Home Shifting Tips: ఇల్లు మారుతున్నారా..? ఈ టిప్స్‌ ఫాలో అయితే షిఫ్టింగ్‌ ఈజీగా అవుతుంది..!

Home Shifting Tips:   ఇల్లు మారడం కూడా ఓ పెద్ద తలనొప్పి.  ఇంట్లో వస్తువులు ప్యాక్‌ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంట్లోని వస్తువులన్నీ ప్యాక్ చేయడానికి, అన్‌ప్యాక్‌ చేయడానికి సమయం, శక్తి సరిపోతుందా అనే ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. ఇళ్లు మారేప్పడు కొన్ని టిప్స్‌ ఫాలో అయితే.. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. 

Home Shifting Tips: ఉద్యోగ రీత్యా, పిల్లల స్కూళ్లు, కాలేజీలు, ఇతర కారణాల వల్ల ఇల్లు మారుతూ ఉంటారు. ఇల్లు మారడం కూడా ఓ పెద్ద తలనొప్పితో కూడికున్నదే. పాత ఇంట్లో సామాన్లు.. ప్యాక్‌ చేయడం, వాటిని మూవ్‌ చేయడం, మళ్లీ అన్‌ప్యాక్‌ చేసి కొత్త ఇంట్ల సర్దుకోవడం కాస్త గందరగళంగానే ఉంటుంది. ఇల్లు మారాలంటే ఎంతో కొంత భయం వుంటుంది. ఇంట్లో వస్తువులు ప్యాక్‌ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? ఇంట్లోని వస్తువులన్నీ ప్యాక్ చేయడానికి, అన్‌ప్యాక్‌ చేయడానికి సమయం, శక్తి సరిపోతుందా అనే ప్రశ్నలు వేధిస్తూ ఉంటాయి. ఇళ్లు మారేప్పడు కొన్ని టిప్స్‌ ఫాలో అయితే.. ఒత్తిడి, ఆందోళన తగ్గుతుంది. అవేంటో ఈ స్టోరీలో చూసేద్దాం.

అవసరంలేని వస్తువులు.. ఫిల్టర్‌ చేయండి..

మన ఇంట్లో మనకు తెలియకుండానే ఎన్నో పనికిరాని వస్తువులు ఉంటాయి. వీటన్నింటినీ కొత్తింటికి మోసుకువెళ్లే బదులు.. పాత ఇంట్లోనే ఫిల్టర్‌ చేయండి. ఈ పని అంత సులభమేమి కాదు, ఈ ప్రక్రియను చిన్న చిన్న ప్రాజెక్ట్‌లుగా డివైడ్‌ చేసుకోండి. ప్రతిరోజూ 15 నుంచి 20 నిమిషాల పాటి దీనికి కేటాయించండి. జాగ్రత్తగా పరిశీలించి.. అవసరం లేని వస్తువులను పక్కనపెట్టేయండి. (image source – pexels)

నోట్‌ ప్రిపేర్‌ చేసుకోండి..

మారేముందు ఓ చెక్‌లిస్ట్‌ ప్రిపేర్‌ చేసుకోండి. ఏయే పనులు పూర్తి చేయాలో రాసి పెట్టుకోండి. దీని వల్ల ముందుగా ఏవి సర్దాలో ఓ ఐడియా వస్తుంది. అంతా అయిన తర్వాత ఏది మిస్‌ కాలేదనే నమ్మకం వస్తుంది. అన్ని విషయాలు గుర్తపెట్టుకొవాలంటే సాధ్యం కాదు. అన్ని సమయానికి గుర్తుకు రాకపోవచ్చు. ఇళ్లు మారడానికి ముందే నోట్‌ చేసి పెట్టుకోండి. (image source – pixabay)

ఒకే రకమైన వస్తువులన్నీ.. ఒకచోట..

ఒకే రకమైన వస్తువులన్నీ.. ఒకే బాక్స్‌లో ప్యాక్‌ చేయండి. ఉదాహరణకు అన్ని పేపర్స్‌, డాక్టమెంట్స్‌ ఒక బాక్స్‌లో, మెడిసిన్స్‌, గాజు వస్తువులు ఒకే బాక్స్‌లో ప్యాక్‌ చేయండి. సర్దేప్పుడు.. మీ పని ఈజీ అవుతుంది. (image source – pexels)

కొత్త వస్తువులు ఒకే చోట..

కొత్త ఇంటికోసం కొన్ని వస్తువులన్నీ.. ఒకే బాక్స్‌లో ప్యాక్‌ చేసుకోండి. ఇలా చేస్తే షిష్టింగ్‌ రోజున మీరు వాటి కోసం వెతకాల్సిన పని ఉండదు. (image source – pexels)

పద్ధతి ప్రకారం ప్యాక్‌ చేయండి..

వస్తువులన్నింటినీ ఓ పద్ధతి ప్రకారం ప్యాక్ చేసుకోండి. సామాన్లను ఎప్పుడూ గదుల వారీగా ప్యాక్ చేసుకోవాలి తప్ప, అందులో ఒకటి ఇందులో ఒకటి ప్యాక్ చేసి అన్నిటినీ కలిపి ఒకచోట పారేయవద్దు. అన్ని పెట్టలు సరిగ్గా ప్యాక్‌ చేసి వాటిలోని వస్తువుల ఆధారంగా.. లేబుల్‌ చేయండి. మీ లేబుల్‌లో ఏ వస్తువులు ఉన్నాయో, ఏ గదిలో ఉంచాలో స్పష్టంగా రాయండి. కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత.. ఆయా గదుల్లో.. ఆయా బాక్స్‌లు ఉండేలా చూసుకోండి. (image source – pexels)

మొక్కలు ఇలా ప్యాక్‌ చేయండి..

మొక్కలు ఉంటే… వాటన్నిటినీ కుండీలతో తీసుకెళ్లవద్దు. పొరపాటున కుండీలు పగిలితే, మట్టి అంతా రాలిపోయి, వేళ్లు బయటపడి, మొక్కలు చనిపోయే ప్రమాదం ఉంది. అందుకే మట్టితో సహా మొక్కను కుండీలోంచి జాగ్రత్తగా తీసి, వేళ్లను ఓ పాలిథీన్ కవర్లో గట్టిగా బిగించి కట్టండి. సామాన్లతో పాటు ఇష్టమొచ్చినట్టు లారీలో ఎక్కించకుండా, మొక్కలన్నిటినీ ఓ పక్కగా, వాటి మీద బరువు పడకుండా ఉండేలా సర్దండి. కొత్త ఇంటికి వెళ్లీ వెళ్లగానే కుండీలలో పెట్టి నీళ్లు పోయండి. (image source – pixabay)

ఇలా ప్లాన్‌ చేసుకుంటే.. కొత్త ఇంటికి వెళ్లిన తర్వాత సులభంగా, గందరగోళం లేకుండా వస్తువులు అన్నీ సర్దుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *