగినప్పుడు 2021 వరకు భాను అథయ్యా మాత్రమే ఈ అవార్డు గెలుచుకున్నారని సమాధానం వస్తోంది. ఇంకా చాలా మంది భారతీయులు ఆస్కార్ గెలుచుకున్నారని మనకు తెలుసు.

  ChatGPT సాధారణ భాషలో మనతో మాట్లాడుతోంది. వాక్యాలను చక్కగా మనకు అర్థమయ్యేలా నిర్మించేందుకు అల్గారిథమ్‌లను ఇది ఉపయోగిస్తుంది. వీటినే లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ (ఎల్ఏఎం)లుగా పిలుస్తున్నారు.

  సాఫ్ట్‌వేర్ ట్రైనింగ్ సమయంలో ఈ చార్ట్‌బోట్‌కు ‘‘సిలెండర్ అంటే ఏమిటి?’’లాంటి సాధారణ ప్రశ్నలను నిపుణులు అడుగుతారని సవ్‌పాలో యూనివర్సిటీ ప్రొఫెసర్ అల్వరో మచాడో చెప్పారు.

  దీనికి సమగ్ర సమాధానాలను చాట్‌బోట్‌కు నిపుణులు ఇస్తారు. వీటితో తన సమాధానాలను ఆ బోట్ సరిపోల్చుకుంటుంది.

  ‘‘ఇక్కడ చాట్‌బోట్ సమాధానం సరిగ్గా లేనప్పటికీ, సరైన సమాధానాన్ని అది తీసుకుంటుంది. ఇలా చాలా ప్రశ్నలను అడుగుతారు, చాలా సమాధానాలు ఇస్తారు’’అని అల్వరో చెప్పారు.

  • ఉద్యోగాల కోతల్లోనూ ఈ జాబ్స్‌కు అంత డిమాండ్ ఎందుకు..
  • ఐటీ జాబ్స్ సంక్షోభం: అమెరికాలో భారతీయులకు వెంటనే ఉద్యోగాలు ఎలా దొరుకుతున్నాయి?

  పూర్తిగా మనుషుల్లానే మాట్లాడటాన్ని కూడా ChatGPT నేర్చుకుంటోంది.

  ‘‘దీని ప్రత్యేకత ఏమిటంటే.. అసలు భాష ఎలా ఉంటుంది? మనుషులు ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌తో ఇంకా ఎలా మెరుగుపరచుకోవచ్చు? లాంటి అంశాలను మనం ఇచ్చే సమాధానాలతో ఇది నేర్చుకుంటుంది’’అని అల్వరో చెప్పారు.

  దీన్ని మరింత మెరుగుపరిచేందుకు పగలు, రాత్రి తేడా లేకుండా ఇంజినీర్లు పనిచేస్తున్నారు.

  ‘‘అల్గారిథమ్ ఇస్తున్న సమాధానాలను ఇంజినీర్లు పరిశీలిస్తారు. వీటిని మెరుగుపరుస్తూ, ఫీడ్‌బ్యాక్ ఇస్తుంటారు. మీకు వచ్చే సమాధానం ఒక టెస్టు మెసేజ్‌లానే ఉండొచ్చు. కానీ, వెనుక చాలా జరుగుతుంది’’అని అల్వరో చెప్పారు.

  మరోవైపు తప్పులను కూడా అంగీకరించేలా ChatGPTకి శిక్షణ ఇచ్చారు. ముఖ్యంగా అపోహలను తప్పని చెప్పడం, అభ్యంతరకర ప్రశ్నలకు సమాధానం చెప్పబోనని చెప్పడం కూడా దీనికి నేర్పించారు.

  అయితే, దీని సాయంతో కాలిఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ ఒక ప్రోగ్రామింగ్ కోడ్‌ను రాశారు. ఇది కేవలం తెల్లజాతీయులు, ఆసియా ప్రజలు మాత్రమే మంచి సైంటిస్టులు అవ్వగలరని చెబుతోంది.

  ప్రస్తుతం కొన్ని తప్పుదోవ పట్టించే సమాధానాలను ఈ టూల్ ఇస్తోందని OpenAI అంగీకరిస్తోంది. అయితే, ఈ డేటాతో టూల్‌ను మరింత మెరుగుపరుస్తామని చెబుతోంది.

  • కే-పాప్ వర్చువల్ గర్ల్స్: ఆడతారు, పాడతారు, అభిమానులతో ముచ్చటిస్తారు.. కానీ, అసలైన అమ్మాయిలు కారు
  • పోర్న్ వీడియోలను పిల్లలు చూడకుండా ‘ఏజ్ వెరిఫికేషన్’ అడ్డుకోగలదా?

  సృజనాత్మకతకు ముప్పేనా?

  పదాలు, వాక్యాలపై పనిచేస్తున్న చాలా మంది తమ ఉద్యోగాలను కోల్పోయే ముప్పుందని ఇప్పటికే హెచ్చరికలు వస్తున్నాయి. అంటే, ముఖ్యంగా జర్నలిజంపై దీని ప్రభావం పడుతుందని చెబుతున్నారు.

  ChatGPT మరింత మెరుగైతే జర్నలిస్టుల ఉద్యోగాలు తగ్గుతాయని, ఒక దశలో అసలు వార్త రాయడానికి జర్నలిస్టులే అవసరంలేదని, చార్ట్‌బోట్‌లే మొత్తం పని పూర్తిచేస్తాయని చెబుతున్నారు.

  మరోవైపు కోడ్‌లను రాయడంలో ChatGPT నైపుణ్యం కూడా.. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ రంగంలో ఉద్యోగాల భవిష్యత్‌పై సందేహాలను రేకెత్తిస్తోంది.

  అయితే, అన్నింటికంటే ఎక్కువ ఆందోళన చెందాల్సింది విద్యా రంగమే.

  న్యూయార్క్‌లో విద్యార్థులు తమ అసైన్‌మెంట్లను ChatGPTతో పూర్తి చేసేందుకు ప్రయత్నించారు. దీంతో ఇక్కడ స్కూల్స్‌లో దీనిపై నిషేధం విధించారు. అయితే, చాట్‌బోట్ సృష్టించిన కంటెంట్ ఏదో కూడా తమ టూల్ గుర్తుపట్టగలదని OpenAI చెబుతోంది.

  హోంవర్క్‌లను చాట్‌బోట్‌లతో చేయించడంతోపాటు మరికొన్ని సమస్యలు కూడా ఈ చాట్‌బోట్‌తో చుట్టుముట్టే ముప్పుంది. ఉదాహరణకు పరిశోధన పత్రాలను కూడా ఇలాంటి బోట్‌లతో రాయించేయొచ్చు.

  ‘‘ఐడియాలు కూడా యాంత్రికంగా మారిపోవడాన్ని చూస్తుంటే భయమేస్తోంది. అంటే మన ప్రపంచాన్ని అర్థంచేసుకునే విధానానికి మనం కొంచెంకొంచెంగా దూరం జరిగిపోతున్నాం’’అని సవ్‌పాలో యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ అల్వరో వివరించారు.

  ‘‘చరిత్రను మలుపు తిప్పడంలో మన ఆలోచనలదే ప్రధాన పాత్ర. అయితే, నేడు మెదడుకు మనం పని చాలా తక్కువగా ఇస్తున్నాం. దీనికి టెక్నాలజీ శరవేగంగా అభివృద్ధి చెందడమే కారణం’’అని ఆయన అన్నారు.

  • క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు, అధిక వడ్డీల ఆశచూపి రూ. 4,690 కోట్లు కొట్టేశారు
  • భూమి మీది నీరంతా అంతరిక్షం నుంచి వచ్చిందేనా? ఇంగ్లండ్‌లో రాలిన ఉల్క దానికి సాక్ష్యమా?

  సగం మనిషి.. సగం యంత్రం

  అయితే, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారాల్సి ఉంటుందని ‘‘ఫ్రమ్ జీరో టు మెటావెర్స్’’ పుస్తక రచయిత మార్తా గాబ్రియేల్ చెప్పారు.

  ‘‘ఇక్కడ ప్రధాన అంశం ఏమిటంటే.. సమాధానాలు కాదు, ప్రశ్నలు ముఖ్యం. సరైన ప్రశ్నలను అడిగేలా మన మెదడును మనం సిద్ధం చేయాలి’’అని ఆమె అన్నారు.

  కొత్త టెక్నాలజీతో పిల్లలు ‘‘సగం మనుషులు, సగం యంత్రం’’గా మారే ముప్పుందని బ్రెజిల్‌లోని ఫెడరల్ యూనివర్సిటీకి చెందిన యూరీ లీమా చెప్పారు. ‘‘అసలు ఈ టెక్నాలజీని ఎలా ఉపయోగించుకోవాలో టీచర్ల కూడా నేర్చుకోవాలి’’ అని యూరి చెప్పారు.

  మరోవైపు మానవ సృజనాత్మకత, ఒరిజినల్ కంటెంట్ సృష్టిపైనా ఈ చాట్‌బోట్ ప్రభావం చూపించే అవకాశముందని ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి.

  ఈ టూల్ అందుబాటులోకి వచ్చిన పది రోజుల్లోనే శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఒక డిజైనర్ రెండు రోజుల్లో ఒక పిల్లల పుస్తకాన్ని తయారుచేశారు. ChatGPTతోపాటు మిడ్‌జర్నీగా పిలిచే మరో ప్రోగ్రామ్ సాయం కూడా ఆయన తీసుకున్నారు.

  ‘‘సృజనాత్మకత కోసం బుర్రకు పదునుపెట్టాల్సి ఉంటుంది. అయితే, ఇలాంటి అల్గారిథమ్‌లతో మనం ఆలోచించాల్సిన పని తగ్గిపోతోంది’’అని ప్రొఫెసర్ అల్వరో చెప్పారు.

  ఇవి కూడా చదవండి:

  • కల్పనా చావ్లా: కొలంబియా స్పేస్ క్రాఫ్ట్ కూలిపోతుందని నాసాకు ముందే తెలుసా… ఆ రోజు ఏం జరిగింది
  • అదానీ గ్రూప్: ఎల్ఐసీ పెట్టుబడులపై ప్రశ్నలు ఎందుకు వినిపిస్తున్నాయి
  • నిన్న ఆనం, నేడు కోటంరెడ్డి… నెల్లూరు వైసీపీ నేతల్లో అసంతృప్తి పెరుగుతోందా
  • దావూద్ ఇబ్రహీం: మాఫియా డాన్ హైదరాబాద్ గుట్కా కంపెనీ కథ ఏమిటి? మాణిక్ చంద్, జేఎం జోషి వివాదంలో దావూద్ పాత్ర ఏమిటి?
  • పాకిస్తాన్: కిలో ఉల్లిపాయలు రూ.250… ‘కోయకుండానే కళ్లల్లో నీళ్లు’

  (బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

  Leave a Reply

  Your email address will not be published. Required fields are marked *