How To Get Spotless Skin: బియ్యం పిండితో స్పాట్‌ లెస్‌ చర్మం మీ సొంతం..

How To Get Spotless Skin Naturally At Home: వాతావరణంలో తేమ పెరగడం, తగ్గడం..అనారోగ్య కరమైన ఆహారాలు అతిగా తినడం వల్ల చాలా మందిలో చర్మ సమస్యలు వస్తున్నాయి. కొందరిలోనైతే ముఖంపై చర్మ సమస్యలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల రసాయనాలతో కూడిన ప్రోడక్ట్స్‌ను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఆశించిన ఫలితాలు పొందలేకపోతున్నారు. ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందడానికి తప్పకుండా నేచురల్ తయారు చేసిన ఫేస్‌ ప్యాక్‌లను వినియోగించాల్సి ఉంటుంది. దీనిని వినియోగించడం వల్ల చర్మం యవ్వనంగా కనిపించడమేకాకుండా చర్మంపై మురికి కూడా తొలగిపోతుంది. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో బాధపడేవారు య్యం పిండితో చేసిన ఫేస్ ప్యాక్‌లను వినియోగించాల్సి ఉంటుంది.

రైస్ ఫ్లోర్ ఫేస్ ప్యాక్స్ ప్రయోజనాలు:

టమోటా, బియ్యం పిండి:

ఫేస్ ప్యాక్స్ కోసం ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యప్పిండి తిసుకోవాలి. అందులోనే ఒక టీస్పూన్‌ టమోటా రసం, ఒక చెంచా ఆలివ్ నూనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఇలా సిద్ద చేసుకున్న ఫేస్ ప్యాక్‌ని ముఖంపై అప్లై చేసి.. సుమారు 15 నుంచి 20 నిమిషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి.

ఓట్స్, రైస్ ఫ్లోర్:

ఒక గిన్నెలో ఒక చెంచా బియ్యప్పిండి, ఒక చెంచా రుబ్బిన ఓట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే ఒక చెంచా తేనె, పాలు కలిపి బాగా మిక్స్‌ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి బాగా అప్లై చేసిన 20 నిమిషాల తర్వాత మంచి నీటితో బాగా కడగాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే త్వరలో మంచి ఫలితాలు పొందుతారు.

కలబంద, బియ్యం పిండి:

ఈ  ఫేస్ ప్యాక్స్ కోసం ముందుగా ఒక గిన్నెలో బియ్యం పిండి, అలోవెరా జెల్, తేనె వేసి కలపాల్సి ఉంటుంది. తర్వాత సిద్ధం చేసుకున్న ఫేస్ ప్యాక్ ను ముఖానికి బాగా పట్టించాలి. దీని తర్వాత సుమారు 20 నుండి 25 నిమిషాలు అప్లై చేసి.. తేలికపాటి చేతులతో మసాజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల మచ్చలన్నీ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా చాలా రకాల చర్మ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

Also Read: Dhanush Focus; విజయ్ దెబ్బకు గుణపాఠం నేర్చుకున్న ధనుష్.. అందుకే ఆ తప్పు చేయకుండా!

Also Read: Lakshmi Parvathi on Jr NTR: లేట్ అయింది, ఎన్టీఆర్ వచ్చినా ఉపయోగం లేదు…లక్ష్మీ పార్వతి సంచలనం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *