Vani Jayaram Death సినీ ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. కళాతపస్వీ కే విశ్వనాథ్ మరణించిన రెండు రోజుల్లోనే ప్రముఖ గాయని వాణీ జయరామ్ (78) కన్నుమూశారు. ఆమెకు కేంద్రం ఇటీవలే పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించారు. ఆ పురస్కారాన్ని అందుకోక ముందే ఇలా తుది శ్వాసవిడిచారు. వయోభారం సమస్యలతోనే ఆమె మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఆమె మొహం మీద గాయాలుండటం, రక్తపు మడుగులో ఆమె కనిపించడంతో పోలీసులు అనుమాదాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. ఆమె మరణం పట్ల సినీ తారలంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.
ఆమె మరణం పట్ల రాధిక శరత్ కుమార్ స్పందిస్తూ.. వాణీ జయరామ్ గారు లేరనే వార్త తెలిసి షాక్ అనిపించింది.. నిన్న రాత్రే విశ్వనాథ్ గారి సినిమాల్లో ఆమె పాడిన పాటలు వింటూ.. ఎంత బాగుందో కదా? అని మా ఆయనతో అంటూ ఉన్నాను.. ఈ వార్త నన్ను ఎంతగానో బాధిస్తోంది అని ఎమోషనల్ అయింది.
కస్తూరీ శంకర్ ట్వీట్ వేస్తూ.. నా గుండె బద్దలైనట్టుగా అనిపిస్తుంది.. శ్రీమతి వాణీ జయరామ్ గారు కన్నుమూశారు.. కొన్ని రోజుల క్రితమే ఆమెకు పద్మ భూషణ్ అవార్డును ప్రకటించారు.. నా వర్క్ గురించి, నా డిబెట్ల గురించి ఎప్పుడూ ఆమె ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు.. ఫోన్లు చేస్తుంటారు.. ఆమెతో చివరగా దిగిన ఫోటో ఇదే అంటూ ఎమోషనల్ అయింది.
సింగర్ కౌసల్యా స్పందిస్తూ.. ఎంతో బాధాకరమైన వార్త ఇది.. పద్మభూషణ అవార్డు వచ్చిందనే సంతోషం ఒక్క వారమే ఉంది.. ఆమె గొంతే ఎంతో మంది సింగర్లను ఇన్ స్పైర్ చేస్తుంటుంది.. మిమ్మల్ని మిస్ అవుతూనే ఉంటాం అమ్మా.. మా గుండెల్లో ఎప్పుడూ మీరు సజీవంగానే ఉంటారు అని చెప్పుకొచ్చింది.
Also Read: Butta Bomma Movie Review: అనిఖా సురేంద్రన్- అర్జున్ దాస్ ‘బుట్టబొమ్మ’ రివ్యూ… హిట్ కొట్టారా?
Also Read: NTR 30 Update : డెడ్ లైన్ పెట్టిన ఎన్టీఆర్.. సిద్దంగా ఉన్న కొరటాల
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ – https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ – https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి