Income Tax: పాత, కొత్త ట్యాక్స్ శ్లాబ్స్‌తో పన్ను ఆదా చేయండి ఇలా

కేంద్ర ప్రభుత్వం కొత్త పన్ను విధానం ఎంచుకునేవారికి రిబేట్‌తో కలిపి రూ.7 లక్షల వరకు ఆదాయపు పన్ను (Income Tax) ఉండదని బడ్జెట్ 2023-24 లో ప్రకటించింది. కాబట్టి రూ.7 లక్షల లోపు వార్షికాదాయం ఉన్నవారు ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇక పాత పన్ను విధానం ఎంచుకునేవారికి రిబేట్‌తో కలిపి రూ.5 లక్షల వరకు పన్ను ఉండదు. మరి కొత్త పన్ను విధానం (New Tax Regime) ఎంచుకోవాలా? పాత పన్ను విధానంలోనే కొనసాగాలా? అన్న సందేహం పన్ను చెల్లింపుదారుల్లో ఉంది. అయితే పన్ను చెల్లింపుదారులకు వారి ఆదాయం, పొదుపు, ఇన్స్యూరెన్స్, హోమ్ లోన్ లాంటి అంశాలపై సమాధానం ఆధారపడి ఉంటుంది. మరి ఎంత ఆదాయం ఉన్నవారికి ఏ పన్ను విధానంలో ఎంత పన్ను పడుతుంది? ఎంత పొదుపు చేయొచ్చో తెలుసుకోండి.

రూ.5,00,000 వార్షికాదాయం: పాత శ్లాబ్, కొత్త శ్లాబ్ ప్రకారం రిబేట్‌తో ఎలాంటి పన్నులు ఉండవు.

రూ.7,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.23,400 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.23,400 పన్ను ఆదా అవుతుంది.

Income Tax Example: లిమిట్ కన్నా రూ.10 ఆదాయం ఎక్కువా? అయితే రూ.26,001 పన్ను కట్టాల్సిందే

రూ.10,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.75,400 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.54,600 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.20,800 పన్ను ఆదా అవుతుంది.

రూ.12,50,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.1,32,600 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.93,600 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.39,000 పన్ను ఆదా అవుతుంది.

రూ.15,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.2,10,600 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.1,45,600 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.65,800 పన్ను ఆదా అవుతుంది.

Budget 2023: ఆదాయపు పన్ను చట్టంలో సెక్షన్ 80C, 80D అంటే ఏంటీ? తెలుసుకోండి

రూ.25,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.5,22,600 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.4,52,400 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.70,200 పన్ను ఆదా అవుతుంది.

రూ.50,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.13,02,600 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.12,32,400 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.70,200 పన్ను ఆదా అవుతుంది.

రూ.1,00,00,000 వార్షికాదాయం: పాత పన్ను విధానం ఎంచుకునేవారు రూ.31,48,860 పన్ను చెల్లించాలి. రాబోయే ఆర్థిక సంవత్సరంలో కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.30,71,640 ట్యాక్స్ చెల్లించాలి. ఈ లెక్కన కొత్త పన్ను విధానం ఎంచుకుంటే రూ.77,220 పన్ను ఆదా అవుతుంది.

పైన వివరించినదాని ప్రకారం పాత పన్ను విధానం కన్నా కొత్త పన్ను విధానం ఎంచుకుంటేనే పన్ను ఆదాయ అవుతుందని అర్థమవుతుంది. కానీ ఇక్కడే ఓ తిరకాసు ఉంది. ఎలాంటి మినహాయింపులు లేకుండా ఎంత పన్ను చెల్లించాలో పైన వివరించాం. కానీ పాత పన్ను విధానం ఎంచుకునే వారికి అనేక మినహాయింపులు, అలవెన్సులు ఉంటాయి. పైన ఇచ్చిన లెక్కలో అలవెన్సులు, మినహాయింపుల్ని పరిగణలోకి తీసుకోలేదు. అలవెన్సులు, మినహాయింపులు ఒక్కొక్కరికి వేర్వేరుగా ఉంటాయి. వాటిని పూర్తిగా పొందేవారు, అస్సలు పొందనివారు ఉంటారు. ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే అలవెన్సులు, మినహాయింపుల్ని పూర్తిగా ఉపయోగించుకుంటే పాత పన్ను విధానంలో సుమారు రూ.10 లక్షల వరకు వార్షికాదాయం వరకు పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదని ట్యాక్స్ అడ్వైజర్స్ చెబుతుంటారు.

Income Tax Example: మీ ఆదాయం రూ.10 లక్షలా? కొత్త పన్ను విధానంలో ఎంత పన్ను ఆదా అవుతుందో తెలుసుకోండి

ఆదాయపు పన్ను శాఖ ఇచ్చే అలవెన్సులు, మినహాయింపుల్లో ప్రధానంగా హౌస్‌ రెంట్‌ అలవెన్సు, సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, లీవ్‌ ట్రావెల్‌ కన్సెషన్, హోమ్ లోన్ వడ్డీ… ఇలా చాలా ఉంటాయి. మీ ట్యాక్స్ అడ్వైజర్ సలహా తీసుకొని వీటిని పూర్తిగా ఉపయోగించుకోగలిగితే మీకు వార్షికాదాయం రూ.10 లక్షల వరకు ఉన్నా పాత పన్ను విధానంలో ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం ఉండదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *