కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తోంది. ఇటీవలే.. హైదరాబాద్ టు విశాఖ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. అయితే ఈ రైలు ప్రారంభం అయి నెల రోజులు కూడా కాలేదు. అయితే నెల రోజుల వ్యవధిలో రైలులో నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్నట్లు వీడియో తీస్తూ ఓ ప్రయాణికుడు ఆన్‌లైన్‌లో వీడియో పోస్ట్ చేశాడు. ఈ ఘటన వైజాగ్ నుండి హైదరాబాద్ వైపు వెళ్లే వందే భారత్ రైలులో చిత్రీకరించబడింది, అక్కడ ఒక ప్రయాణీకుడు రైలులో తీసుకున్న బ్రేక్ ఫాస్ట్ లో నాణ్యత కొరవడిందని… తన టిఫిన్ నుంచి నూనె కారుతుందని చూపిస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు.
వందేభారత్ రైలులో ప్రయాణికులకు అందించే భోజనంలో నాణ్యత లేదని, వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న రైలులో వడలో నూనె కారుతున్న విజువల్స్ చూపించాడు. ఇలాంటి అల్పాహారం తినేందుకు ప్రయాణికులు భయపడుతున్నారని ఓ జర్నలిస్ట్ తన ట్విట్టర్ ఖాతాలో వీడియో పోస్ట్ చేశారు. . ఆహార నాణ్యత బాగా లేదని ప్రయాణికులు ఆరోపిస్తున్నారని తెలిపాడు.
అయితే, ఈ వీడియోపై IRCTC (ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్) స్పందిస్తూ తాము ఈ విషయంలో దిద్దుబాటు చర్యను ప్రారంభించామని పేర్కొంది. “సర్, దిద్దుబాటు చర్యల కోసం సంబంధిత అధికారికి తెలియజేయబడింది” అని వారి ట్విట్టర్ పోస్ట్‌లో సమాధానం ఇచ్చారు.
కొత్తగా ప్రారంభించిన రైళ్లలో ప్రయాణాన్ని జనాలు పొగుడుతూనే.. సేవలు, సర్వీసుల్లో ఏమాత్రంనాణ్యత తక్కువైన వెంటనే.. సోషల్ మీడియాలో షేర్ చేస్తూ విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అయితే తాాజాగా వడ నుంచి నూనె కారుతున్న ఈ వీడియోపై పలువురు నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. ఇది పింకిీస్ కుట్ర అంటూ.. కేసీఆర్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. మరికొందరు సరదా కామెంట్లు కూడా చేస్తున్నారు. ‘ప్లేట్ వడ ఆర్డర్ చేస్తే బాటిల్ ఆయిల్ ఫ్రీ’ తినండయ్యా రుచి కావాలి అంటారు ఆయిల్ ఎక్కువ అయ్యింది అంటారు ఎలా చచ్ఛేది మీతో !’ అంటూ పోస్టులుపెడుతున్నారు.