Tarakaratna’s Health Condition: మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో విదేశాలకు తారకరత్న

Nandamuri Tarakaratna’s Health Condition: గుండెపోటు కారణంగా తీవ్రమైన అనారోగ్యం బారినపడిన నందమూరి తారకరత్నకు గత వారం రోజులుగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉన్నట్టు నారాయణ హృదయాలయ వైద్యులు చెబుతున్నారు. నిపుణులైన ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో తారకరత్నకు చికిత్స అందిస్తున్నారు. 

నందమూరి కుటుంబానికి చెందిన నటుడు కావడం.. అందులోనూ నారా లోకేష్ చేపట్టిన పాదయాత్రలో పాల్గొన్న సందర్భంలో గుండెపోటు బారిన పడిన నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ గత వారం రోజులుగా బెంగళూరులోనే మకాం వేసి నారాయణ హృదయాలయలో వైద్యుల బృందంతో మాట్లాడుతూ తారకరత్న ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకుంటూ వస్తున్నారు. 

తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై రకరకాల వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో.. ఆ వదంతులకు చెక్ పెడుతూ నారాయణ హృదయాలయ ఆసుపత్రి వైద్యుల బృందం ఎప్పటికప్పుడు తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి హెల్త్ బులెటిన్ విడుదల చేస్తూ స్పష్టత ఇస్తూ వస్తున్నారు. తాజాగా తారకరత్న మెదడుకు శస్త్రచికిత్స జరిగినట్టు తెలుస్తోంది. 

తాజా ఆరోగ్య పరిస్థితిపై స్కాన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత డాక్టర్‌ల సలహా మేరకు మరింత మెరుగైన చికిత్స కోసం అవసరమైతే నందమూరి తారకరత్నను ఎయిర్ అంబులెన్సులో విదేశాలకు ఎయిర్ లిఫ్ట్ చేసే ఆలోచనలో కుటుంబ సభ్యులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ మీడియాకు వెల్లడించిన వివరాల ప్రకారం.. తారకరత్నను ఏ క్షణమైనా విదేశాలకు తరలించే అవకాశం ఉందని.. బాలయ్య బాబు కూడా తారకరత్న యోగక్షేమాలు చూసుకునేందుకు ఎయిర్ అంబులెన్సులో వెంట వెళ్తారని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి : Writer Padmabhushan Review : గుండెను మెలిపెట్టే మదర్ సెంటిమెంట్ తో సుహాస్ హిట్ కొట్టాడా?

ఇది కూడా చదవండి : Prema Desam Movie Review : ప్రేమ దేశం రివ్యూ.. ప్లెజెంట్‌గా సాగే ప్రేమకథలు

ఇది కూడా చదవండి : Suvarna Sundari Movie Review : సువర్ణ సుందరి రివ్యూ.. విధ్వంసం చేసే విగ్రహం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *