Horoscope Today Feb 04th ఈరోజు సింహం, ధనస్సు సహా 4 రాశుల వారికి శుభ ఫలితాలు…!

horoscope today 04 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, రాశి ఫలాల గురించి తెలుసుకోవడం వల్ల భవిష్యత్తు గురించి ఒక అంచనాకు రావొచ్చు. ఈ నేపథ్యంలో ఈరోజున 12 రాశుల వారికి ఎలాంటి ఫలితాలొచ్చాయంటే…

horoscope today 04 February 2023 జ్యోతిష్యశాస్త్రం ప్రకారం శనివారం రోజున చంద్రుడు కర్కాటక రాశిలోనే పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు. ఈరోజు గురుడి ప్రభావంతో పంచమ యోగం కూడా ఏర్పడుతుంది. దీంతో ఈ శనివారానికి మరింత ప్రాధాన్యత పెరిగింది. బుధుడు కూడా ఉత్తరాషాఢ నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. పునర్వసు నక్షత్రం ప్రభావం కూడా రోజంతా ఉంటుంది. ఈ కారణంగా సింహం, ధనస్సు రాశులకు శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ రాశులతో మరికొన్ని రాశుల వారికి సానుకూల ఫలితాలు రానున్నాయి. ఈ సందర్భంగా ఈరోజున ఏ రాశుల వారికి ఏ మేరకు అదృష్టం రానుంది. 12 రాశుల వారు ఎలాంటి పరిహారాలు పాటించాలనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

మేష రాశి ఫలితాలు (Aries Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా ఉత్సాహంగా కనిపిస్తారు. ఈరోజు మీ ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మీకు జలుబు, ఫ్లూ వంటి వాతావరణ సంబంధిత వ్యాధుల సమస్యలు పెరగొచ్చు. మీ కుటుంబ జీవితం ఆనందంగా ఉంటుంది. పని విషయంలో ఈరోజు కొంత అశ్రద్ధగా ఉండొచ్చు. దీన్ని నివారించేందుకు ప్రయత్నించాలి.

ఈరోజు మీకు 86 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు పేద ప్రజలకు సహాయం చేయాలి.

Planetary Transits in February 2023 ఫిబ్రవరిలో 4 ప్రధాన గ్రహాల సంచారం… ఈ 5 రాశులను వరించనున్న అదృష్టం…!

వృషభ రాశి వారి ఫలితాలు (Taurus Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీరు షాపింగ్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి దెబ్బ తింటుంది. మరోవైపు ఈరోజు మీ వ్యక్తిగత జీవితం గురించి కొంత నిరాశ చెందుతారు. మీ వైవాహిక జీవితంలో ప్రతికూలంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో రొమాంటిక్ గా గడుపుతారు. మీరు చేసే పనిలో నియంత్రణ ఉంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు.

ఈరోజు మీకు 77 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు రావి చెట్టు కింద దీపం వెలిగించాలి.

మిధున రాశి వారి ఫలితాలు (Gemini Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆదాయ పరంగా చాలా మంచిగా ఉంటుంది. మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి రాబడిని పొందొచ్చు. ఈరోజు మీ మూడ్ కూడా చాలా బాగుంటుంది. పని విషయంలో ఈరోజు పరిస్థితి చాలా బాగుంటుంది. ఈరోజు మీరు వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా పరిపక్వతను ప్రదర్శిస్తారు. కొన్ని సందర్భాల్లో మీరు చాలా సీరియస్ గా ఉంటారు.

ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు విష్ణు సహస్రనామాన్ని పఠించాలి.

కర్కాటక రాశి వారి ఫలితాలు (Cancer Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు మనసులో ఎలాంటి సందేహాలు ఉంచుకోవద్దు. ఎందుకంటే అలాంటి వాటి వల్ల మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వ్యక్తిగత జీవితంలో మంచిగా ఉంటుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించండి. వివాహితులు ఈరోజు జీవిత భాగస్వామితో వీలైనంత ఎక్కువ సమయం గడపాలి. పని విషయంలో ఈరోజు బాగుంటుంది. మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈరోజు మీరు చాలా ఆత్మవిశ్వాసంతో కనిపిస్తారు. ఏదైనా పోటీలో విజయం సాధించడం వల్ల మీ మనోబలం పెరుగుతుంది.

ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు మీరు శ్రీ విష్ణుమూర్తిని ఆరాధించాలి.

సింహ రాశి వారి ఫలితాలు (Leo Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చేసే పనుల్లో మంచి విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ కు సంబంధించిన రంగాల్లో మంచి లాభాలొచ్చే అవకాశం ఉంది. ఈరోజు మీరు ప్రత్యర్థులను ఓడించగలరు. మీ వ్యక్తిగత జీవితంలో సంతోషకరమైన క్షణాలను ఆస్వాదించగలరు. మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. మీ సామర్థ్యం, అనుభవం కారణంగా మీరు కొన్ని కొత్త విషయాలను చెప్పేందుకు ప్రయత్నిస్తారు. మీ మాటల్ని అందరూ జాగ్రత్తగా వింటారు.

ఈరోజు మీకు 67 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు హనుమంతునికి సింధూరం సమర్పించాలి.

కన్య రాశి వారి ఫలితాలు (Virgo Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో మీరు చాలా ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మీరు చేసే పనిలో మంచి విజయాలను సాధిస్తారు. ఆదాయానికి సంబంధించి ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీ ఖర్చులు వేగంగా పెరుగుతాయి. సాయంత్రం తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. ఈరోజు మీరు కుటుంబానికి సంబంధించిన పనుల్లో చాలా బిజీగా ఉంటారు.

ఈరోజు మీకు 91 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు గాయత్రీ చాలీసా పఠించాలి.

February Born People ఫిబ్రవరిలో పుట్టిన వారిలో రొమాంటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయా..!

తుల రాశి వారి ఫలితాలు (Libra Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు ప్రేమ జీవితంలో ఆనందంగా గడుపుతారు. మీ మనసులో ప్రేమ పట్ల ఉత్సాహంగా ఉంటుంది. మీరు చేసే పనుల్లో సానుకూల ఫలితాలొస్తాయి. దీంతో మీ మనసులో ఆనందంగా ఉంటుంది. మీ వైవాహిక జీవితంలో సంతోషంగా గడుపుతారు. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీకు ఏదైనా మంచి చెప్పగలరు.

ఈరోజు మీకు 64 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు చేపలకు పిండి పదార్థాలు తినిపించాలి.

వృశ్చిక రాశి వారి ఫలితాలు (Scorpio Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఇంట్లో ఆనందం పెరుగుతుంది. మీ ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ ప్రేమ జీవితంలో ఈరోజు ఆనందంగా గడుపుతారు. వ్యాపారులకు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. పెట్టుబడి పెట్టేందుకు ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మరోవైపు ఈరోజు ఎవరితోనూ రెచ్చగొట్టేలా తప్పుడు మాటలు మాట్లాడొద్దు. లేదంటే సమస్యలు రావొచ్చు.

ఈరోజు మీకు 73 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు రావి చెట్టుకు పాలు కలిపిన నీటిని అందించాలి.

ధనస్సు రాశి వారి ఫలితాలు (Sagittarius Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు తమ స్నేహితులతో కలిసి ఎక్కడికైనా వెళ్లేందుకు ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీరు మీ స్నేహితులతో సమయం గడిపేందుకు మంచి అవకాశాన్ని పొందుతారు. ప్రభుత్వ పనుల్లో మీకు సానుకూల ఫలితాలు రావొచ్చు. మీ భాగస్వామితో చర్చల వల్ల మీ పనులు సాఫీగా సాగుతాయి. అయితే ఈరోజు ప్రత్యర్థులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు మీరు సరైన సమయంలో సరైన పనిని చేసే స్ఫూర్తిని పొందుతారు.

ఈరోజు మీకు 79 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి.

మకర రాశి వారి ఫలితాలు (Capricorn Horoscope Today)

ఈ రాశి వారు ఈరోజు చాలా బలమైన స్థితిలో కనిపిస్తారు. మీ కుటుంబ జీవితంలో పరిస్థితులపై పూర్తి నియంత్రణ కలిగి ఉంటారు. దీంతో పాటు మీ ఇంట్లో శ్రేయస్సు ఉంటుంది. ఈరోజు మీ మధురమైన మాటలతో అందరి మనసులను గెలుచుకుంటారు. మరోవైపు వ్యాపారులు ఈరోజు కొంచెం కఠినంగా ప్రవర్తించాల్సి ఉంటుంది. ఈరోజు మీరు వ్యక్తిగత జీవితం గురించి కొంత నిరాశ చెందుతారు. పనికి సంబంధించి మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

ఈరోజు మీకు 61 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు గోమాతకు పచ్చి గడ్డి తినిపించాలి.

కుంభ రాశి వారి ఫలితాలు (Aquarius Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆరోగ్య పరంగా బలహీనంగా ఉంటుంది. వాతావరణంలో మార్పుల వల్ల మీరు అనారోగ్యానికి గురి కావొచ్చు. మీరు చేసే పనిలో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. మీరు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు. మీ వైవాహిక జీవితంలో ఆనందంగా ఉంటుంది. మీ భాగస్వామికి మంచి బహుమతిని కూడా తీసుకోవచ్చు.

ఈరోజు మీకు 98 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం :

ఈరోజు తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోవాలి.

మీన రాశి వారి ఫలితాలు (Pisces Horoscope Today)

ఈ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరమైన విషయాల్లో లాభదాయకంగా ఉంటుంది. ఈరోజు మీరు పనిలో కూడా విజయం సాధిస్తారు. ప్రేమ విషయంలో ఈరోజు చాలా మంచిగా ఉంటుంది. మీరు అన్ని రంగాల్లో మంచి ఫలితాలను పొందుతారు. వివాహితులు తమ జీవిత భాగస్వామితో కొత్త పని ప్రారంభం గురించి మాట్లాడొచ్చు. దీని వల్ల కొంత ప్రయోజనం ఉండొచ్చు. ఉద్యోగులు తమ ఉద్యోగం మారాలనే నిర్ణయం తీసుకోవచ్చు.

ఈరోజు మీకు 93 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

పరిహారం

: ఈరోజు శివలింగానికి పాలు సమర్పించాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ జ్యోతిష్యశాస్త్రం, మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read

Latest Astrology News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *