Viral Video: ఇదేం పిచ్చి..? కదులుతున్న కారుపై కుక్క! వీడియో

ప్రతీదానికి లిమిట్‌ ఉంటుంది. ఆ లిమిట్ దాటి ప్రవర్తిస్తే ప్రజలు తిట్టిపోస్తారు. అసలే సోషల్‌మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్న కాలమిది. ఏదైనా తిక్క చేష్టలు చేస్తే నిమిషాల్లో అది వైరల్‌గా మారిపోవడం.. దానిపై నెటిజన్లు నిప్పులు వర్షం కురిపించడం మోస్ట్‌ కామన్‌ థింగ్‌. అందుకే జాగ్రత్తగా ఉండడం మంచిది. కుక్కలను పెంచుకోవడం..దాన్ని మంచి చెడ్డలు చూసుకోవడం ఈ మధ్య కాలంలో సర్వ సాధరణమైపోయింది. కొంత మందిని తమ పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటారు. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది కానీ.. మన ప్రేమ పిచ్చిగా మారితేనే అసలు తలనొప్పి మొదలవుతుంది. ప్రస్తుతం ఓ బెంగళూరు వాసి చేసిన నిర్వాకం అలాంటిదే. ఆయన తీరుపై సోషల్‌మీడియాలో యానిమల్‌ లవర్స్‌ ఫైర్‌ అవుతున్నారు. ఇంతకు అతను ఏం చేశాడు..?

కదులుతున్న కారుపై కుక్క:

కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగిన ఓ ఘటనపై యానిమల్ లవర్స్‌ మండిపడుతున్నారు. కారు రూఫ్ టాప్‌పై ఓ కుక్క కూర్చుని ఉండగా, ఆ కారు బెంగళూరు వీధుల్లో రాత్రి వేళ చక్కర్లు కొట్టింది. ఆ కుక్క మెడకు బెల్ట్‌ ఉండటంతో అది పెంపుడు కుక్క అని క్లియర్‌కట్‌గా అర్థమవుతోంది. మరో కారులో ప్రయాణించిన వ్యక్తి తన మొబైల్‌ ఫోన్‌లో ఈ వీడియోను రికార్డ్‌ చేసినట్లు ఆ సీన్‌ చూస్తే తెలుస్తోంది. దీన్ని ట్విట్టర్‌లో ఫరెవర్ బెంగళూరు అనే అకౌంట్‌ పోస్ట్ చేసింది. నిమిషాల్లోనే ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. అయితే ఇది పాజిటివ్‌గా కాకుండా నెగిటివ్‌గా నెటిజన్లలోకి వెళ్లింది. వాళ్ల కోపానికి కూడా అర్థముందని వీడియో చూస్తే కచ్చితంగా అనిపిస్తుంది. కదులుతున్న కారుపై ఒక కుక్క భయం భయంగా కూర్చుని ఉండడంతో అది ఎప్పుడు కింద పడిపోతుందోనన్న టెన్షన్ వీడియో చూస్తున్న నెటిజన్లకు ఆందోళన కలిగించింది. కారు రూఫ్‌ టాప్‌మీద జర్నీ ఏ మాత్రం సేఫ్‌ కాదు.. అది కూడా ఓ మూగజీవిని కారు టాప్‌పై నిలబెట్టడం.. తనకేమీ పట్టనట్లు డ్రైవర్‌ కారుతో సిటీలో చక్కర్లు కొట్టడంపై ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు.

కారు డ్రైవర్ కుక్కను ప్రమాదంలోకి తోశాడని యూజర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. దీంతో పాటు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. కుక్కను ప్రమాదంలో పడవేసినందుకు డ్రైవర్‌ బాధ్యత వహించాలని కామెంట్లు పెడుతున్నారు. కారు నంబర్‌ స్పష్టంగా కనిపిస్తుందని, పోలీసులు దీనిపై దృష్టి పెట్టి ఆ వ్యక్తికి కనీసం కౌన్సీలింగ్‌ అయినా ఇవ్వాలని కోరుతున్నారు .పెంపుడు జంతువులను హింసించడం ఎంత వరకు సబబు అని ప్రశ్నిస్తున్నారు. పెంపుడు జంతువులను సరిగ్గా పెంచలేని వారు వాటిని ఎందుకు ఉంచుకుంటున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. దీన్ని పూర్తి అమానుష చర్యగా తిట్టిపోస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *