Naveen Reddy Atluri Arrested: చీటింగ్ కేసులో టాలీవుడ్ హీరో అరెస్ట్!

Tollywood Hero Naveen Reddy Atluri Arrested: టాలీవుడ్ సినీ హీరో నవీన్ రెడ్డి అట్లూరి అరెస్ట్ కావడం సినీ వర్గాలలో చర్చనీయాంశం అయింది. ఎన్ స్వ్కేర్ కంపెనీలో డైరెక్టర్ గా పని చేసిన నవీన్ రెడ్డి కంపెనీ సహ డైరెక్టర్లకు తెలియకుండా కంపెనీ ఆస్తులు తాకట్టు పెట్టారని తేలింది ఫోర్జరీ సంతకాలు చేసి కంపెనీ ఆస్తులను తన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు నవీన్ రెడ్డి మీద ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ మేరకు సుమారు 55 కోట్ల రూపాయల మోసం చేసినట్లు నవీన్ రెడ్డిపై ఎన్ స్క్వేర్ కంపెనీకి చెందిన ఇతర డైరెక్టర్లు సిసిఎస్ లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సినీ హీరో అట్లూరి నవీన్ రెడ్డి పై 420, 465,468,471 r/w 34 IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు సీసీఎస్‌ పోలీసులు. కేసు నమోదు చేసి విచారించిన పోలీసులు నవీన్‌ను చర్లపల్లి జైలుకు రిమాండ్ తరలించగా మోసం చేసిన డబ్బులతో నవీన్‌ జల్సాలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు.

అలాగే నవీన్ రెడ్డు తానే హీరోగా నోబడీ అనే సినిమా కూడా తీశాడని చెబుతున్నారు. సూర్యాపేట జిల్లా, నడిగూడెం మండలం, కోడిపుంజులగూడెం కు చెందిన నవీన్ రెడ్డి పై గతంలో బైక్ దొంగతనం కేసులు కూడా ఉన్నా సినిమాలు చేస్తూ 55 కోట్ల డబ్బు కొట్టేసే స్థాయికి ఎలా వెళ్లాడు? అనేది చర్చనీయాంశం అయింది.

నవీన్ రెడ్డి N స్క్వేర్ మూవీ మేకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బ్రిక్ టు బ్రిక్ కన్సల్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్, N స్క్వేర్ డెవలపర్స్ LLP, నికిత్ ఎస్టేట్స్ ప్రైమ్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ న్యూస్ రియల్టీ LLP, N స్క్వేర్ ప్రాజెక్ట్స్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, నికిత్ ఎస్టేట్స్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, N స్క్వేర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థలకు ఆయన డైరెక్టర్ గా ఉన్నాడు. 

Also Read: Assistant Director Arrested: సినిమా అవకాశాలంటూ ట్రాప్.. ఏకంగా 500 మంది అమ్మాయిలను వ్యభిచారంలోకి దించిన అసిస్టెంట్ డైరెక్టర్!

Also Read: Bandla Ganesh-PK Movie: ఆశల్లేవ్, పవన్ సినిమా మీద బండ్ల గణేష్ కీలక వ్యాఖ్యలు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

     

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *