Vani Jayaram Death Suspicion: వాణి జయరాం నుదుటిపై గాయాలు… అనుమానాస్పద రీతిలో హాస్పిటల్ కు?

Suspicions on Vani Jayaram Death: గాయని వాణీ జయరాం కన్నుమూసిన సంగతి అందరికీ తెలిసిందే, చెన్నైలోని నుంగంబాక్కంలోని నివాసంలో ఆమె అనారోగ్యం పరిస్థితుల వల్ల మరణించినట్లు ముందు మీడియాకు సమాచారం అందింది. అయితే ఆమె మృతి అనుమానాస్పద స్థితిలో ఉన్నట్లు ఇప్పుడు కొన్ని నివేదికలు బయటకు వచ్చాయి. చెన్నైలోని నుంగంబాక్కం ప్రాంతంలో ఉన్న తన నివాసంలో వాణీ జయరాం తుది శ్వాస విడవగా ఆమెను ఎవరో కొట్టినట్టు వాణీ జయరాం నుదురు ముఖంపై బలమైన గాయాలు ఉన్నాయని ఆమె ఇంట్లో పనిచేస్తున్న పనిమనిషి గుర్తించినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పోలీసులకు సమాచారం ఇచ్చి వాణీ జయరామ్ ను పనిమనిషి స్థానికులతో కలిసి హాస్పిటల్ కు తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఆమెను ఆసుపత్రికి తీసుకు వచ్చే సమయానికి ప్రాణాలు కోల్పోయిందని డాక్టర్లు ప్రకటించినట్లు చెబుతున్నారు. పనిమనిషి ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు వాణీ జయరాం ఇంటిని తమ ఆధీనంలోకి తీసుకుని సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నారని అంటున్నారు.

ఇటీవలే పద్మ అవార్డులను ప్రకటించిన సమయంలో వాణీ జయరాంకు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పద్మభూషణ్ అవార్డును కూడా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇక ఆ అవార్డు ఆమె స్వీకరించాల్సి ఉండగా ఇలా అనుమానాస్పద స్థితిలో మరణించడం ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలను షాక్ కి గురిచేస్తుంది.

సరిగ్గా రెండు రోజుల క్రితం దర్శకుడు కె విశ్వనాథ్ మరణించడం ఆయన తెరకెక్కించిన అనేక సినిమాల్లో తన గానంతో వాణీ జయరాం అలరించడంతో ఇప్పుడు సంగీత ప్రియులంతా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆమె అనుమానాస్పద మృతి గురించి పోలీసులు ఎలాంటి వివరాలు బయటకు వెల్లడించ లేదు. ఇక ప్రస్తుతానికి అసలు ఏం జరిగింది? ఆమెకు ఎందుకు? ఎలా గాయాలు అయ్యాయి అని తెలుసుకునే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read: Vani Jayaram Passed Away: కే విశ్వనాద్ మరణం మరువక ముందే మరో విషాదం… రోజుల వ్యవధిలోనే వాణి జయరాం మృతి!

Also Read: Akkineni Akhil Agent Release Date : మరీ ఇంత వైల్డ్‌గా ఉన్నాడేంట్రా బాబు.. అఖిల్ ఏజెంట్ వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ –  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ –  https://apple.co/3loQYe 

Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *