Amigos Pre Release Event: అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా అభిమానులకు జూనియర్ ఎన్టీఆర్ క్లాస్ పీకడం చర్చనీయాంశం అయింది. ఈ సందర్భంగా అభిమానులను ఉద్దేశించి మీరు ఎక్కడో చదివిదాన్ని పట్టుకొని నిర్మాతలను, దర్శకులను వేధించడం సరికాదన్నారు. మా సినిమాలకు సంబంధించిన ఏదైనా అప్‌డేట్ ఉంటే భార్యతో కాకుండా ముందుగా మీతోనే పంచుకుంటానన్నారు. ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీ పేరు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. ఇలాంటి సందర్భంలో అభిమానులకు, ప్రేక్షకులకు మంచి కంటెంట్ ఉన్న సినిమాలను అందించాల్సిన బాధ్యత మాపై ఉంది. ఏది పడితే అది చేస్తే మళ్లీ మీరు దర్శక, నిర్మాతలనే టార్గెట్ చేస్తారు. ఇక కొరటాల శివతో చేయబోయే సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ నెలలోనే పూజా కార్యక్రమాలతో ఈ సినిమా మొదలవుతోంది. మార్చి 20 లోపు సెట్స్ పైకి వెళ్లనున్నట్టు అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జూనియర్ అభిమానులకు క్లారిటీ ఇచ్చేసారు.
గతంలో కొరటాల శివ, ఎన్టీఆర్ ఇద్దరి కాంబినేషన్‌లో జనతా గ్యారేజ్ వచ్చి మంచి విజయం సాధించింది. ఇక మరోసారి వీళ్లిద్దరి కలయికలో సినిమా అనగానే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాను అండర్ వాటర్ యాక్షన్ బ్యాక్‌డ్రాప్ నేపథ్యంలో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించనట్టు సమాచారం.
అప్పుడు రిపేర్లు అన్నీ లోకల్‌లోనే జరిగాయి కానీ ఈ సారి మాత్రం నేషనల్ వైడ్ రిపేర్లు చేయబోతున్నామని స్పష్టం చేసాడు కొరటాల శివ. మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌తో సినిమా చేయబోతున్నారు. నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించబోతున్నాయి. మిక్కిలినేని సుధాకర్ ఈ చిత్రంతో నిర్మాతగా మారుతున్నాడు.
ఇందులో తారక్ స్టూడెంట్ పొలిటికల్ లీడర్‌గా నటిస్తాడని తెలుస్తుంది. గతంలో నాగ సినిమాలో ఇలాంటి కారెక్టర్ చేసాడు జూనియర్. అయితే కొరటాల ట్రీట్‌మెంట్ మరోలా ఉంటుందని అందరికీ తెలుసు. ట్రిపుల్ ఆర్ తర్వాత కచ్చితంగా జూనియర్ ఇమేజ్ పాన్ ఇండియా వైడ్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా జాన్వీ కపూర్ పేరును పరిశీలిస్తున్నారు. అందుకే దాన్ని దృష్టిలో పెట్టుకుని తారక్ సినిమాను డిజైన్ చేస్తున్నాడు కొరటాల శివ. ఈ సినిమా కోసం నందమూరి ఫ్యాన్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే రాజమౌళి తర్వాత సినిమాతో హిట్ కొట్టడం అనేది చిన్న విషయం కాదు. కొరటాల దాన్ని బ్రేక్ చేస్తాడా లేదా చూడాలి. మొత్తంగా యేడాది కాలంగా వీళ్ల కాంబినేషన్‌లో సినిమా కోసం ఎదురు చూపులు చూసిన అభిమానులకు తాజాగా అమిగోస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా క్లారిటీ ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.