Magh Purnima 2023 మాఘ పూర్ణిమ వేళ పొరపాటున కూడా ఈ పనులు చేయకండి… ఎందుకంటే లక్ష్మీదేవికి కోపం వస్తుందంట…!

Magh Purnima 2023 హిందూ పంచాంగం ప్రకారం, ప్రతి సంవత్సరం మాఘ మాసంలో వచ్చే పూర్ణిమను మాఘ పూర్ణిమ అంటారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 5వ తేదీన ఆదివారం నాడు మాఘ పౌర్ణమి వచ్చింది.

Magh Purnima 2023 హిందూ మత విశ్వాసాల ప్రకారం, మాఘ పూర్ణిమకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ నెలలో వచ్చే పౌర్ణమి రోజున భారతదేశంలోని దేవాలయాలన్నీ భక్తులతో కళకళలాడుతాయి. ఈ నేపథ్యంలో 05 ఫిబ్రవరి 2023 ఆదివారం రోజున మాఘ పౌర్ణమి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున ప్రవహించే నదులలో సూర్యోదయం కంటే ముందే పుణ్యస్నానం ఆచరించాలని పండితులు చెబుతున్నారు. ఈ పర్వదినాన రవి యోగం, పుష్య యోగం, సర్వార్ధ సిద్ధి యోగంతో పాటు మరికొన్ని శుభ యోగాలు ఏర్పడనున్నాయి. దీంతో ఈ పౌర్ణమికి మరింత ప్రాధాన్యత పెరిగింది. ఈ శుభ సమయంలో విష్ణుమూర్తి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయడం, మంత్రాలు పఠించడం, మీ సామర్థ్యం దానధర్మాలు చేయడం వల్ల శుభ ఫలితాలొస్తాయని, భగవంతుని ఆశీస్సులు లభిస్తాయని పండితులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. మాఘ పౌర్ణమి వేళ కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. అవి చేయడం వల్ల మీరు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవ్వాల్సి వస్తుంది. మీకు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా మాఘ పౌర్ణమి రోజున ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

సూర్యోదయం కంటే ముందే..

మాఘ పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. ఇలా చేయడం వల్ల మీకు ప్రతికూల ఫలితాలు ఎదురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా మీరు నివసించే ప్రాంతంలో సమీపంలో ఏదైనా ఏదైనా ప్రవహించే నది ఉంటే అందులో సూర్యోదయం కంటే ముందే పుణ్య స్నానం ఆచరించాలి.

Mahashivratri 2023 శివయ్య కలలో ఇలా కనిపిస్తే శత్రువుల పీడ తొలగిపోతుందట…!

ఇంటిని శుభ్రంగా..

మాఘ పౌర్ణమి వేళ మీ ఇంటిని ఏ చిన్న మూల కూడా మురికిగా ఉంచకండి. ఎందుకంటే ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తితో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడం కూడా చాలా ముఖ్యం. ఎవరైతే ఈరోజున ఇంటిని మురికిగా ఉంచుతారో వారి ఇంట్లోకి లక్ష్మీదేవి పెట్టదు. అంతేకాదు మీకు చెడు ఫలితాలొచ్చే అవకాశాలొస్తాయి.

నల్లని దుస్తులు ధరించొద్దు..

మాఘ పౌర్ణమి వేళ పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలనే ధరించాలి. అయితే నలుపు రంగులో ఉండే దుస్తులను ఎట్టి పరిస్థితుల్లో ధరించకండి. శాస్త్రాల ప్రకారం, ఈరోజున నల్లని దుస్తులను ధరించడం నిషేధించబడింది. ఈరోజున మీ భాగస్వామితో కలయికలో కూడా పాల్గొనకూడదు. ఇలా చేయడం వల్ల మీ జీవితంలో అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

ఇవి చేయకండి..

మాఘ పౌర్ణమి రోజున కటింగ్ చేసుకోవడం.. గోర్లు కత్తిరించడం.. షేవింగ్ వంటి పనులను చేయకూడదు. వీటిని కూడా మాఘ పౌర్ణమి రోజున నిషేధించారు. ఈ పవిత్రమైన రోజున పెద్దలను అవమానించకండి. ఎందుకంటే మీరు పూర్వీకుల కోపాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈరోజు చెడు మాటలు మాట్లాడకూడదు. ఇలా చేస్తే లక్ష్మీదేవి మీపై కోపంగా ఉంటుంది.

గోమాతలతో పాటు..

మాఘ పూర్ణిమ రోజున అరటిమొక్క, తులసి మొక్క, ఉసిరి చెట్టు, రావి చెట్టుతో ఇతర మొక్కలు, చెట్లను ఎట్టి పరిస్థితుల్లో హాని చేయకూడదు. ఇవన్నీ శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవికి సంబంధించినవి. గోమాతలను కూడా ఇబ్బంది పెట్టకండి. ఈరోజు గోవులకు సేవ చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది. చివరగా మాంసం, ఉల్లి, వెల్లుల్లి వంటి వాటిని తీసుకోవద్దు. కేవలం సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి.

గమనిక :

ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read

Latest Religion News

and

Telugu News

Posted in Uncategorized

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *