Nellore Mayor Sravanthi: నెల్లూరులో వైసీపీకి మరో షాక్.. కోటంరెడ్డికే జై కొట్టిన మేయర్

Nellore Mayor Sravanthi Supports MLA Kotamreddy Sridhar Reddy: నెల్లూరులో అధికార వైఎస్సార్సీపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేయబోనని ఇప్పటికే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించగా.. తాజాగా నెల్లూరు మేయర్ స్రవంతి కూడా అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. తాను కూడా కోటంరెడ్డి బాటలోనే నడుస్తానని చెప్పారు. కోటంరెడ్డి వెంటే తన ప్రయాణం అని అన్నారు. కార్పొరేటర్‌గా.. మేయర్‌గా ఎన్నికయ్యేందుకు కోటంరెడ్డినే కారణమని ఆమె చెప్పారు. అవసరం అయితే కోటంరెడ్డి కోసం తాను మేయర్ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. 

శ్రీధరన్నతోనే నా రాజకీయ ప్రయాణం.. అని మేయర్‌ స్రవంతి చెప్పగా..  కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చలించిపోయారు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ ఇటీవల కోటంరెడ్డి వరుసగా ప్రెస్‌మీట్లు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ వీడుతున్నట్లు కూడా ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ ప్రెస్‌మీట్లకు మేయర్ భర్త కూడా హాజరయ్యారు. శనివారం నిర్వహించిన ప్రెస్‌మీట్లో మేయర్ స్రవంతితో కలిసి వచ్చారు. తాను ఒంటరిగా పార్టీ నుంచి వెళ్లిపోవడం లేదని శ్రీధర్ రెడ్డి పరోక్షంగా అధిష్టానికి హెచ్చరిక పంపించారు. 

‘నా భర్త విద్యార్థి నాయకుడిగా ఉన్నప్పటి నుంచి ఎమ్మెల్యే కోటంరెడ్డి అండగా నిలిచారు. నేను కార్పొరేటర్‌గా ఎన్నికయ్యేందుకు సాయపడ్డారు. ఆ తరువాత నెల్లూరు మేయర్ పదవి రిజర్వేషన్‌లో నాకు వచ్చేలా చూశారు. నా రాజకీయ ప్రయాణంలో శ్రీధర్ అన్న కృషి ఎంతో ఉంది. అలాంటి అన్నను నేను ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టుకోను. మేము ఎప్పటికీ శ్రీధరన్న వెంటే ఉంటాం. అన్న రాజీనామా చేయాలని చెబితే.. వెంటనే నా పదవికి రాజీనామా చేస్తా. బాధతో కాదు.. ఎంతో సంతోషంగా మేయర్ పదవికి రాజీనామా చేస్తా..’ అని మేయర్ పొట్లూరి మీడియాతో మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో కోటంరెడ్డి స్థానంలో ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డిని వైసీపీ అధిష్టానం రంగంలోకి దింపిన విషయం తెలిసిందే. నెల్లూరు రూరల్ స్థానం నుంచి ఆయనే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. మేయర్ స్రవంతి మొదటి నుంచి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డితోనే ఉన్నారు. ఆయన చొరవతోనే ఆమె కార్పొరేటర్‌గా.. ఆ తరువాత మేయర్‌గా ఎన్నికయ్యారు. అందుకే కోటంరెడ్డి పార్టీని వీడుతున్నట్లు ప్రకటించగానే.. తాను కూడా వెళ్లిపోతానంటూ ముందుకువచ్చారు. 

Also Read: YSRTP: బీఆర్ఎస్‌కు షాక్.. వైఎస్‌ఆర్టీపీలోకి కీలక నేత.. ముహుర్తం ఖరారు  

Also Read: Pakistan: పాకిస్థాన్‌లో వికీపీడియాపై బ్యాన్.. కారణం ఇదే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *