తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్ర మత్తు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే జరిగిన ప్రమాదం ఒక్కటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఓ డీసీఎం వాహనం దుండిగల్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీనితో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందగా..11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Road accident: దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం
