horoscope today 01 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…
horoscope today 01 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం బుధవారం రోజున చంద్రుడు మిధునరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఇదే రోజున మృగశిర నక్షత్ర ప్రభావం కూడా ఉంటుంది. ఈ సమయంలో మిధున రాశి వారికి లాభదాయకంగా ఉంటుంది. అయితే కుంభ రాశి వారు డబ్బు, పని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…
మేష రాశి జాతకం 2023
|
వృషభ రాశి జాతకం 2023
|
మిధున రాశి జాతకం 2023
|
కర్కాటక రాశి జాతకం 2023
|
సింహ రాశి జాతకం 2023
|
కన్య రాశి జాతకం 2023
|
తులా రాశి జాతకం 2023
|
వృశ్చిక రాశి జాతకం 2023
|
ధనస్సు రాశి జాతకం 2023
|
మకర రాశి జాతకం 2023
|
కుంభ రాశి జాతకం 2023
|
మీన రాశి జాతకం 2023
మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు ప్రతి క్షణాన్ని ఆనందిస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయత్నాల్లో మంచి విజయాలు సాధిస్తారు. ఈరోజు మీరు తీర్థయాత్రకు వెళ్తే పరిస్థితులు ఏర్పడతాయి. దీని వల్ల మీకు మనశ్శాంతి లభిస్తుంది. ఈరోజు మీకు పనికి సంబంధించి బదిలీలు ఉండొచ్చు. ఆదాయ పరంగా ఈరోజు విజయవంతంగా ఉంటుంది. మీ కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది.
ఈరోజు మీకు 74 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు మీరు పసుపు వస్తువులను దానం చేయాలి.
Sun Jupiter Conjunction 12 ఏళ్ల తర్వాత సూర్యుడు, గురుడి కలయిక.. ఈ 5 రాశుల వారు ధనవంతులవుతారు…! ఈ జాబితాలో మీ రాశి ఉందేమో చూసెయ్యండి…
వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్య పరంగా కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఆందోళన ఉంటుంది. మీరు మానసికంగా కొంత ఒత్తిడికి లోనవుతారు. పనికి సంబంధించి ఈరోజు మీకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీకు కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది.
ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు మీరు తెల్లని వస్తువులను దానం చేయాలి.
మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)
ఈ రాశి వారిలో వ్యాపారులకు ఈరోజు చాలా మంచి రోజు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి నుంచి మీరు చేసే పనిలో మంచి సహకారాన్ని పొందుతారు. ఉద్యోగులు ఈరోజు మంచి ఫలితాలను పొందుతారు. ప్రేమ జీవితంలో ఉండే వారికి ఈరోజు సంతోషంగా ఉంటుంది. మరోవైపు మీ కుటుంబ జీవితంలో సమస్యలను తొలగించుకునేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మీరు కచ్చితంగా విజయం సాధిస్తారు.
ఈరోజు మీకు 82 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు మీరు సరస్వతీ మాతను పూజించాలి.
కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు ఆరోగ్యం పట్ల అజాగ్రత్తగా ఉండకండి. మరోవైపు మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. దీని ప్రభావం మీ ఆర్థిక పరిస్థితిపై కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందంగా ఉంటుంది. ఉద్యోగులకు ఈరోజు కొంత బలహీనంగా ఉంటుంది. కాబట్టి మీరు కష్టపడి పని చేయాలి.
ఈరోజు మీకు 68 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు శివ చాలీసా పఠించాలి.
సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా అద్భుతంగా ఉంటుంది. మీరు కొన్ని శుభవార్తలను వింటారు. స్నేహితులు, ప్రియమైన వ్యక్తుల నుంచి మద్దతు లభిస్తుంది. మీ కుటుంబంలో ఆస్తికి సంబంధించి కొన్ని వివాదాలు ఉండొచ్చు. మీ వైవాహిక జీవితంలో ఆహ్లాదకరమైన సమయం ఉంటుంది. మీ ఇద్దరి మధ్య ప్రేమ పెరుగుతుంది. మీరు ప్రత్యర్థులపై ఆధిపత్యం చెలాయిస్తారు. ఉద్యోగులు ఈరోజు పని విషయంలో సానుకూల ఫలితాలను పొందుతారు.
ఈరోజు మీకు 97 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు వినాయకుడికి లడ్డూలు సమర్పించాలి.
కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు పాత సమస్యల నుంచి కొంత ఉపశమనం కలుగుతుంది. అయితే మీరు మీ పనిపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. లేదంటే ఒకదానిపై మరొకటి ప్రతికూల ప్రభావం చూపుతుంది. కుటుంబంలోని పెద్దలను గౌరవించాలి. ఈరోజు ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. మీ ప్రేమ జీవితంలో ప్రేమించిన వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది.
ఈరోజు మీకు 65 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు గురువు లేదా సీనియర్ వ్యక్తుల ఆశీస్సులు తీసుకోవాలి.
Astrology Tips ఈ 6 రోజుల్లో కపుల్స్ పొరపాటున కూడా కలయికలో పాల్గొనకూడదు… ఎందుకో తెలుసా…
తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కొన్ని పరిస్థితుల్లో ప్రతికూల ఫలితాలొస్తాయి. మీరు నిగ్రహంగా ఉండాలి. పరిస్థితులను సరిదిద్దేందుకు ఆవేశంతో ముందడుగు వేయొద్దు. పొదుపు చేయడం మంచిదే కానీ.. సరైన సలహా తీసుకోవాలి. మీ కుటుంబ జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. మీ భాగస్వామితో గడిపే క్షణాలను ఆస్వాదిస్తారు.
ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు లక్ష్మీదేవికి తియ్యని పదార్థాలను నైవేద్యం సమర్పించాలి.
వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)
ఈ రాశి వారు ఈరోజు కుటుంబ జీవితం గురించి కొంత ఆందోళన చెందుతారు. అయితే పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఆర్థిక పరంగా ఈరోజు మంచిగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉండొచ్చు. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలి.
ఈరోజు మీకు 63 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు తులసి చెట్టుకు నిత్యం నీళ్లు సమర్పించి దీపం వెలిగించాలి.
ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరుగుతుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక భారం తగ్గుతుంది. దీని వల్ల మీరు మంచి ఉపశమనం పొందుతారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీ ఇంటి వాతావరణం కొత్త పనులు చేసేందుకు మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటుంది. మీ భాగస్వామి సహాయంతో అనేక పనులు పూర్తి చేస్తారు. పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు.
ఈరోజు మీకు 81 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు శివుని మంత్రాలను జపించాలి.
మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు ఒక ప్రత్యేక వ్యక్తిని కూడా కలుసుకోవచ్చు. మీ వైవాహిక జీవితంలో కొంత ఒత్తిడి ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలొస్తాయి. మీ ఆరోగ్యం బలంగా ఉంటుంది. మీరు పనికి సంబంధించి మంచి ఫలితాలను పొందుతారు. వ్యాపారులకు ఈరోజు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి.
ఈరోజు మీకు 87 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు పేదలకు అన్నదానం చేయాలి.
కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలొస్తాయి. ఆర్థిక పరంగా ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. పనికి సంబంధించి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ప్రేమ జీవితంలో ఉండేవారు కొంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో ఎక్కువ ప్రేమ ఉంటుంది. మీకు కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం
: ఈరోజు యోగా ప్రాణాయామం సాధన చేయాలి.
మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)
ఈ రాశి వారికి ఈరోజు కుటుంబ జీవితంలో సానుకూల ఫలితాలు వస్తాయి. మీరు కుటుంబ సభ్యులందరితో చాలా మంచి సమయాన్ని గడుపుతారు. మీ ప్రేమ జీవితంలో ఆనందంగా ఉంటుంది. ఈరోజు మీ భాగస్వామిని సంతోషంగా ఉంచేందుకు మీ వంతు ప్రయత్నం చేయాలి. మీ వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. మీరు పని విషయంలో మంచి ఫలితాలను పొందుతారు.
ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.
పరిహారం :
ఈరోజు గోమాతకు రోటీని తినిపించాలి.
గమనిక :
ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.
Read
Latest Astrology News
and