February Horoscope 2023 ఫిబ్రవరిలో ఈ మూడు రాశుల వారికి అద్భుతమైన విజయాలు..! ఈ జాబితాలో మీ రాశి కూడా ఉందేమో ఇప్పుడే చూసెయ్యండి…

February Horoscope 2023 ఆంగ్ల నూతన సంవత్సరంలో అప్పుడే ఒక నెల పూర్తయ్యింది. ఇప్పుడు ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టేశాం. ఈ నేపథ్యంలో రెండో నెలలో ఎలాంటి ఫలితాలు రానున్నాయనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

February Horoscope 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, ఫిబ్రవరి మాసంలో నవ గ్రహాలలో కొన్ని ప్రధాన గ్రహాలు తమ స్థానాలను మారనున్నాయి. ముఖ్యంగా సూర్యుడు, బుధుడు, శుక్రుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి సంచారం చేయనున్నారు. ఈ సమయంలో మిధునం, కర్కాటకం, తులా రాశి వారు ఆర్థిక పరమైన విషయాల్లో, పనికి సంబంధించిన విషయాల్లో, వ్యాపార రంగాల్లో ఎక్కువ శ్రద్ధ వహించాలి. అప్పుడే ఈ మూడు రాశుల వారికి విజయం వరిస్తుంది. మూడు గ్రహాల మార్పు వల్ల ఈ రాశులకు శుభ ఫలితాలు రానున్నాయి. మరికొన్ని రాశుల వారికి సమస్యలు ఎదురుకానున్నాయి. ఈ సందర్భంగా ఫిబ్రవరి నెలలో గ్రహాల స్థితి మారడం వల్ల ఏ రాశుల వారిపై ప్రభావం పడుతుందనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి(Aries)..

ఈ రాశి వారికి ఈ నెలలో కెరీర్ పరంగా ఎంతో లాభదాయకంగా ఉంటుంది. వ్యాపారులు మంచి లాభదాయకమైన ఒప్పందాలు చేసుకోవచ్చు. ఉద్యోగులు త్వరలో ప్రమోషన్ పొందొచ్చు. నిరుద్యోగులు కొత్త ఉద్యోగం గురించి శుభవార్తలు వింటారు. మీరు మీ కుటుంబ సభ్యులతో మంచి సాన్నిహిత్యంగా గడుపుతారు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి. మీరు మీ వ్యక్తిగత సంబంధాలలో సంతోషంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగానే ఉంటుంది. మీ మనస్సు మీ కెరీర్ లక్ష్యాలను నెరవేర్చడానికి మరింత ఆసక్తి చూపుతుంది. విద్యార్థులు చాలా బాగా రాణించి పరీక్షల్లో విజయం సాధిస్తారు. మీ జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది.

Sun Jupiter Conjunction 12 ఏళ్ల తర్వాత సూర్యుడు, గురుడి కలయిక.. ఈ 5 రాశుల వారు ధనవంతులవుతారు…! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి…

వృషభ రాశి(Taurus)..

ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో బాగానే ఉంటుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ నెలలో మీరు తెలివిగా వ్యవహరించడం వల్ల కెరీర్లో మంచి లాభాలను ఆశిస్తారు. ఉద్యోగులకు ఉన్నతాధికారులతో సంబంధాలు బాగానే ఉంటాయి. అయితే మీరు అన్ని పనులను సకాలంలో పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. వ్యాపారులు ప్రమాదకర పెట్టుబడులకు దూరంగా ఉండాలి. ఈ కాలంలో కొందరు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టొచ్చు లేదా కొత్త ఇంటికి మారొచ్చు. మీ ఇంట్లో అద్భుతమైన సామరస్య వాతావరణం ఉంటుంది. మీరు మీ వ్యక్తిగత సంబంధాలలో సానుకూలంగా ఉంటారు.

మిధున రాశి(Gemini)..

ఈ రాశి వారికి ఈ నెలలో సానుకూల ఫలితాలొస్తాయి. మీ వ్యాపారాలన్నింటినీ జాగ్రత్తగా చూసుకోవాలి. మీకు సంబంధించిన ప్రతి రంగంలో మీరు నిరంతరం కృషి చేయాలి. మీ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఖర్చులను తగ్గించుకోవడానికి, డబ్బు ఆదా చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించాలి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు అప్పగించొచ్చు. మీ కుటుంబ జీవితంలో సానుకూల వాతావరణం ఉంటుంది. మీరు వారితో మంచి సమయాన్ని గడపగలుగుతారు. మరోవైపు మీ వైవాహిక జీవితంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. విద్యార్థులకు విద్య విషయంలో కొన్ని ఆటంకాలు ఎదురుకావొచ్చు.

కర్కాటక రాశి(Cancer)..

ఈ రాశి వారు ఈ నెలలో గొప్ప అవకాశాలను పొందుతారు. మీరు కొన్ని కొత్త ప్రాజెక్టులను ప్రారంభించగలరు. ఇది మీ కెరీర్‌ను మెరుగుపరుస్తుంది. స్థిరమైన జీవితాన్ని గడపడానికి మీ వ్యక్తిగత జీవితాన్ని సమర్థవంతంగా బ్యాలెన్స్ చేసుకోండి. మీ కుటుంబం మీకు చాలా విషయాల్లో మద్దతునిస్తుంది. మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే, ముందుగా కార్యాలయంలో పెండింగులో ఉన్న పనిని పూర్తి చేయండి. ఈ నెలలో ఉద్యోగ రీత్యా ప్రయాణాలు కూడా చేసే అవకాశం ఉంది. ఈ నెలలో కొత్త ప్రదేశాలు, ఆసక్తి ఉన్న ఇతర ప్రాంతాల గురించి ఆలోచించాలి.

సింహ రాశి(Leo)..

ఈ రాశి వారికి ఈ నెలలో ఆధ్యాత్మిక ఆనందం కలుగుతుంది. మీకు మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఇది మిమ్మల్ని విజయవంతమైన, స్థిరమైన జీవితాన్ని గడపడానికి అవకాశమిస్తుంది. ఈ కారణంగా మీ సహోద్యోగులకు కొంత ఆందోళన పెరగొచ్చు. కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త పెట్టుబడులకు ఇది లాభదాయకమైన సమయం. రిస్క్‌తో కూడిన పెట్టుబడులు పెట్టడానికి నిపుణులు, అనుభవజ్ఞుల సలహా తీసుకోవాలి. రిలేషన్‌షిప్‌లో ఉన్నవారికి, వారి భాగస్వామితో వారి రొమాన్స్ పెరుగుతుంది.

కన్య రాశి(Virgo)..

ఈ రాశి వారికి ఈ నెలలో చాలా ప్రత్యేకంగా అనిపించొచ్చు. ఈ నెలలో మీరు చాలా కొత్త విషయాలను నేర్చుకోగలుగుతారు. ఈ నెలలో మీ జీవితంలో స్థిరత్వం ఉండేలా చూసుకోండి. ఉద్యోగులకు కార్యాలయంలో సహోద్యోగుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వారు మీ పనులను పూర్తి చేయడంలో మీకు సహకరిస్తారు. ఈ నెలలో ఉన్నతాధికారులను మెప్పించగలుగుతారు. మీరు మీ కుటుంబం, బంధువులతో సంబంధాలను మెరుగుపరచుకోవాలి. ఏదైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారికి మీ నిరంతర మద్దతు అవసరం. మీ తల్లిదండ్రులతో కలిసి సెలవులను ప్లాన్ చేయండి.

Unlucky Zodiac Signs ఫిబ్రవరిలో ఈ 4 రాశుల వారి బ్యాంకు బ్యాలెన్స్ భారీగా క్షీణించొచ్చు…!

తుల రాశి (Libra)..

ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసం చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు ఈ నెలలో చాలా విజయాలు సాధిస్తారు. మీ వ్యక్తిగత, వృత్తి జీవితం రెండూ చక్కగా నిర్వహించబడతాయి. ఇది మాత్రమే కాదు, మీరు జీవితంలో ముందుకు సాగడానికి సహాయపడే మీ వ్యక్తిత్వంలోని విభిన్న అంశాలను గుర్తించగలుగుతారు. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో బలంగా ఉంటుంది. మీ ఆదాయం కూడా మెరుగుపడుతుంది. అయితే మీరు ఆదాయాన్ని ఆదా చేసేందుకు ప్రయత్నించాలి. ఎందుకంటే కొన్నిసార్లు నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. కాబట్టి ఇది పెట్టుబడికి సరైన సమయం కాదు. అవాంఛిత వాదనలు మీ మధ్య విభేదాలను పెంచుతాయి కాబట్టి మీ జీవిత భాగస్వామితో తీవ్రమైన సంభాషణలో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి(Scorpio)..

ఈ రాశి వారు ఈ నెలలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి కొన్ని రిస్క్‌లు తీసుకోవడానికి ప్రయత్నించొచ్చు. ఉద్యోగుల కష్టాన్ని, అంకితభావాన్ని సీనియర్లు గుర్తిస్తారు. వారు మీ పనితీరును మరింత మెరుగుపరచగల అదనపు బాధ్యతలను మీకు అందిస్తారు. మీరు ఓపికగా ఉన్నంత వరకు మీ ప్రయత్నాలలో విజయం సాధిస్తారు. మీ కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. అయితే మరోవైపు మీ జీవిత భాగస్వామికి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉండొచ్చు.

ధనస్సు రాశి (Sagittarius)..

ఈ రాశి వారికి ఈ మాసంలో ప్రత్యేక ప్రయోజనాలు కలగనున్నాయి. మీ ఆర్థిక పరిస్థితి ఈ నెలలో స్థిరంగా ఉంటుంది. మీరు ఏదైనా లాభదాయకమైన రంగంలో పెట్టుబడి పెట్టొచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంలో సహాయపడే అందమైన రాబడిని పొందుతారు. మీ ఆదాయాన్ని అనవసరంగా ఖర్చు చేయకుండా ఆదా చేసుకోవడం నేర్చుకోవాలి. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయండి. ఈ కాలంలో ఆధ్యాత్మిక అభివృద్ధిపై దృష్టి పెట్టండి. ఏదైనా కంపెనీలో ఇంటర్న్‌షిప్ ప్రారంభించాలనుకునే విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.

మకర రాశి(Capricorn)..

ఈ వారికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. మీరు వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. మీ లక్ష్యాలను సాధించకుండా ఎవరూ మిమ్మల్ని ఆపలేరు. ఎందుకంటే ఇది మీ విస్తరణకు సమయం. మీ వృత్తి జీవితం బాధ్యతలతో నిండి ఉంటుంది. మీరు నిరంతరం కష్టపడాలి. వ్యాపార అవకాశాల గురించి ఆలోచించడం ప్రారంభించాలి. ఇది మాత్రమే కాదు, మీరు ఆధ్యాత్మిక సంతృప్తిని కూడా పొందుతారు. ఈ కాలంలో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు కుటుంబ సభ్యుల సలహాలు తీసుకోవాలి. మీ బంధువులతో సానుకూల సంబంధాన్ని కలిగి ఉండటానికి ప్రయత్నించాలి.

కుంభ రాశి(Aquarius)..

ఈ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకంగా ఉంటుంది. మీ వృత్తి జీవితం స్థిరంగా ఉంటుంది. మీ సీనియర్లు మీ పనిని చూసి ప్రశంసిస్తారు. వారు మీకు కొత్త బాధ్యతలను అందించే అవకాశం ఉంటుంది. మీ కృషి, అంకితభావం సహోద్యోగులకు స్ఫూర్తినిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. మీరు లాభదాయకమైన ఆదాయ రంగాల్లో పెట్టుబడి పెట్టొచ్చు. మీ వ్యక్తిగత జీవితం వేడుక సానుకూలతతో నిండి ఉంటుంది. మీ తల్లిదండ్రులు మీకు ముఖ్యమైన జీవిత పాఠాలను నేర్పడం ద్వారా జీవితంలో సరైన మార్గంలో నడవడానికి మిమ్మల్ని ప్రేరేపిస్తారు.

మీన రాశి(Pisces)..

ఈ రాశి వారికి ఫిబ్రవరి మాసంలో అన్ని పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించే అవకాశం ఉంది. అయితే ఈ కాలంలో మీరు మీ కెరీర్ ను సీరియస్ గా తీసుకోవాలి. ముందుగా పెండింగులో ఉన్న అన్ని పనులను పూర్తి చేయాలి. ఉద్యోగులు సీనియర్లను ఆకట్టుకోవడానికి ప్రయత్నించాలి. మీ సహోద్యోగులతో స్నేహపూర్వక సంబంధాలను కొనసాగించాలి. అప్పుడే వారు మీకు విజయాన్ని సాధించడంలో సహాయం చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కొన్ని కొత్త పెట్టుబడులు పెట్టడానికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. భవిష్యత్తు కోసం వీలైనంత ఎక్కువ పొదుపు చేయడం గురించి ఆలోచించాలి. కుటుంబ సభ్యులు, బంధువులు సహకరిస్తారు. తోబుట్టువులతో సంబంధాలు కాలక్రమేణా మెరుగుపడతాయి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read

Latest Astrology News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *