Telangana Budget: తెలంగాణ బడ్జెట్ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అధికార బీఆర్ఎస్ ఎంఐఎం సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సీఎం, మంత్రులు తమకు అపాయింట్‌మెంట్ ఇవ్వరని ఆపార్టీ పక్షనేత అక్బరుద్ధీన్ ఓవైసీ మండిపడ్డారు. మీరు చెప్రాసిని చూపిస్తే వారినే కలుస్తామంటూ ఎద్దేవా చేశారు. పాతబస్తీ అభివృద్ధిని ప్రభుత్వం విస్మరించిందని ఆక్షేపించారు. ఉస్మానియా ఆసుపత్రి పరిస్థితేంటని నిలదీశారు. ఉర్దూ రెండో భాష అయినా తీరని అన్యాయమే జరుగుతోందని మండిపడ్డారు. పాతత బస్తీలో మెట్రో సంగతేంటని ఆయన ప్రశ్నించారు. నోట్ల రద్దుకు, జీఎస్టీ వద్దనామని.., తమకు మెుదట్నుంచి అన్యాయమే జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాతబస్తీని ఇస్తాంబుల్ చేస్తానన్న హామీ ఏమైందని.., ఉన్నతంలోనైనా అభివృద్ధి చేసే బాధ్యత లేదా ? అని అక్బర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
అక్బర్ వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. బీఏసీ సమావేశానికి రాకుండా అక్బర్ ఈవిధంగా మాట్లడటం సరికాదన్నారు. మంత్రులు అందుబాటులో లేరని వ్యాఖ్యనించటం సమంజసం కాదన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదని., ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం ఇవ్వటం సరికాదన్నారు. శానససభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఇంతకు ముందు అక్బర్ బాగానే మాట్లాడేవాడని ఇప్పుడు ఎందుకు కోపం వస్తుందో అర్థం కావటం లేదన్నారు. అక్బర్ గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
అంతకు ముందు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధన్యవాద తీర్మానం ప్రవేశ పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కేంద్రం కాపీ కొడుతోందని సండ్ర ఆరోపించారు. రేషన్ కోసం అవసరమైన ధాన్యాన్ని మాత్రమే ప్రభుత్వం సేకరిస్తోందని చెప్పారు. దళిత బంధు పథకాన్ని విపక్షాలు అర్థం చేసుకోవాలని సూచించారు. పార్లమెంట్‌కు కేంద్ర ప్రభుత్వం అంబేడ్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేతలు కోర్టులకు వెళ్లి దళితబంధు పథకం ఆపే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు కడుపు నింపేవి కావని సండ్ర వ్యాఖ్యానించారు.
Read More Telangana News And Telugu News