Guru Margi 2023: బృహస్పతి తిరోగమనం.. ఏప్రిల్ 21 వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు..

Guru Margi Effect:  జ్యోతిషశాస్త్రంలో గ్రహాల గమనానికి ప్రత్యేక పాత్ర ఉంది. ఆస్ట్రాలజీలో బృహస్పతిని దేవగురువుగా పిలుస్తారు. పంచాంగం ప్రకారం, బృహస్పతి సంచారం శుభప్రదంగా భావిస్తారు. గురు గ్రహం తన రాశిని మార్చడానికి సంవత్సరం పడుతుంది. బృహస్పతి గత ఏడాది నవంబరు 24న అస్తమించాడు. ప్రస్తుతం అతడు మీనరాశిలో తిరోగమన స్థితిలో ఉన్నాడు. గురుడు ఏప్రిల్ 21 రాత్రి 8.43 వరకు అదే స్థితిలో ఉంటాడు. జ్యూపిటర్ సంచారం కొన్ని రాశులవారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందాం. 

మేషరాశి

మేష రాశి వారిపై గురుగ్రహం శుభ ప్రభావం చూపుతుంది. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీకు ధనలాభం ఉంటుంది. ఆఫీసులో మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. 

వృషభం

బృహస్పతి సంచారం వల్ల వృషభ రాశి వారికి శుభకాలం మొదలైంది. ఉద్యోగులకు ప్రమోషన్ లభిస్తుంది. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరిస్తారు. ఏప్రిల్ 21 వరకు మీరు శుభఫలితాలను పొందుతారు. మీరు వ్యాపార నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. 

కర్కాటక రాశి

గురు మార్గి కారణంగా కర్కాటక రాశివారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. పెళ్లికాని వారికి వివాహం కుదిరే అవకాశం ఉంది. వ్యాపారులకు, ఉద్యోగులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

వృశ్చిక రాశి

గురు మార్గం వల్ల వృశ్చిక రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు ఏదైనా పనిని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో పెట్టుబడి పెట్టడం వల్ల మీరు లాభాలన గడిస్తారు. మీరు ఆర్థికంగా బలపడతారు. 

మీనరాశి

మీన రాశికి గురుడు అధిపతి మరియు అతను తన సొంత రాశిలో తిరోగమనం ఉన్నాడు. వ్యాపారులు భారీగా లాభాలను ఆర్జిస్తారు. మీరు తీసుకున్న నిర్ణయాలు మీకు లాభిస్తాయి. ఉద్యోగులుకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. 

Also Read: Saturn Transit 2023: ఇనుప పాదాలపై శనిదేవుడు.. ఈరాశుల ఫ్యూచర్ ఛేంజ్ అవ్వడం ఖాయం.. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link – https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link – https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *