Vastu Tips : మీ ఇంటి నెగెటీవ్ ఎనర్జీ పోవాలంటే ఇలా చేయండి..

Vastu Tips : ఇల్లు, ఇంటిని డిజైన్ చేయడం, అందంగా తీర్చిదిద్దడం చాలా ముఖ్యం. అయితే, వాస్తుని చాలా మంది ఎక్కువగా నమ్ముతారు. ఇంట్లో ఏదైనా మంచి జరగలేదంటే వాస్తుదోషం ఉందా అని అనుమానపడతారు. ఇలాంటి నేపథ్యంలో కొన్ని వాస్తు దోషాల గురించి కచ్చితంగా తెలుసుకోవాలి.

మనం రోజంతా ఎక్కడ ఉన్నా.. ఏం చేసినా చివరికి రాత్రికి ఇంటికి చేరుకుంటాం. ఎక్కువ సమయం ఇంట్లోనే ఉంటాం. అందుకే ఇంటిని అందంగా, అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ఈ ఇంటి కారణంగానే మన రోజువారీ జీవితం ఉంటుందని అనుకుంటారు.వాస్తు సరిగ్గా ఉంటే ఆ పాజిటీవ్నెస్తో జీవితంలో అన్ని సక్సెస్ అవుతాయని అనుకుంటారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

ఎంట్రెన్స్ ఎలా ఉండాలంటే..

ఏ ఇల్లైనా సరే ముందుగా ఆకర్షించేది ప్రవేశద్వారమే. ఇది మంచి పాజిటీవ్ వైబ్ని ఇస్తుంది. మీ ఎంట్రెన్స్ ఎంత బ్రైట్గా, అందంగా ఉంటే అంత బాగుంటుంది. వాస్తు ప్రకారం ఎంట్రెన్స్ తూర్పు, ఉత్తరానికి ఉండడం మంచిది. అదే విధంగా ఎప్పుడు కూడా ఎంట్రెన్స్లో వెలుతురు ఉండేలా చూసుకోండి. అదే విధంగా ఇంటి గుమ్మం ముందు చెప్పులు, షూలు లేకుండా చూసుకోండి.

సూర్యకాంతి..

సూర్యకాంతి ఒంటికే కాదు, ఇంటికి కూడా మంచిదని తెలుసుకోండి. సూర్యకాంతి ఉండడం వల్ల ఇల్లు ప్రకాశవంతంగా ఉంటుంది. దీంతో చుట్టూ ఉన్న జెర్మ్స్, నెగెటివిటీ దూరమవుతుంది. కాబట్టి ఎంత వీలైతే అంత మీ ఇంట్లోకి ఎండ వచ్చేలా చూసుకోండి.

Also Read : ఇలాంటి వారినే పెళ్ళి చేసుకోండి.. జీవితమంతా హ్యాపీనే..

స్టోన్ పిరమిడ్స్..

పెద్ద పెద్ద హోటల్స్లో స్టోన్ పిరమిడ్స షేప్లో కొన్ని డిజైన్స్, ఫౌంటేన్లా డిజైన్ చేసి ఉంటుంది. ఇవి నెగెటివిటీని దూరం చేస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇవి మార్కెట్లో, ఆన్లైన్లో కూడా దొరుకుతుంది. వీటిని మీరు ఇంటి మధ్యలో, పూజా గదుల్లో పెడితే మంచిది.

Also Read : Weight Loss Foods : ఉదయాన్నే వీటిని తింటే బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందట..

అక్వేరియం..

చాలా మంది అక్వేరియాలను ఇంట్లో పెట్టుకుంటారు. ఇవి నిజానికి చాలా మంచిది. ఇవి ఇంట్లో ఉంటే అందులోని చేపలు మన ఇంద్రియాలను శాంతపరుస్తాయిని వాస్తు శాస్త్రం చెబుతోంది. అయితే, ఈ చేపలు కూడా రంగురంగుల్లో ఉంటే చాలా బావుంటుంది. అదే విధంగా లివింగ్ రూమ్లో అక్వేరియం పెడితే పాజిటీవిటీ పెరిగి సంపద పెరుగుతుందని చెబుతుంది. అదే విధంగా గదికి ఈశాన్య, ఆగ్నేయ దిశలో ఉంటుంది.

Also Read : Weight Loss Foods : ఉదయాన్నే వీటిని తింటే బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుందట..

ఇంట్లోని వస్తువులు..

ఇంట్లో రకరకాల వస్తువులు ఉంచుతాం. వాటిని కూడా క్లీన్గా ఉంచితే చాలా మంచిది. ప్రతి వస్తువుని ఎప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేయండి. వీటితో పాటు కిటికీలు, తలుపులు తుడవండి. ఇంట్లో కిటికీల దగ్గర ఓ వాటర్ ఫౌంటెయిన్ పెట్టండి. ప్రవహించే నీరు మీ హ్యాపీ లైఫ్ని సూచిస్తుంది.

గమనిక :

నిపుణులు, ఫెంగ్ షూయ్ ప్రకారం ఈ వివరాలు, కథనాన్ని ప్రచురించాం. నమ్మడం, నమ్మకపోవడం వ్యక్తిగతం. ఇదే ప్రామాణికం కాదని పాఠకులు గమనించాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *