Irresponsible wife : నా భార్య కొడుకుని కూడా పట్టించుకోకుండా షాపింగ్ చేస్తోంది..

Irresponsible wife : కుటుంబం అన్నాక డబ్బు సంపాదించడం, ఖర్చు చేయడం కేవలం మగవారే చూసుకోవాలనుకోవడం తప్పు.   ఇలాంటి ఆలోచనలతో ఉన్న భార్యతో విసిగిపోయిన భర్త నిపుణుల సాయం కోరుతున్నాడు. నిపుణులు ఏం సలహా ఇచ్చారంటే..

అతని సమస్య..

హాయ్.. మాది అరెంజ్డ్ మ్యారేజ్. పెళ్ళికి ముందు మాట్లాడుకున్నాం. అన్ని డిస్కస్ చేసే మ్యారేజ్ చేసుకున్నాం. మాకు మ్యారేజ్ అయి 3 సంవత్సరాలు అవుతున్నాయి. మా ఇద్దరి మధ్య ఓ సమస్య రోజురోజుకి పెద్దగా అవుతుంది. అదేంటంటే, మేము ఇద్దరం జాబ్స్ చేస్తాం. నాకు మంచి ప్యాకేజ్ ఉంది. నా భార్యకి కూడా జీతం వస్తుంది. ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే, నా భార్య జీతం మొత్తం ఆమె షాపింగ్ చేసేందుకే వాడుతోంది. ఎంత చెప్పినా తన పద్దతి మార్చుకోవట్లేదు. నాకు ఎక్కువే జీతం కాదనను. కానీ, నా పేరెంట్స్, మా సంవత్సరం వయస్సున్న బాబు అవసరాలు తీరుస్తూ ఇంటిని మొత్తం నా జీతంతోనే నడిపిస్తున్నా. నా భార్య ఇవేవి పట్టించుకోవట్లేదు సరికదా.. జీతం గురించి అడిగితే నా డబ్బుకి లెక్కలు ఎందుకు అడుగుతున్నావని గొడవ చేస్తోంది. ఇదే విషయాన్ని నేను గట్టిగా అడగగలను. కానీ, అందరిముందు గొడవ పడడం నాకు ఇష్టం లేదు. నేనేం చేయను?

ఆమె సమస్య :

పెళ్ళి కాక ముందు నా భర్త నాకు ఎన్నో కబుర్లు చెప్పాడు. ఏవేవో మాటలు చెప్పాడు. అందులో నీ జీతం నీ ఇష్టం. ఖర్చు చేసుకుంటావో ఏం చేస్తావో చెయ్ అంటూ తెగ మాటలు చెప్పి ఇప్పుడు నా ఖర్చులు అడగడం మొదలుపెట్టాడు. నా కోరికలపై నాకు కంట్రోల్ లేదని, డబ్బు ఆదా చేయాలి. ఇంటి బడ్జెట్లో హెల్ప్ చేయాలంటూ ఏవేవో చెబుతున్నాడు. పెళ్ళికి ముందు ఒక మాట.. పెళ్ళి తర్వాత ఒకలా మాట్లాడుతున్నాడు. నాకంటూ కోరికలు, ఖర్చులు ఉండవా.. ఏం చేయను చెప్పండి.

Also Read : Plant shelf Ideas : ఇంట్లో చెట్లు పెంచాలనుకుంటున్నారా.. ఇలా చేయండి..

అతని కోసం నిపుణుల సలహా..

మీ భార్య తన జీతాన్ని షాపింగ్, అవసరాలకు ఖర్చు చేస్తోంది. నిజానికీ, ఇది ఆమె జీతం తన ఇష్టం. కానీ, ఆమె డబ్బు ఆదా చేయాలని, మీతో ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ని షేర్ చేసుకోవాలని కోరుకుంటే, మీరు ఈ విషయాన్ని ప్రేమతో చెప్పాలి. పెళ్ళి అనేది స్త్రీ, పురుషులు ఒకటిగా కలిసి ఆనందంగా జీవించడం కోసం. ఇది అందమైన బంధం. ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు ఒకే మనస్సుగా కలిసి ఉండాలి. అలా లేకపోతే, మీ ఇద్దరి మధ్య గొడవ జరుగుతూనే ఉంటుంది. అందువల్ల మీ రిలేషన్ని బిల్డ్ చేసుకునేందుకు మీ సమస్యలన్నీ కూర్చుని తనతో షేర్ చేసుకుని ప్రేమగా మాట్లాడండి. ఆమె తన జీతాన్ని తన కోసం ఖర్చు పెడుతుందని మీరు దాన్ని పెద్దగా చూసి కోప్పడడం కంటే తనని నెమ్మదిగా మార్చే ప్రయత్నం చేయండి. అర్థమయ్యేలా చెప్పి చూడండి. కొంత డబ్బు మీతో షేర్ చేసుకోమని అడగండి. కూర్చుని ప్రేమతో మాట్లాడితే మీ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి.

ఆమె కోసం..

మీకు ఇప్పుడు మ్యారేజ్ అయింది. మీ జీతం మీరు ఖర్చు చేస్తున్నారని మీ హజ్బెండ్ అడిగితే తప్పు అవుతుందనుకోవడం కరెక్ట్ కాదు. నిజానికీ మీ డబ్బు. కాబట్టి అలా అడగకూడదని మీరు అనుకుంటే కాస్తా ఆలోచించండి. మీరు మ్యారేజ్ చేసుకున్నారు. మీ భర్తతో కలిసి ఉంటున్నారు. మీ భర్తతో బాధ్యతలను పంచుకోవాల్సి ఉంటుంది. ఎందుకు మీరు మ్యారేజ్ చేసుకున్నారు. వేర్వేరు జీవితాలను గడపడం కోసం కాదు కదా.. పెళ్ళి అనేది స్త్రీ, పురుషుల కలయిక. ఇక్కడ ఇద్దరు కూడా ఒక్కటిగా ఉండాలి. మ్యారేజ్ అనేది బంధం. ఇద్దరు వ్యక్తులు, రెండు శరీరాలు ఒకే మనససు, జీవితంగా ఉండాలి. మీరు డబ్బు సంపాదించక తను మాత్రమే సంపాదిస్తే మీ జీవితం ఏంటి.. తన డబ్బు అని మీకు నేను ఖర్చు పెట్టను అంటే మీ లైఫ్ ఎలా ఉంటుంది. మీ డబ్బుపై మీకు కంట్రోల్ ఉండాల్సిందే. దానిని ఎలా ఖర్చు చేస్తారనే దానిపై ఓ అవగాహన ఉండాలి. వివాహ బంధంలో ‘నాది’ అనేది ఎప్పుడు కూడా ఉండకూడదు.. మనం అనే మాత్రమే ఉండాలి. అతని బాధని వినండి.. ఆనందంగా కలిసి ఉండండి. ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది.

Also Read : Coffee for weight loss : కాఫీ ఇలా తాగితే బరువు తగ్గుతారట..

విశాల్ భరద్వాజ్, ప్రిడెక్షన్స్ ఫర్ సక్సెస్ ఫౌండర్.. ఆమె కోసం..

ప్రేమ అనేది మీ ఇద్దరి బంధాన్ని ఆనందంగా మార్చుతుంది. దీని వల్లే మీ బంధం సరిగ్గా ఉంటుంది. ఒకరి నిర్లక్ష్యం కారణంగా మంచి జీవనం పోతుంది. ఈ అందమైన ప్రయాణాన్ని మీ భర్తతో ఆనందంగా గడిపేందుకు కాస్తా మారాల్సి ఉంటుంది. ఇంటి బాధ్యత మీకు కూడా ఉందని గుర్తుంచుకోండి. సమానత్వం అంటూ పోరాడుతున్న సమయంలో ఇంటి సమస్యలు కూడా సమానంగా పంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది. మీ ఇంటిపై మీరు దృష్టి సారించాలి. ప్రస్తుతం అంతటా ఖర్చులు పెరుగుతున్నాయి. మీ భర్త ఒక్కడే ఎన్ని భరించగలడు. ఈ విషయాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా.. మీ ఇంటికోసం, మీ బాధ్యతలను అర్థం చేసుకుని తనతో ప్రేమగా కలిసి జీవనం సాగిస్తే అంత బావుంటుంది. ఇలాంటి జీవనం మీకు ఆనందాన్ని ఇస్తుందని మరిచిపోవద్దు.

Also Read : Spots on Nails : గోర్లపై తెల్లని మచ్చలు ఉన్నాయా.. ఇవే కారణాలు..

అతని కోసం..

ఇంట్లో ప్రతి బాధ్యతను నిర్వర్తించడం ఎంత కష్టమో తెలుసు. ఇలాంటి పరిస్థితి మీ భార్య అర్థం చేసుకోకపోవడం కష్టమైనదే. కానీ, ఈ సమయంలో ఆమెతో మెల్లిగా మాట్లాడి శాంతియుతంగా సమస్యను సాల్వ్ చేయండి. ఈ ఇల్లు మీకు మాత్రమే చెందినది కాదు, తనకు బాధ్యత ఉందని చెప్పండి. మీకు బాబు ఉన్నాడని, తన బాధ్యత కూడా ఆమెపై ఉంటుందని తెలపండి. తల్లిదండ్రులుగా తనకి మంచి జీవితాన్ని ఇవ్వాల్సిన బాధ్యత ఇద్దరిపై ఉందని తెలియజేయండి.

గమనిక :

ఈ కథనాలు ఆ వ్యక్తులు పంచుకున్న అనుభవాలను మాత్రమే తెలియజేస్తుంది. ఇది ఎవరినీ ఉద్దేశించినది కాదు. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.

Read More :

Relationship News

and

Telugu News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *