ఏపీలో ఎల్లుండి జాబ్ మేళా.. ప్రముఖ సంస్థల్లో ఖాళీలు.. రిజిస్ట్రేషన్ లింక్ ఇదే

ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఈ నెల 7న నరసరావుపేటలో మరో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్ మేళా ద్వారా హెటిరో డ్రగ్స్, BZ Finserv Pvt Ltd. సంస్థలో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నారు.

ఖాళీలు, విద్యార్హతల వివరాలు:

హెటిరో డ్రగ్స్: ఈ సంస్థలో 100 ఖాళీలు ఉన్నాయి. జూనియర్.కెమిస్ట్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. బీఎస్సీ (కెమిస్ట్రీ), ఎంఎస్సీ (కెమిస్ట్రీ), బీ/ఎం ఫార్మసీ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. ఇంకా రూ.15 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 18-28 ఏళ్లు ఉండాలి.

BZ Finserv Pvt Ltd: ఈ సంస్థలో 30 ఖాళీలు ఉన్నాయి. కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ విభాగంలో ఈ ఖాళీలు ఉన్నాయి. టెన్త్ నుంచి పీజీ విద్యార్హత కలిగిన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.11 వేల నుంచి రూ.20 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 19-40 ఏళ్లు ఉండాలి.

ఇతర వివరాలు:

అభ్యర్థులు ముందుగా ఈ లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.

రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 7న ఉదయం 10:30 గంటలకు నిర్వహించినున్న ఇంటర్వ్యూలకు హాజరుకావాల్సి ఉంటుంది.

ఇంటర్వ్యూలను నిర్వహించనున్న చిరునామా: NAC Training Centre, Lingamgutla, Beside Collector Office, Narasaraopet.

ఇంటర్వ్యూలకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు ఫార్మల్ డ్రస్ తో రావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇంకా Resume, విద్యార్హతల సర్టిఫికేట్లు వెంట తీసుకురావాలని సూచించారు.

ఇతర వివరాలకు 7702700990 నంబర్ ను సంప్రదించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *