Mohammed Siraj Tilak: మహ‌మ్మ‌ద్ సిరాజ్.. నువ్ ఆడుతుంది భారత జట్టుకు, పాకిస్థాన్‌కు కాదు! మండిపడుతున్న ఫాన్స్

Netizens brutally trolled Mohammed Siraj after he Refuse to Apply Tilak: భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య నాలుగు టెస్టుల సిరీస్‌ కోసం క్రికెట్‌ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రస్తుతం రెండు జట్లు కూడా మంచి ఫామ్‌లో ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిరీస్ ఆసాంతం రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. బోర్డర్‌- గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫిబ్రవరి 9న నాగపూర్ వేదికగా తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ టెస్ట్ కోసం ఇరు జట్లు ముమ్మరంగా సాధన చేస్తున్నాయి. బౌలర్లు, బ్యాటర్లు చెమటోడ్చుతున్నారు. అయితే తొలి టెస్ట్ సందర్భంగా భారత క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురవుతున్నారు.  

విషయంలోకి వెళితే… భారత జట్టు ప్రస్తుతం నాగపూర్‌లో ప్రాక్టీస్ చేస్తోంది. జట్టు సభ్యులంతా నాగపూర్‌లోని ఓ హోటల్‌లో బస చేస్తున్నారు. అయితే ఆ హోటల్‌కు వచ్చిన భారత ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి హోటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. హోటల్ లోపలి వచ్చేవారికి సిబ్బంది నుదిటిపై బొట్టు పెడుతూ ఆహ్వానించారు. అలా హోటల్ సిబ్బంది తిలకం పెట్టబోతుండగా.. హైదరాబాద్ పేసర్ మొహ్మద్ సిరాజ్, కాశ్మీర్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ వద్దని నిరాకరించారు. మత విశ్వాసాలకు అనుగుణంగా ఈ ఇద్దరు తిలకం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. 

మొహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ సహా టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, సహాయక సిబ్బంది హరి ప్రసాద్ మోహన్ కూడా తిలకం పెట్టుకోవడానికి నిరాకరించారు. అయితే సోషల్ మీడియాలో మాత్రం సిరాజ్, ఉమ్రాన్‌లనే నెటిజన్లు టార్గెట్ చేశారు. ‘మహ‌మ్మ‌ద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్.. మీరు ఆడుతుంది భారత జట్టుకు, పాకిస్థాన్‌కు కాదు’ అని ఒకరు కామెంట్ చేయగా.. ‘అంతర్జాతీయ క్రికెటర్లు అయిన మీరు కూడా ఇలా చేయడం ఏంటి’ అని ఇంకొకరు ట్వీట్ చేశారు. అయితే కొందరు మాత్రం సిరాజ్, ఉమ్రాన్‌కు అండగా నిలిచారు. ఎవరి ఆచారాలు వాళ్లకు ఉంటాయి, మీరెందుకు జోక్యం చేసుకుంటారు అని ట్వీట్లు చేస్తున్నారు. 

Also Read: IND vs AUS: ఆస్ట్రేలియాదే బోర్డర్‌- గవాస్కర్ ట్రోఫీ 2023.. టీమిండియా మాజీ హెడ్ కోచ్‌ సంచలన వ్యాఖ్యలు!  

Also Read:  Assistant Director Arrested: సినిమా అవకాశాలంటూ ట్రాప్.. ఏకంగా 500 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దించిన అసిస్టెంట్ డైరెక్టర్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *